S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/13/2017 - 01:48

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు మద్యం అ మ్మకాల ద్వారా గత ఏడాది 13,500 కోట్ల రూపాయల ఆదాయం రాగా, అది రానున్న ఏ డాదికి పదిహేను వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. రాష్ట్ర విభజన ద్వారా అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ‘ఆదాయం ఏ రూపంలో వచ్చినా అంగీకారమే.. అది మహద్భాగ్యమే’ అని ప్రస్తుత పాలకులు ఆలోచిస్తే మాత్రం చాలా ప్రమాదకరం.

07/12/2017 - 01:08

గత నెల 21న ‘ప్రపంచ యోగ దినోత్సవం’ అట్టహాసంగా జరిగింది. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ అమితోత్సాహంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అనేక ముస్లిం దేశాలు సహా విశ్వవ్యాప్తంగా ఎంతోమంది యోగ దినం ప్రాముఖ్యతను గుర్తించారు. కానీ- మన కమ్యూనిస్టు సోదరులకు అది కేవలం ‘హిందూ మత’ కార్యక్రమంగా కనపడింది.

07/11/2017 - 00:05

భారతదేశం రిపబ్లిక్‌గా ఏర్పడిన 26 జనవరి 1950 నుండి నేటి వరకు 13 మంది రాష్టప్రతులను ఎన్నుకున్నారు. దేశంలో అత్యున్నతమైన రాష్టప్రతి పదవిని చేపట్టిన వారిలో చాలావరకు కులాలకు అతీతంగా ఎన్నిక కాబడిన వారే.

07/10/2017 - 00:41

రోజూ తెల్లారితే చాలు కోట్లాది మందికి అత్యవసరమైనది ‘పాలు’. ప్రజానీకంలో వాటికున్న గిరాకీని ఆసరాగా చేసుకొని ఇటీవల దేశమంతటా విచ్చలవిడిగా విషాన్ని జోడించి మరీ కల్తీ చేయడం పరిపాటైపోయింది. చివరికి పాలు అంటే ‘సైలెంట్ కిల్లర్’గా మారిపోయింది. పసిపిల్లల్నుండి వృద్ధుల వరకు పాలు వినియోగం తప్పనిసరి అని తెలిసి, పాలలో విషపదార్థాలు జోడించి కొందరు ఓ రకంగా ఉగ్రదాడి చేస్తున్నట్లు ప్రాణహాని తలపెడుతున్నారు.

07/09/2017 - 00:40

జ్యోతిషశాస్త్రం అనగానే మనకు వెంటనే స్ఫురించేది వరాహమిహిరుడు. ఉజ్జయినికి చెందిన ఈయన ఖగోళ శాస్తజ్ఞ్రుడు కూడా. 1500 ఏళ్ల క్రితమే అంతరిక్షానికి సంబంధించి ఆయన చెప్పిన విశేషాలు నేటి ఆధునిక శాస్తజ్ఞ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఖగోళ, జ్యోతిష పరిజ్ఞానం అత్యుత్తమ స్థాయిలో పరిఢవిల్లింది.

07/08/2017 - 00:59

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తె దేపా, ప్రధాన ప్రతిపక్షం వె కాపాలు ఆంధ్రుల భవితవ్యాన్ని మంట గలుపుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్ కేవలం కేసుల భయంతోనే- నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న ప్రధాని మోదీకి ‘జీ హుజూర్’ అంటున్నారు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్న ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరే రాష్ట్రంలోనూ లేదు.

07/07/2017 - 00:36

మనిషికి మెతుకు లేకుంటే బతుకే లేదు. మెతుకు అందించేవాడే రైతు. అతను క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు అరక కట్టి అహర్నిశలు కష్టపడి పంటలు పండిస్తాడు. అందుకే- ‘రౌతుకొద్దీ గుర్రం, రైతుకొద్దీ రొక్కం’ అనే సామెత పుట్టింది. మన దేశంలోని రైతుల్లో చదువుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. కష్టాలు ఎదురైతే అవగాహన లోపంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

07/06/2017 - 00:26

సర్ ఐజాక్ న్యూటన్, పియరీ డే ఫెర్మాట్ , గోట్‌ఫ్రైడ్ లెబ్నిజ్ మొదలైనవారి పేర్లు తరచుగా మనకు కలన గణితం లేదా ‘కేలుక్లస్’లో వినిపిస్తుంటాయి. కానీ, వీరందరి కంటే చాలాకాలం పూర్వమే భారతదేశపు ఖగోళశాస్త్ర వేత్త, గణిత శాస్తజ్ఞ్రుడు అయిన జ్యేష్ఠదేవుడు కలన గణిత సూత్రాలను ప్రతిపాదించాడు. వాటన్నింటినీ, తన గురువుల వద్ద నేర్చుకున్న కలన గణిత విశేషాలనూ ఆయన గ్రంథస్థం చేశారు. క్రీ.శ.

07/05/2017 - 01:04

గత నాలుగు దశాబ్దాల నుండి ప్రైవేటు విద్యాసంస్థలు మంచి పేరు సంపాదిస్తున్నాయి. మరోవైపు ఏటా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి. తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తే చదువు సరిగా రాదని, వాటికి విపరీతమైన సెలవులుంటాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. శిక్షణల పేరుతో, బోధనేతర పనులతో ప్రభుత్వ టీచర్ల వృత్తికి తరచూ ఆటంకం కలుగుతుందని, జవాబుదారీతనం అస్సలు వుండదని పేరెంట్స్ ఎప్పుడో గ్రహించారు.

07/04/2017 - 01:05

మహాత్ములు ఊరకనే జన్మించరు. ప్రజల బాధలు తీర్చడానికి అవతార మూర్తులుగా జన్మించి, వారికోసం త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో మన అల్లూరి సీతారామరాజు ఒకరు. అల్లూరి శ్రీరామరాజు 1897 జూలై 4న వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఇతనికి సత్యనారాయణ రాజు అనే తమ్ముడు, సీతమ్మ అనే చెల్లెలు ఉండేవారు. రామరాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు.

Pages