S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/02/2017 - 04:32

జీవితంలో ‘సక్సెస్’ సాధించిన విజేతలకు సన్మానం జరుగుతుంటే ఈ వరుసలో వివిధ వయసుగల వాళ్లు, వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్లు, వివిధ ప్రాంతాల వాళ్లు కనపడతారు. కొందరికి ‘సక్సెస్’ అంటే- పెద్ద ఉద్యోగం దొరకటం, ఆ ఉద్యోగం కూడా ఎక్కువ ఆదాయం ఉన్నదే కావాలి. కొందరికి పెద్ద వ్యాపారం చేస్తే సక్సెస్. కొందరు గొప్ప రీసెర్చి చేయగలిగితే వారిని సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అంటారు.

03/01/2017 - 00:12

ఏ దేశ, కాలమాన పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రజల అవసరాలు, పెరుగుతున్న సాంకేతికత, ప్రభుత్వ విధానాలు, మారుతున్న విలువలు, సామాజిక పరిణామాలను బట్టి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం కూడా మన పద్ధతులను, ప్రణాళికలను, జీవితాశయాలను మార్చుకోవలసి వస్తుంది. లేకుంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

02/28/2017 - 00:52

దేశంలో నేడు ఎన్నికలంటేనే కులాలు, మతాలు, ధనం- ఈ మూడూ అత్యంత కీలకమైనవిగా మారాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఎన్నికలొచ్చినపుడు దేశంలోని ప్రధాన సమస్యల గురించి ఆలోచించడం, వాటికి పరిష్కార మార్గాలు అనే్వషించే పరిస్థితి ఉందా? ఉచిత పథకాలను, ధన ప్రభావాన్ని నియంత్రించే మార్గమే లేదా? అందుకే సరైన ఎన్నికల సంస్కరణల గురించి చర్చించాల్సిన తరుణం ఇది.

02/27/2017 - 00:23

అంటార్కిటికా భూగోళానికి దక్షిణాగ్రాన వున్న మంచు ఖండము. దక్షిణ ధృవము ఇక్కడే ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ పేరుతో 2016లో ఒక నివేదిక ప్రచురించింది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో పశ్చిమ అంటార్కిటికా తీరాన ‘అమండ్‌సెన్ సముద్రం’ వ్యాపించి ఉంది.

02/26/2017 - 00:38

అమెరికాలోని కాన్సస్‌లో జాతివిద్వేషాన్ని జీర్ణించుకున్న ప్యూరిన్టన్ అనే నరహంతకుడి కిరాతక చర్య గురించి విన్న ఇక్కడి తెలుగువారికి వచ్చే తొలి ఆలోచన ఏమంటే- తె లంగాణ సిఎం కెసిఆర్‌కు గుడి కట్టేయ వచ్చని...

02/25/2017 - 00:10

ఇటీవల ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కొట్టంగి తా లూకా ముంగారు గుమ్మి సమీపంలో జాతీయ రహదారిపై మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చి ఎనిమిది మంది పోలీసు శిక్షణ డ్రైవర్లను బలిగొన్నారు. ఇదే ఘటనలో మరికొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత అక్టోబర్ 24న అదే రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా రామగూడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ మందుపాతరను మావోయిస్టులు పేల్చినట్టు చాలామంది భావిస్తున్నారు.

02/24/2017 - 00:45

ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు. ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల వల్ల అమెరికా అంటే చాలామందిలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఎవరైనా అమెరికా వెళ్లి వచ్చాక ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. అమెరికా గొప్పదనం ఏమంటే ఇతర దేశస్థులకు సైతం అవకాశాలు కల్పించడం. తాము ఎప్పటికీ అగ్రరాజ్యంగానే ఉండాలన్నదే అమెరికన్ల తపన.

02/23/2017 - 05:31

నా దగ్గర చదువుకున్న విద్యార్థిని చూడగానే ఎక్కడి నుంచో ప్రేమ ఉబుకరావటమే కాదు, ఆ విద్యార్థికి 50 ఏండ్ల వయసు వచ్చినా ఆ విద్యార్థి శరీరం తాకి దగ్గరకు తీసుకుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. ‘ఇదంతా ఎందుకు?’- అని నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను. పసి పిల్లవాడు చిన్నతనంలో ఎన్నో తప్పులు చేస్తాడు. ఎన్నో తుంటరి పనులు చేస్తాడు. కానీ, అవి ఏవీ జ్ఞప్తికి రావు.

02/22/2017 - 00:44

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానం విఫలమైంది. నిజానికి ఈ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీనియర్ ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపిసి విద్యార్థులకు నిర్దేశించిన ఈ పద్ధతిలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

02/21/2017 - 00:56

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతగా ప్రగతి సాధించినప్పటికీ, విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలన్న భావన మన యువతలో నానాటికీ బలపడుతోంది. ‘మేకిన్ ఇండియా’ (్భరత్‌లోనే తయారీ) పేరిట స్వదేశంలోనే మన యువత అద్భుతాలు సాధించాలని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ విదేశీ వ్యామోహం తగ్గడం లేదు.

Pages