S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/24/2019 - 01:57

భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను మిగిల్చే ‘సుస్థిర అభివృద్ధి’ భావనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని నార్వే ప్రధాని బ్రాంట్ లాండ్ అధ్యక్షతన 1987లో జరిగిన ‘ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సదస్సు’లో తీర్మానించారు. అయితే, నేడు మానవ కార్యకలాపాలు సహజ వనరుల వినాశనానికి దారితీస్తూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. భూమి అనేది సహజ వనరుల గని. విశ్వంలో అనేక జీవజాతుల మనుగడకు అనుకూలత కలిగిన ఒకే ఒక గ్రహం భూమి.

04/23/2019 - 02:12

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌తోనే మమేకం కావడంతో పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది. సాంకేతిక రంగంలోనూ, పారిశ్రామీకరణలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నప్పటికీ- ప్రపంచ స్థాయిలో మన దేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉరుకులు పరుగుల ఆధునిక జీవనం, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన దేశంలోనూ పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక పోకడలతో యువత వెర్రితలలు వేస్తోందేమో అనిపిస్తుంది.

04/21/2019 - 02:21

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజలు విచ్చలవిడితనంతో వ్యవహరించేందుకు వీల్లేదు. ముందుగా ఏర్పరచుకున్న నియమాలు- నిబంధనలు, మర్యాదలు- మన్ననలను ఆదరించాలి. అప్పుడే దానికి అర్థం.. ప్రజాస్వామ్యానికి పరమార్థం. దీనే్న బాధ్యత అంటారు. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందన్నట్టుగానే నేనొక్కడినే బాధ్యతను నిర్వర్తించకపోతే ఏమవుతుంది? నేనొక్కడినే క్రమశిక్షణను పాటించకపోతే, నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది?

04/19/2019 - 21:51

దేశంలో విద్యార్థి ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు బలహీన పడటం అటు రాజకీయంగా, ఇటు సామాజిక పరంగా వాంఛనీయం కాదు. చదువుతో పాటు దేశభక్తి, సమాజాభివృద్ధి, సేవాతత్పరతను విద్యార్థులు పెంపొందించుకోవాలి. ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది.

04/18/2019 - 03:36

‘కృష్ణబిలం’ అంటే నల్లటి ఊహాతీతమైన అంతులేని చీకటి గుహాంతర్భాగం. విశ్వాంతరాళ అంతరిక్షం లో అంతర్నిహిత అనంత అదృశ్యశక్తి ఆవిర్భావం. విశ్వంలో సూక్ష్మాతిసూక్ష్మంగా అనంతమైన సాంద్రతతో అనిర్వచనీయమైన కాలం- బిగ్‌బాంగ్ సమయంలో ఆవిర్భవించిందని, మానవజాతితో పాటు దానితో ఉన్న సర్వసృష్టి నిరంతరాయంగా అస్తిత్వంలో ఉన్నాయని అరిస్టాటిల్, ఇతర గ్రీక్ తత్త్వవేత్తలు విశ్వసించారు.

04/17/2019 - 02:12

గౌతముడు తన 37వ ఏట 49 రోజులపాటు తనదైన శైలిలో ‘సాధన’ చేసి ఈ లోకంలోని అజ్ఞానానికి, దుఃఖానికి, బాధకు పరిష్కార మార్గం కనుగొన్నాడని అంటారు. ఎంతో కాలం చేసిన అనే్వషణ ఫలించిందని పేర్కొంటారు. దాంతో అతను బుద్ధుడయ్యాడని చెబుతారు. ఈ లోకంలోని దుఃఖానికి-బాధకు కారణం సంసారం, రాగద్వేషం, తృష్ణ (కోర్కె) అని సిద్ధార్థుడు గుర్తించాడని ఆయన అనుయాయులు- అభిమానులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.

04/16/2019 - 05:13

అద్భుతాలకు నిలయమైన భారతదేశంలో తరతరాలుగా ఎన్నో కళలు వారసత్వ సంపదగా వర్థిల్లుతూ వచ్చాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు నాగరికతతోపాటు విలసిల్లుతూ తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. చిటికి పద్ధతితో తయారైన వస్త్రాలను ఆనాటి రాజులు కూడా బాగా ఆదరించారు. ఇప్పటికీ కొన్ని మ్యూజియాలలో అప్పటి వస్త్రాలు కనిపిస్తున్నాయంటే వాటి ప్రత్యేకతేంటో అర్థంగాక మానదు.

04/14/2019 - 05:15

భారత్‌లో బౌద్ధ్ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పూనుకున్నారు. 1956 అక్టోబర్ 14న పూణెలో దాదాపు ఐదు లక్షల మంది దళితులతో కలిసి ‘సమత’ను ఆశించి ఆయన బౌద్ధ్ధర్మాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం దళితులను ఉత్తేజితుల్ని చేసింది. ‘హిందూ ధర్మాన్ని వీడి బౌద్ధ్ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను..

04/12/2019 - 22:52

తనపై కేసుల సంఖ్య పెరిగిందని ‘విప్లవ గాయకుడు’ గద్దర్ ఇటీవల అల్వాల్ (వెంకటాపురం)లో వాపోయారు. 22 ఏళ్ల క్రితం తనపై జరిగిన తూటాల దాడిలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతవరకు మార్క్స్ సిద్ధాంతాలు, ఫూలే భావాల పాటతో పయనమయ్యానని ఇక ఇప్పుడు అంబేద్కర్ అడుగుజాడల్లో ‘జ్ఞానయుద్ధం’ చేస్తానని ప్రకటించారు.

04/12/2019 - 04:42

పసుపును సౌందర్య సాధనంగా, ఔషధంగా, ఆహార దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. పసుపుపంట వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మహారాష్టల్రోని సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పసుపు వ్యాపారం జరుగుతోంది. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతోంది.

Pages