S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

01/22/2017 - 07:04

ఆర్నెళ్లు సావాసం చేస్తే ‘వారు వీరు.. వీరు వారవుతార’ని పెద్దలంటారు. కేంద్ర మంత్రి వెంకయ్య , సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తరచూ చెట్టపట్టాలేసుకొని తిరగటం ఎక్కువైంది. సాధారణంగా ఏ సభలోనైనా ముందుగా సభికులకు క్రమశిక్షణపై వెంకయ్య ‘క్లాస్’ తీసుకుంటారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు వెంకయ్య పాత్రను పోషించి అందర్నీ విస్మయపరచారు.

01/08/2017 - 07:55

అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు పాండవుల పాత్రను పోషిస్తున్నారని, తాను ధర్మరాజుగా వ్యవహరిస్తున్నానని సిఎల్‌పి నేత కె. జానారెడ్డి మీడియా మిత్రులను నవ్వించారు. ‘మీలో భీముడు జీవన్‌రెడ్డేనా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా, సందర్భాన్ని బట్టి తమ పాత్రలు మారుతుంటాయని, తాను మాత్రం ఎప్పటికీ ధర్మరాజునేనని తేల్చిచెప్పారు.

01/01/2017 - 00:29

పీత బాధ పీతది అన్నది తెలుగులో బహుళ ప్రచారం పొందిన సామెత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ వారు గత 50 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారట. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం అనంతరం వీరికి బాధలు మొదలయ్యాయట. ప్రతి రోజూ ఠంచనుగా ఉదయం ఆఫీసుకు వచ్చేవారు..

12/18/2016 - 04:56

‘2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుంది. ముఖ్యమంత్రి అయ్యేది నేనే’- అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ప్రకటించి అందరి దృష్టిలో పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో ఇదే విషయాన్ని ఆయన వద్ద మీడియా ప్రస్తావిస్తే, ‘నేనే ముఖ్యమంత్రి అని చెప్పలేదు, వాళ్లు అలా రాశారు, ఎ వరైనా అలా చెబుతారా? అక్కడున్న వాళ్ల అంతా ననే్న ముఖ్యమంత్రిగా ఉండమన్నారు..’ అని వివరించారు.

12/11/2016 - 07:26

కాంగ్రెస్‌లో జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయ నాయకుల వరకూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ వల్లనే ఏర్పడలేదని గత రెండున్నర ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామేనని చె బుతున్నప్పటికీ- మరి ప్ర జలు ఎందుకు తమకు అధి కారం కట్టబెట్టలేదో వారు చెప్పలేకపోతున్నారు. వారు చెప్పేది నిజమే అయితే- టి ఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాం గ్రెస్ ఎందుకు తాపత్రయ పడినట్టు..?

12/03/2016 - 23:54

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రానికి తగ్గే ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతోనే నడిచిందా?’ అని ప్రశ్నించారు. దీనికి కెసిఆర్ ఇచ్చిన సమాధానంతో బిజెపి నాయకులు అవాక్కయ్యారు.

11/27/2016 - 07:29

సాధారణంగా ఊహాజనిత, అసాధ్యమైన విషయాలను ఎవరైనా ప్రస్తావిస్తుంటే ‘గాలి కబుర్లు’ చెబుతున్నారంటూ ఎ ద్దేవా చేస్తుంటాం. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఎదుటివారిని విస్తుపోయేలా చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారకుణ్ని తానేనని చెప్పారాయన.

11/20/2016 - 01:09

ప్రశ్నపత్రాల లీకేజీ.. బడ్జెట్ లీకేజీ.. తాజాగా 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో మరోమారు లీకేజీ మాటలు స ర్వత్రా వినిపిస్తున్నాయి. పెద్దనోట్ల మార్పిడి, చిల్లర నోట్ల కోసం జనం తల్లడిల్లిపోతుంటే ప్రతిపక్ష నేతలు పెద్దనోట్ల రద్దు వ్యవహారం ముందుగానే లీకైందని ధ్వజమెత్తుతున్నారు.

11/13/2016 - 07:01

ఎపి అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంపై కొన్ని నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆడంబరంగా జీవిస్తారని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ నిజం. ప్రజలు ఆడంబరంగా జీవించే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే సమస్య.

11/06/2016 - 01:54

అయిన దానికీ, కాని దానికీ ప్రతి రోజూ పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలూ అన్ని విషయాల్లో ‘మేమే బెస్ట్ అంటే మేమే బెస్ట్’ అంటూ రచ్చకెక్కడాన్ని అంతా అలవాటు పడ్డా, మరీ ఇంతగా పోటీ పడతారని రాజ్‌భవన్ వ్యవహారం చూసినంత వరకూ ఎవరూ అనుకోలేదు.

Pages