S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

03/19/2016 - 23:42

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల సాధనకు విపక్షాలు చేపట్టిన ఉద్యమాల సమయంలో నాయకులు తరచూ తమ ప్రసంగాల్లో ఆ నాయుడు.. ఈ నాయుడు ఒక్కరేనంటూ ధ్వజమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు కొనసాగేలా నాటి యుపిఎ ప్రభుత్వం మంత్రివర్గంలో కూడా నిర్ణయం తీసుకోగా నాడు ప్రతిపక్ష హోదాలో వున్న ఎం వెంకయ్య నాయుడు పదేళ్లు కావాలంటే, నారా చంద్రబాబు నాయుడు ఏకంగా 15ఏళ్లు కావల్సిందేనన్నారు.

03/12/2016 - 22:32

కేంద్రం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందనే భావన అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. అయితే దానికి ఒక్కో పార్టీ వారు ఒక్కో కారణం చెబుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడంలో బిజీగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ జరపలేకపోయారని, దాంతో ఆంధ్రకు అన్యాయం జరిగిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

03/05/2016 - 23:20

ఎపి, తెలంగాణ రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలకు సిఎంలుగా పనిచేస్తున్న గురు, శిష్యుల (చంద్రబాబు-కెసిఆర్) మార్గాలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. పరిపాలనాపరంగా చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలైన రైతుల రుణమాఫీ, మహిళల పెళ్లిళ్లకు చేయూత, గ్రామీణాభివృద్ధి తదితర కార్యక్రమాలు, పథకాలన్నీ దాదాపు ఒకే విధం గా ఉంటున్నాయి.

02/28/2016 - 07:29

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఫలితంగా నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ తమ పదవులకు రాజీనామా చేశారు.

02/21/2016 - 07:38

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇంటికో ఉద్యోగం మాట మార్చి..ఎమ్మెల్యేకో పదవి ఇచ్చే నైజాన్ని ప్రదర్శించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇటీవల నగరంలో జరిగిన ఒక సభలో చేసిన ఈ వ్యాఖ్య పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

02/14/2016 - 04:40

రైల్వే బడ్జెట్ వస్తున్నదంటే చాలు. ఆంధ్రాకు ఈ సారి బడ్జెట్‌లోనైనా రైల్వే జోన్‌ను కేటాయిస్తారా? లేదా? ఇదే చర్చ. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వరుసగా రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. ఆంధ్రాకు రైల్వే జోన్‌ను కేటాయిస్తామనే దానిపై ఉలూకూ పలుకూ లేదు. ఈ సారి గ్యారంటీగా రైల్వే జోన్ వస్తుందని, విభజన చట్టంలో ఉన్న హామీని నెరవేర్చుతామని కేంద్ర పెద్దలు చెబుతుంటారు.

02/07/2016 - 02:04

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అంటే కోస్తాంధ్ర ప్రజల జీవనాడి. ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేయని వారు అరుదు. విజయవాడలో ఉదయం 6.05 గంటలకు బయలుదేరే ఈ రైలు విశాఖపట్నం, మార్గంలో నగరాలకు వెళ్లేవారికి ఎంతో హాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఉదయం ఫలాహారం చేసి ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని కిటీకి రిజర్వుడ్ సీటులో కూర్చుంటే చాలు. ఆంధ్రా ప్రకృతి అందాలన్నీ తనివి తీరా చూడవచ్చు.

01/31/2016 - 07:21

రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు వేరుగా ఉంటాయి. చెప్పింది చెప్పినట్లుగా అర్ధం చేసుకుంటే పప్పులో కాలేసినట్లే. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోనే ఉంటా, ఇక్కడి నుంచి వెళ్లను, అందరి సమస్యలు పరిష్కరిస్తామని నొక్కి వక్కాణించారు. దీంతో ప్రజలు, అన్ని పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు.

01/23/2016 - 21:55

వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం దరఖాస్తులు స్వీకరించింది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అంత వరకూ ఓకే...దరఖాస్తుల్లో ఉన్న వివరాలు అధికారులను బైర్లుకమ్మేలా చేస్తున్నాయి. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన చంద్రాకృష్ణమూర్తి తన బయోడాటా అంతా తప్పులు తడకలు, అబద్ధాలతో నింపారట!

01/17/2016 - 07:47

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు అంటే ఉరుకులూ పరుగులూ, నెల రోజుల ముందు నుండే సన్నద్ధత, రికార్డులు సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకోవడం, మంత్రులతో భేటీలు, ఎమ్మెల్యేలతో చర్చలు, ఎంపిలతో మాట్లాడటం ఇలా కోలాహలంగా ఉండేది, కాని నేడు గుట్టుచప్పుడు కాకుండానే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు జరిగిపోతున్నాయి, అంతే కాదు, దాదాపు ప్రతి రోజూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లే, ఒక రోజు ప్రత్యక్షంగానూ, మరో రోజు వీడియో కాన్ఫర

Pages