S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

12/11/2016 - 07:26

కాంగ్రెస్‌లో జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయ నాయకుల వరకూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ వల్లనే ఏర్పడలేదని గత రెండున్నర ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామేనని చె బుతున్నప్పటికీ- మరి ప్ర జలు ఎందుకు తమకు అధి కారం కట్టబెట్టలేదో వారు చెప్పలేకపోతున్నారు. వారు చెప్పేది నిజమే అయితే- టి ఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాం గ్రెస్ ఎందుకు తాపత్రయ పడినట్టు..?

12/03/2016 - 23:54

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రానికి తగ్గే ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతోనే నడిచిందా?’ అని ప్రశ్నించారు. దీనికి కెసిఆర్ ఇచ్చిన సమాధానంతో బిజెపి నాయకులు అవాక్కయ్యారు.

11/27/2016 - 07:29

సాధారణంగా ఊహాజనిత, అసాధ్యమైన విషయాలను ఎవరైనా ప్రస్తావిస్తుంటే ‘గాలి కబుర్లు’ చెబుతున్నారంటూ ఎ ద్దేవా చేస్తుంటాం. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఎదుటివారిని విస్తుపోయేలా చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారకుణ్ని తానేనని చెప్పారాయన.

11/20/2016 - 01:09

ప్రశ్నపత్రాల లీకేజీ.. బడ్జెట్ లీకేజీ.. తాజాగా 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో మరోమారు లీకేజీ మాటలు స ర్వత్రా వినిపిస్తున్నాయి. పెద్దనోట్ల మార్పిడి, చిల్లర నోట్ల కోసం జనం తల్లడిల్లిపోతుంటే ప్రతిపక్ష నేతలు పెద్దనోట్ల రద్దు వ్యవహారం ముందుగానే లీకైందని ధ్వజమెత్తుతున్నారు.

11/13/2016 - 07:01

ఎపి అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంపై కొన్ని నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆడంబరంగా జీవిస్తారని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ నిజం. ప్రజలు ఆడంబరంగా జీవించే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే సమస్య.

11/06/2016 - 01:54

అయిన దానికీ, కాని దానికీ ప్రతి రోజూ పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలూ అన్ని విషయాల్లో ‘మేమే బెస్ట్ అంటే మేమే బెస్ట్’ అంటూ రచ్చకెక్కడాన్ని అంతా అలవాటు పడ్డా, మరీ ఇంతగా పోటీ పడతారని రాజ్‌భవన్ వ్యవహారం చూసినంత వరకూ ఎవరూ అనుకోలేదు.

10/30/2016 - 00:43

ఆర్థిక పరమైన లావాదేవీల్లో లక్ష్మీదేవిని, విద్యారంగంలో చదువుల తల్లి సరస్వతిని మనం తలుచుకుంటాం, ప్రార్థింస్తూంటాం. అయితే, యాదృచ్ఛికంగా తొలిసారి ఆంధ్ర ప్రదేశ్‌లో ముగ్గురు మహిళామూర్తులు విద్యారంగానే్న శాసిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

10/23/2016 - 01:08

చంద్రబాబు కుమారుడు లోకేశ్‌బాబు తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించారు. తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్‌ష ఆస్తి ఎక్కువ ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, రెండున్నర ఏళ్ల నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆస్తి అప్పుల మధ్య సమతూకం కనిపించగా, మాటలు ఇంకా రాని మనవడికి అప్పుడే కోట్ల రూపాయల ఆస్తి ఉంది.

10/16/2016 - 07:50

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి రెండు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ, పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండిపోయానన్న కసి, ఆవేదనతో ఆయనలో చాలా మర్పు కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తాజాగా మూడురోజులపాటు ఎటూ కదలనీయకుండా కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతటితో ఆయన ఆగారా..?

10/09/2016 - 00:49

నేడు మీడియా పవర్ ఫుల్‌గా మారుతోంది. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం చెప్పిందే ఒకటికి పదిసార్లు చెప్పాల్సిరావటమే కాదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ స్టిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు శాసనమండలి వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి. అంతెందుకు ..? చివరకు.. పదిసార్లు మంగళసూత్రం కూడా కట్టాల్సి వస్తోందని ఆయన అన్నపుడు నవ్వులు విరిశాయి.

Pages