S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

10/01/2016 - 23:57

ఎపి రాజధాని అమరావతిలో పాలనను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి సచివాలయ సిబ్బందిని, ఇతర శాఖల సిబ్బందిని తరలించడానికి రెండేళ్లుగా తపన పడుతునే ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ 1 నాటికి అధికారులు అంతా వెలగపూడి సచివాలయం నుండే కార్యకలాపాలు నిర్వహించాల్సిందేనని ఆదేశించారు.

09/25/2016 - 00:55

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరకు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదన ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ముందుగానే ఒక అంచనాకు వచ్చి మీడియా వార్తలపై ఆధారపడి దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది.

09/18/2016 - 03:07

నరుూమ్ ఒక కరుడు గట్టిన మాఫియా డాన్ మాత్రమే కాదు, ఆయనకున్న మరో కోణం కూడా వెలుగు చూసింది. ఆధునీక టెక్నాలజీతో పౌర సేవలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన డిజిటల్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ స్ఫూర్తిని రాష్ట్రాలు ఎంత మేర వినియోగించుకున్నాయో కానీ విప్లవ పార్టీ నుంచి మాఫియా డాన్‌గా మారిన నరుూమ్ మాత్రం అక్షరాల వినియోగించుకున్నట్టు సిట్ దర్యాప్తులో బయటపడింది.

09/11/2016 - 04:11

ఒక్కొక్క నాయకుడు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ఒక్కో పదం ప్రాచుర్యంలోకి వస్తుంటుంది. తాజాగా ఆంధ్రాలో రెయిన్ గన్స్ అనే పదం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. విపక్షనేత జగన్ చెప్పినట్లు రెయిన్ గన్స్ వాడకం పదేళ్ల నుంచి ఉంది. నీటి వినిమయం పొదుపుగా ఉండేందుకు, పంటలు కాపాడేందుకు రెయిన్ గన్స్‌ను వినియోగిస్తారు. ఈ పదం అంతగా వాడుకలో లేదు.

09/04/2016 - 00:11

రాజకీయాల్లో జానారెడ్డి రూటే వేరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడేది అబద్ధం అయినా గట్టిగా మాట్లాడాలి అంటారు. మహారాష్టత్రో ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ గతంలోనే ఒప్పందం చేసుకుంది అని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా, జానారెడ్డి ఒక్కసారిగా ప్రతిపాదనలు నిజమే కానీ ఒప్పందం జరగలేదు అని విలేఖరుల సమావేశంలో తేల్చి చెప్పారు.

08/28/2016 - 01:13

దేశంలో సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది నేనే...ఐటి ఉద్యోగాలు ఇప్పించింది నేనే...బిల్‌గేట్స్‌ను రప్పించింది నేనే... హైటె క్ సిటీని కట్టింది నేనే...ఐటి ఉద్యోగాలు కల్పించింది నేనే... ఫలానా దేశ అధ్యక్షుడు వాళ్లమ్మాయికి పెళ్లిసంబంధాలు కూ డా చూడమన్నారు...ఇంత ఆత్మవిశ్వాసంగా చెప్పగలిగేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే.

08/21/2016 - 00:43

గ్యాంగ్‌స్టర్ నరుూమ్ కిరాతకాలు ఒకవైపు బయటపడుతుంటే మరోవైపు వైపు నరుూమ్‌కు సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తొలుత నాకేమీ సంబంధం లేదు అని చెబితే, తరువాత మాజీ డిజిపి దినేశ్‌రెడ్డి తాను డిజిపిగా ఉన్నప్పుడు నరుూమ్‌ను చూడలేదు అన్నారు.

08/14/2016 - 05:17

లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నరేంద్ర మోదీతో బిజెపి బహిరంగ సభ. తెలంగాణలో ప్రజాస్వామ్యం మంటగలిసింది, ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, కెసిఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయి అంటూ నిప్పులు చెరిగారు.

08/07/2016 - 00:12

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వక పోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటో ఆంధ్రుల సత్తా ఏమిటో కేంద్రానికి చూపిస్తామని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్రాన్ని హెచ్చరించారు. రాజ్యసభ చర్చలో సైతం హెచ్చరికకు ఏ మాత్రం తగ్గకుండా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. మిగిలిన నాయకులందరి కన్నా గట్టిగా మాట్లాడారు.

07/31/2016 - 21:50

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనా లేక కజకిస్తాన్ , సింగపూర్, కౌలాలంపూర్ అలా ఏదైనా నగరంగా మారిపోతుందా అంటూ విపక్షాలు అధికార పక్షంపై సెటైర్లు వేస్తున్నాయి. కారణం లేకపోలేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ నగరానికి పోతే ఆ నగరంతో అమరావతిని పోల్చడం, అదే మాదిరి అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పడంతో ఇంతకీ రాజధాని అమరావతేనా అని విపక్షాల నేతలు నవ్వుతూ ప్రశ్నిస్తున్నారు.

Pages