S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

07/24/2016 - 01:00

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడచిన రెండేళ్లుగా ఎప్పుడు మీడియాతో భేటీ అయినా, రాజకీయపరమైన సభ అయినా, కాకపోయినా, మరెలాంటి సభ అయినా కావచ్చు.. ముందుగా రెండు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం సర్వసాధారణమైంది. ఆయన మిత్రపక్షం బిజెపి పూర్తి మద్దతుతో విభజన బిల్లును నాడు పార్లమెంట్‌లో ఆమోదం పొందింపజేసి ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది.

07/19/2016 - 21:18

అన్ని జన్మలకంటే మానవ జన్మ ఉన్నతమైనది. ఈ మానవ జీవితంలో మానవులు సాధించాల్సిన పురుషార్థములు నాలుగు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. పెద్దల మాట సద్దిమూటలాంటిదిగదా! ఈ చతుర్విధ పురుషార్థములే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థములు పూలుగా పూచిన పుణ్య భారతదేశం మనది. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగానే ఆధ్యాత్మిక రంగంలో కూడా మహోన్నతంగా ఎదిగింది.

07/17/2016 - 05:10

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. రష్యాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన చంద్రబాబు ఆ రాష్ట్రాల నుంచి నవ్యాంధ్ర రాజధానికి నేరుగా విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటించారు. ఏ దేశంలో విమానయాన రంగం అయినా వ్యాపారమే. ప్రయాణికులు ఉంటారు లాభసాటిగా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానాలు నడిపిస్తారు.

07/10/2016 - 03:49

ఈ ఏడాది వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జాతకం బాగా లేదని పంచాంగ శ్రావణం రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. వైద్యఆరోగ్యశాఖ మం త్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి నిజంగానే జాతకం బాగ లేనట్టుగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖకు మునుపెన్నడూ లేనివిధంగా బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించినప్పటికీ, ఆ మేరకు సర్కార్ వైద్యాన్ని మెరుగు పరచలేక మంత్రి సతమతమవుతున్నారు.

07/03/2016 - 01:50

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి , పగలు, నిన్న, నేడు రేపు అనే తేడా లేకుండా పని చేస్తుండడం వల్ల నిద్రా దేవి ఆయన ఎప్పుడు నిద్ర పోతాడా? అని ఎదురు చూసి బాబు నిద్ర పోక పోవడంతో నిద్రా దేవి తానే నిద్ర పోయిందట! ఇది ఫేస్‌బుక్‌లో టిడిపి అధికారిక పేజీలో బాబు విదేశీ ప్రయాణంపై రాసిన పోస్ట్. బాబు ఇమేజ్ పెంచాలనే ఉద్దేశం బాగానే ఉంది. అభిమానం బాగానే ఉంది కానీ ఇది ఫేస్‌బుక్‌కు మంచి మసాలా ఐటంగా మారింది.

06/25/2016 - 23:15

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మతి ఇరానీకి కోపం వచ్చింది. మహిళా మంత్రినైన నన్ను డియర్ అంటారా? అని బిహార్ విద్యా శాఖ మంత్రి అశోక్ చహన్‌పై కస్సుమన్నారు. డియర్ (ప్రియమైన) అనే పదం సాధారణంగా వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా వినతి పత్రాల్లో తప్పని సరి. గౌరవప్రదంగా రాశానని సదరు విద్యా మంత్రి చెప్పినా, ఆమె వినిపించుకోలేదు. ‘ఆదరణీయ’ అనే పదానే్న వాడుతుంటానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

06/19/2016 - 00:44

కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని తామెందుకు పార్టీ మారుతున్నామో సుదీర్ఘంగా వివరించారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌లతో పాటు నాయకులంతా తమతమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాత్రం ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని ఆవేదనతో ఉన్నట్టు చెప్పారు.

06/12/2016 - 02:01

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ముప్పుందని ఒకరు.. తెలంగాణ ఉద్యమ నేతకు రక్షణ కల్పించాలంటూ మరొకరు.. కాగా హైకోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వానికి విన్నవించే సంఘటనలు విస్మయాన్ని కల్గిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందంటూ కేంద్ర భద్రత కల్పించాలని ప్రతిపక్ష టిడిపి నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

06/04/2016 - 23:44

అడుసు తొక్కనేల, కాలుకడగనేల అనే సామెత ఊరికే రాలేదు. వైకాపా నుంచి ఎన్నికై టిడిపిలో చేరిన వారికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు అభివృద్ధిని చూసి ఆనందపడి 17 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. కాని అక్కడికి వెళ్లినప్పటి నుంచి అప్పటికే అక్కడ ఉన్న స్థానిక టిడిపి నేతలతో కీచులాటలు మొదలయ్యాయి. అనేక చోట్ల మినీ మహానాడులు జరిగాయి.

05/29/2016 - 03:20

తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించి ఏ విధంగా ఆట్టహాసంగా నిర్వహించాలో మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరిదాకా అడ్డుకున్న టిడిపితో కలిసి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Pages