S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ బండ

10/01/2016 - 07:37

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే’ అన్నట్లు గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. మెజారిటీ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టి.పిసిసి అధ్యక్షుడిగా కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. ఉత్తమ్ తన సొంత జిల్లా అయిన నల్లగొండలోనే గ్రూపులు లేకుండా చేయలేకపోయారన్న విమర్శ ఉంది.

09/24/2016 - 00:41

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్ళాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది. ఆ దిశగా అడుగులు వేసి ఈ నెల 19, 20 తేదీల్లో నగరంలో స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినా, ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందన్న ఆత్మావలోకనంలో నేతలు పడ్డారు.

08/27/2016 - 07:24

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మ హారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం ఒకవైపు ఫడ్నవీస్‌తో మూడు ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు.

08/20/2016 - 08:15

ఆలస్యం అమృతం విషం అని పెద్దలు ఊరకే అనలేదు. అలస్యం చేస్తే విషమ పరిస్థితులు వస్తాయని, చేయి దాటి పోతుందనేది ఉద్దేశ్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా అదే జరిగింది. నీటి పారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో టి.కాంగ్రెస్ ఆలస్యంగా మేల్కొంది. నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.

08/13/2016 - 02:37

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి సారి ప్రధాని నరేంద్ర మోదీ అడుగు పెట్టడంతో పార్టీ భవిష్యత్తుకు బాట పడుతుందన్న ఆ పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. ప్రధాని మోదీ రాకతో తెలంగాణలో బిజెపికి దశ తిరుగుతుందని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరారు. కొత్త రాష్ట్రానికి భారీగా నిధులు సమకూరుతాయని ప్రజలు ఆశించారు. కానీ ఈ రెండూ జరగలేదు. ప్రధాని ప్రసంగం చాలా సాదా, సీదాగా జరిగింది. రాష్ట్రానికి కొత్త వరాలు ఏవీ రాలేదు.

08/06/2016 - 05:03

రెండు తెలుగు రాష్ట్రాలు తలనొప్పులను ఎదుర్కొంటున్నాయి. రెండేళ్ళు సాఫీగా జరిగిందనుకుంటే మూడవ సంవత్సరం ఆరంభం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్ర విభజన జరిగి తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం వెంటాడుతూనే ఉన్నది. తాజాగా అది మరింత ఉధృతమైంది.

07/30/2016 - 00:26

తెలంగాణ రెండు ప్రధాన అంశాలతో భగభగమంటోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రెండేళ్ళ పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చింది. మూడవ ఏట అడుగు పెట్టినప్పటి నుంచి ఒకవైపు మల్లన్న సాగర్, రెండో వైపు ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీతో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ సమస్యలతో ప్రభుత్వం బేజారెత్తుతోంది.

07/23/2016 - 00:27

వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా అధికార, పాలక ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో కొత్తదనం ఏముందీ? ఏ పార్టీలైనా అధికారం కోసం వెంపర్లాడడం సహజమే కదా అని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య పోటా పోటీ నడుస్తోంది.

07/09/2016 - 07:49

నగరంలో ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్టు చేయడం తో కలకలం చెలరేగింది. విధ్వంసానికి జరిగిన కుట్రను ఎన్‌ఐఎ ఛేదించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో మార్మోగేదేమో. ఏదైతేనేం, ఎన్‌ఐఎ పుణ్యమాని బయటపడింది. కానీ అరెస్టు అయిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ నేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే్న లేపాయి.

07/02/2016 - 02:48

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షునిగా కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించారు. కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమితులై ఏడాదిన్నర అయ్యింది. పార్టీని ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి అటు అధిష్టానానికి, ఇటు పార్టీ నేతలకు కలుగుతున్నది.

Pages