S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ బండ

01/29/2016 - 23:34

ఎవరైనా సమయానికి భోజనం చేయకపోతే అజీర్ణం అవుతుంది, లేనిపోని అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే చాలా మంది సకాలానికి భోజనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి గురువారం (28న) చాలా ఆలస్యంగా భోజనం చేశారు. ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా కాలంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది.

01/22/2016 - 23:34

జిహెచ్‌ఎంసి ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలో తిప్పలు తప్పలేదు. టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల్లో ఇవి కొంత తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, బిజెపిల్లో ఆగ్రహజ్వాలలు రగిల్చాయి.

01/09/2016 - 04:13

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ ఓ పరీక్ష వంటివే. గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దిగా ఎక్కువ, తక్కువతో అన్ని పార్టీలకూ బలం ఉంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలకే బలం ఎక్కువ ఉన్నా, టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపుల తర్వాత ఆ పార్టీ పుంజుకుంది.

01/02/2016 - 07:00

కొత్త ఏడాదిలోకి (ఆంగ్ల) అడుగు పెట్టాం. ఈ ఏడాది అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గ్రహఫలాలపై నమ్మకం ఉన్న వారు తమ రాశి ఎలా ఉందోనని ఆసక్తిగా తెలుసుకోవడం సహజం. అలాగే రాజకీయ పార్టీల నేతలూ గత ఏడాది చేదు అనుభవాలను మరిచి పోయేలా, ఈ ఏడాది అంతా శభం జరగాలని ఆశిస్తున్నారు. గత ఏడాది (2015) సాధించిన విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయని మధనపడిపోతున్నారు.

12/26/2015 - 00:01

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ఈ ఏడాది (2015) కలిసి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి శంకుస్థాపన పేరిట హడావుడి చూపించడం, తెలంగాణలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకెళుతూ, తాజాగా అయుత చండీయాగంతో బిజీగా గడిపేస్తున్నారు.

12/19/2015 - 00:04

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో విపక్షాలు భీతిల్లుతున్నాయి. స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి (కౌన్సిల్) జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపిలకు చెందిన అభ్యర్థులే అధికార పార్టీలోకి ఫిరాయించడంతో విపక్షాల నేతలను ఆందోళనకు గురి చేస్తున్నది.

12/12/2015 - 04:54

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పార్టీల గుర్తుల ఆధారంగా మీడియాలో పతాక శీర్షికల్లో సైకిల్ దూసుకెళ్ళిందనో, సైకిల్ ఫంక్చర్ అయ్యిందనో, ‘కారు’ స్పీడు, గులాబీ గుబాళించిందనో, రెక్కలు విరిగిన ‘్ఫ్యన్’ అనో ఇలా రకరకాల వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.

12/05/2015 - 04:01

ఇటీవల వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌కు ప్రధాన దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత జిల్లా, సొంత నియోజకవర్గమైన మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగ్గా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయినా కనీసం డిపాజిట్ దక్కించుకుంది. డిపాజిట్ దక్కిందని చెప్పుకోవడానికైనా మిగిలింది.

11/28/2015 - 04:24

వరంగల్ ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు చతికిలపడ్డాయి. బిజెపికి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ బలంగా నిలిచినప్పటికీ మూడో స్థానంలోనే నిలిచింది. జాతీయ పార్టీలకు ఒక విధానం ఉంటుంది. జాతీయ నాయకులు ఇతర రాష్ట్రాల్లో సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. అక్కడి రాష్ట్ర పార్టీ నేతలకు ఇబ్బంది లేకుండా అవతలి పార్టీపై విసుర్లు విసరడం సహజం.

11/20/2015 - 23:26

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలకూ ఇదో పరీక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ పని తీరుకూ ఒక పరీక్ష వంటిదే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇది కఠినమైన పరీక్ష. ప్రభుత్వ పని తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించగలిగామా? లేదా? ప్రజలు ఏ మేరకు ఆదరించారు అనేది ఈ ఉప ఎన్నిక ఫలితంతో తెలియనున్నది.

Pages