S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

06/25/2017 - 00:34

మొన్న ప్రజాకవి గూడ అంజయ్య, ప్రొఫెసర్ జయశంకర్‌ల వర్థంతి రోజు.
ఎన్నో ఆలోచనలు. రెండు దశాబ్దాల కుదుపులు. ఇంకా ఆరని తెలంగాణా కుంపటి. విడి రాష్ట్రాలు ఏర్పడ్డాక లబ్ధిదారులు ఎవరని ప్రశ్నించుకుంటే ప్రజలకన్నా అదృష్టవంతులు పాలకవర్గాలే, వారి తొత్తులే హాయిగా ఉన్నారు.
ఏదో తెలియని విషాదం. పైపైన మాత్రం సబ్ టీక్ హై అన్న హూంకరింపు.

06/18/2017 - 01:22

వారం దాటలేదు. సినారె మరణం తర్వాత కొంత కలకలం. ఆయన లేని లోటు ఒక కారణం. ఇక ఆయన కళ్లు తెరవరని తెలిసి, కొందరు తెరతీస్తున్నారు అపవాదనలకి, వివాదాలకి. మొన్న 15న హనుమకొండకి వెళ్ళాను. అక్కడ తెలంగాణ రచయితల వేదిక (తెరవే) వరంగల్ శాఖ సినారె నివాళి సభ ఏర్పాటుచేసింది. అదే రోజు ఉదయం మహబూబాబాదు వెళ్లాను కవి అన్వర్‌తో కలిసి.. అక్కడ కొందరు రచయితలను కలవడానికి.

06/11/2017 - 01:13

ఈనెల 3న ‘నల్లవలస’- పెద్ద కవిత పుస్తకం- విడుదల చేస్తున్నానని, మీరు పాల్గొనాలని కె.శివకుమార్ అనే కవి అడిగాడు. అందుకు ఒప్పుకున్నాను. పుస్తకం ప్రెస్‌లో ఉందని, తదుపరి అందిస్తానని చెప్పాడు. కానీ, ఆ పుస్తకం సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గుడిహళం రఘునాథం, కె. శివకుమార్ సామూహికంగా రూపొందించిన కవిత అని, 1998లోనే అది అచ్చయ్యిందని తెలిసింది. ఇప్పుడు శివకుమార్ తన ఒక్కడి పేర అచ్చేసుకుంటున్నాడని తెలిసింది.

06/04/2017 - 04:05

ఆ మధ్య రెండు రోజుల వ్యవధిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో తిరగవలసి వచ్చింది. ఈ కాలంలో తిరగడం శ్రమే. అయినా మధ్యమధ్య రోడ్డుపక్కన టీ కొట్లవారితో, కాస్తంత దూరంలో రైతులు, రైతుకూలీలతో, వివిధ వృత్తులవారితో మాట్లాడ్డం, వారిని వినడం అపూర్వ అవకాశం. వారి మాటలు సుస్పష్టం. తమ బాధలే కాదు, ఇతరుల బాధల్ని వినిపించడం వారి సహజ గుణం.

05/28/2017 - 07:11

చరిత్రలో ఎప్పుడూ అన్ని నదీమ సంస్కృతులపై గంగానది పెత్తనమే. తుంగభద్ర, కావేరి, కృష్ణా, గోదావరి తదితర నదులపై దాని ఆధిపత్యమే. భాష కావచ్చు. లిపి కావచ్చు. చరిత్ర కావచ్చు, మతం కావచ్చు. వైదికం, శక్త్యారాధన కావచ్చు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం కావచ్చు. తెలుపు, నలుపుల వర్ణవివక్ష కావచ్చు. ఎత్తుపల్లాల భౌగోళిక దృక్పథం కావచ్చు. ఉత్తర భారతం దక్షిణ భారతాని కన్నా మిన్న అనే భావన సదా విర్రవీగుతుంటుంది.

05/21/2017 - 08:00

కాశం జిల్లా కొరిటిపాడు మండలం రావినూతలలో మా శిష్యుడి పెళ్లి. ఎండలు రావద్దంటున్నాయి. ‘రండి సార్! అదే రోజు మా ఇరవై ఎనిమిదవ పెళ్లిరోజు. మీరొస్తే బాగుంటుంద’ని నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పిలుపు. అంతదూరం పోయినప్పుడు అదే ప్రాంతంలోని వేటపాలెం లైబ్రరీకి వెళ్లాల్సిందే. ఆ ఊరిలో మిత్రుడు సజ్జాని కలవకమానను.

05/14/2017 - 01:28

తమ స్వరం వినిపించడానికి పాలకులకు అనేక మార్గాలు, స్థలాలు ఉం టాయి. ప్రత్యేక శాఖలు, అనేకమంది వ్యక్తులు ఉంటారు. సచివాలయాలు, ప్రగతి భవన్‌లే గాక ప్రత్యేకంగా సమాచార శాఖ ఉంటుంది. మం త్రుల పేషీలు ఈ పట్టికలో చేరాయి. ఆయా శాఖలకు ప్రత్యేక పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. అంతెందుకు.. కొన్నిసార్లు ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ప్రభుత్వ పత్రికల వలెనే పనిచేస్తుంటాయి.

05/07/2017 - 08:37

పోయిన వారం ఓ న్యూస్ చానెల్‌లో ‘దేవులాట’ కార్యక్రమం చర్చాగోష్టికి వెళ్లాను. వార్తలు, ఇతర కార్యక్రమాలన్నీ ప్రజల భాషలోనే ప్రసారం చేయాలని వారి ఆరాటం. అంటే తెలంగాణ మాండలిక భాషలోనే ఉండాలనే ప్రయత్నం. కొందరు రచయితలను, భాషా విభాగంలో పనిచేసిన వారిని పిలిచి భాషారూపం, పదాలు, జాతీయాలు వంటివి ఎలా ఉపయోగించాలనే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలోనే ఫోను మోగింది.

04/30/2017 - 07:46

కొందరు తమ జీవితాలను పాడుచేసుకుని అస్తిత్వాన్ని నిలుపుకునే ‘అహం’ రూపెత్తుతారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తమ పంతం సాధిస్తారు. ఎదుటివాడిని నామరూపాలు లేకుండా చేసి, అంతా ‘తానే’ అనుకుంటాడు. కులంలో పెద్దననిపించుకోవడానికి కులాన్ని వాడుకుంటాడు. ‘మతం’లో ఉండి తనకోసం మతాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఊరిమీద పెత్తనానికై ప్రజల మధ్య చిచ్చుపెడతాడు. అత్యధిక శాతం ఈ జబ్బుతో బాధపడుతుంటారు.

04/23/2017 - 00:51

పోయినవారం కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో తిరుగులాట. నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ సదస్సు. మూడు రోజుల తరువాత చెన్నైలో మార్కండేయ పురాణం గ్రంథావిష్కరణ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా నాగసూరి వేణుగోపాల్ ఆహ్వానం. ఈ రెండు పనుల మధ్య మూడు రోజుల తీరిక. ఏంచేయాలో పాలుపోని సమయంలో పాత జానపద పరిశోధక మిత్రులు కొండ కోనల కళారూపాలు చూడాలని పిలుపు.

Pages