S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

02/03/2018 - 23:58

మొన్న ఆలేరు పట్టణానికి కొద్దిదూరంలో ఉన్న కొలనుపాక గ్రామానికి వెళ్లాను. అప్పుడు అక్కడ ఉన్న 18 మఠాలాయాలను చూశాను. అప్పుడు ఎప్పుడో ఎక్కడో చదివిన ఈ పద్య పంక్తులు గుర్తొచ్చాయి. అక్కడి నుంచి వచ్చాక ఆ కావ్యం తీసి చదివాను. ఆ విషయాలే ఈ వారం ముచ్చట్లు..
‘ప్రతి జాతి (కులం)కొక్క దేవళము వంతున
సర్వ వర్ణంబులకును దేవళములుండె ఇచట’

01/28/2018 - 00:39

సాహిత్య చరిత్ర రచన చాలావరకు సంప్రదాయ పద్ధతిలోనే కొనసాగింది. అందువల్ల కవిత్వ విమర్శకో, సాహిత్య విలువల నిర్థారణకో- కవి జీవిత చిత్రణకో- కుదించుకుపోవడంవల్ల దానికి ఎన్నో పరిమతులు ఏర్పడ్డాయి. విశాల సమాజానికీ, విస్తృత జ్ఞానానికీ సంబంధించిన చాలా అంశాలు సాహిత్య చరిత్రకి దూరంగానే ఉండిపోయాయి.

01/14/2018 - 00:54

‘సమాంతరం’ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయ. దానినే ‘ప్రత్యామ్నాయం’ అని కూడా భావించే వారు ఉన్నారు. సమాంతరం, ప్రత్యామ్నాయం ఏదైనా అంతిమంగా అది ప్రజాసాహిత్యం అనే విస్తృతార్థంలో హాయిగా కలిసే పాయలే. ప్రజలు- పాలకులు, ప్రజలు-పండితులు, ప్రజలు-పరాయికరణ వంటి వ్యతిరేకార్థాలు, చట్రాలు, ఉత్తర దక్షిణ ధృవ తేడాలు కొట్టవచ్చినట్లుగా కనుపిస్తాయి.

01/07/2018 - 00:34

సమ్మక్క సారమ్మ జాతర దగ్గర పడుతోంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈసారి జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తారు. సమ్మక్క సారమ్మలను దేవతలుగా కోయ ప్రజలు కొలుస్తారు.

12/24/2017 - 00:43

ప్రతి కవిత ప్రపంచాన్ని కొత్తగా ఊహింపచేస్తుంది. మెరుగు దిద్దుతుంది. అలాంటి కొత్త కవిత అద్దబడినప్పుడల్లా లోకం పూర్వంలా ఉండదు అంటాడు డిలాన్ థామస్. అంటే కవి ఒక కొత్త పళూఒజ్యశ, చిళళజశ ఒజదఆ ఇస్తాఢు. అందుకే కవిత్వానికి అంత గౌరవం. అంతకన్నా ఎక్కువ అనాదరం.

12/17/2017 - 04:32

గుండెలదిరేలా తెలుగు మహాసభలు ఆరంభమయ్యాయి. భాషా పండగ (ప్రారంభ సభ) అదిరిపోయింది.
బాణాసంచా వెలుగులు, లేజర్ మిరుమిట్లు చూసి తెలుగు ప్రజలు ఆనందంతో పులకించిపోయారు.
అనుకున్న దానికన్నా అధికంగా జనం విరగబడిన సభ ఈ మధ్య ఇదే.
భాషా సాహిత్యాల పండుగ కనుల పండగ్గా జరిగింది.

12/10/2017 - 03:44

నాలుగు డిగ్రీల వేడి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా... మహాసభల వేడుకల ప్రచారమే.. మొదట మూడు సభల్లో లేనంత సందడి. సందడి చేసేది ప్రజలు కాదు. పత్రికా రంగం, దృశ్య మాధ్యమాలు. తమ ఇంట్లో పెళ్లివైభవాలు జరిగి ఆబ.... ఎంతగా ఉవ్విళ్లూరుతున్నారంటే ఏదో ఒకటి రాయకపోతే ఏమి అనర్థం జరుగుతుందోనన్నంత..

12/03/2017 - 01:01

‘గోలకొండ కోటలో యువరాణి’ ఇవాంకా ట్రంప్ అలా మెరసి ఇలా అమెరికా విమానం ఎక్కేశారు.
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు 28 నవంబర్‌న ప్రారంభమైంది. ఆ సభలో ఆమె మొదటి ఆకర్షణ. హైదరాబాద్ అధికారిక అతిథిగా ఇవాంకా పేరు రాష్టమ్రంతా మారుమోగింది. రెండోరోజు ఉదయం జిఈఎస్ సమావేశం, పగలు గోలకొండ సందర్శన, రాత్రి విందు తదుపరి విమానాశ్రయం.

11/25/2017 - 22:40

మరోసారి ‘ఒంటరి చేతి పోరాటం’ గురించి ముచ్చటించుకుందాం. ఎందుకంటే నిన్న ఒ.ఎల్లారెడ్డి కాస్తంత నీరసంగా, ఒకింత నిర్వేదంగా గత రెండేళ్ళ నుండి తాను చేస్తున్న ఉద్యమం గురించి మరిన్ని వివరాలు చెప్పాడు. తన వద్ద వున్న కోర్టు సంబంధించిన కాగితాలు, పురావస్తు సంపదకు చెందిన ఫొటోలు ఫైళ్లలోంచి తీసి చూపించాడు.

11/19/2017 - 01:42

మొన్న ఒంగోలు లో పెళ్లి, నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఒక విందుకి హాజరయ్యా ను. అంతకు ముందు టీ వీల్లో రెండు పెళ్లి ఫంక్షన్‌లు ‘లైవ్’ చూ శాను. వాటి గురించి ఈ వారం నా అభిప్రాయం చెప్పడం అవసరం అని భావించాను.

Pages