S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

05/21/2017 - 08:00

కాశం జిల్లా కొరిటిపాడు మండలం రావినూతలలో మా శిష్యుడి పెళ్లి. ఎండలు రావద్దంటున్నాయి. ‘రండి సార్! అదే రోజు మా ఇరవై ఎనిమిదవ పెళ్లిరోజు. మీరొస్తే బాగుంటుంద’ని నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పిలుపు. అంతదూరం పోయినప్పుడు అదే ప్రాంతంలోని వేటపాలెం లైబ్రరీకి వెళ్లాల్సిందే. ఆ ఊరిలో మిత్రుడు సజ్జాని కలవకమానను.

05/14/2017 - 01:28

తమ స్వరం వినిపించడానికి పాలకులకు అనేక మార్గాలు, స్థలాలు ఉం టాయి. ప్రత్యేక శాఖలు, అనేకమంది వ్యక్తులు ఉంటారు. సచివాలయాలు, ప్రగతి భవన్‌లే గాక ప్రత్యేకంగా సమాచార శాఖ ఉంటుంది. మం త్రుల పేషీలు ఈ పట్టికలో చేరాయి. ఆయా శాఖలకు ప్రత్యేక పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. అంతెందుకు.. కొన్నిసార్లు ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ప్రభుత్వ పత్రికల వలెనే పనిచేస్తుంటాయి.

05/07/2017 - 08:37

పోయిన వారం ఓ న్యూస్ చానెల్‌లో ‘దేవులాట’ కార్యక్రమం చర్చాగోష్టికి వెళ్లాను. వార్తలు, ఇతర కార్యక్రమాలన్నీ ప్రజల భాషలోనే ప్రసారం చేయాలని వారి ఆరాటం. అంటే తెలంగాణ మాండలిక భాషలోనే ఉండాలనే ప్రయత్నం. కొందరు రచయితలను, భాషా విభాగంలో పనిచేసిన వారిని పిలిచి భాషారూపం, పదాలు, జాతీయాలు వంటివి ఎలా ఉపయోగించాలనే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలోనే ఫోను మోగింది.

04/30/2017 - 07:46

కొందరు తమ జీవితాలను పాడుచేసుకుని అస్తిత్వాన్ని నిలుపుకునే ‘అహం’ రూపెత్తుతారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తమ పంతం సాధిస్తారు. ఎదుటివాడిని నామరూపాలు లేకుండా చేసి, అంతా ‘తానే’ అనుకుంటాడు. కులంలో పెద్దననిపించుకోవడానికి కులాన్ని వాడుకుంటాడు. ‘మతం’లో ఉండి తనకోసం మతాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఊరిమీద పెత్తనానికై ప్రజల మధ్య చిచ్చుపెడతాడు. అత్యధిక శాతం ఈ జబ్బుతో బాధపడుతుంటారు.

04/23/2017 - 00:51

పోయినవారం కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో తిరుగులాట. నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ సదస్సు. మూడు రోజుల తరువాత చెన్నైలో మార్కండేయ పురాణం గ్రంథావిష్కరణ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా నాగసూరి వేణుగోపాల్ ఆహ్వానం. ఈ రెండు పనుల మధ్య మూడు రోజుల తీరిక. ఏంచేయాలో పాలుపోని సమయంలో పాత జానపద పరిశోధక మిత్రులు కొండ కోనల కళారూపాలు చూడాలని పిలుపు.

04/09/2017 - 01:26

నిన్న చెన్నైలోని మదరాసు విశ్వవిద్యాలయం కేంద్ర స్థానంలో నిలబడి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) శతాబ్ది ఉత్సవాల గురించి ఆలోచిస్తున్నా.. మదరాసు విశ్వవిద్యాలయం ప్రారంభమైన ఓ అరవై ఏళ్ళ తరువాత ఓయు ప్రారంభమైంది. దక్షిణ భారతంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభమైంది. దక్కన్ పీఠభూమిలో హైదరాబాదు సంస్థానాధీశుల చొరవతో ఏర్పడిన ఓయులో మాత్రం ఉరుదూ భాష మాధ్యమంగా మొదలైంది.

04/02/2017 - 01:06

మీద కప్పిన బట్ట మిత్తిబేగరిపాలు / తాళి కట్టిన భార్య శత్రువులపాలు
ఇల్లు, సంసారమంత ఇతర లోకుల పాలు / ఆస్తిపాస్తులన్ని మనిషి కొక్కొక్కపాలు

03/26/2017 - 07:50

ఒక దేశానికి, జాతికి, పోరాటాలకి, విప్లవాలకి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. వీటిలో వీరోచిత ఉదంతాలే ఎక్కువ పాళ్లు. వీరుల త్యాగపోరాటాలు జనుల హృదయాలలో చెక్కుచెదరని జ్ఞాపకాలు. వీర మరణాలు అనేకం. కానీ జ్ఞాపకాలు కొనే్న. వాటికి దృశ్యరూపాలు ఉండవు. గతంలో అసలే లేవు. ఉన్నా వర్తమానంలో అవి అవిస్మృతమే. స్మృతి ఫలకాలై కంటికి కనబడేవి తక్కువే. అమరవీరుల చరిత్రలకు మాత్రం కొదువలేదు, అమరుల స్థూపాలు చాలా తక్కువ.

03/19/2017 - 02:42

డా. దామెర రాములు కొడుకు పెళ్ళికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొన్నటి 14వ తేదీ రాత్రి 9 గంటలకు ఒక మిత్రుని నుండి ఫోను, ఓ ఎస్సెమ్సెస్ వచ్చింది. ఓ టీవీ చానల్‌లో స్క్రోలింగ్- ‘వకుళాభరణం లలిత ఇక లేరు’ అని. ఒకవైపు కొత్త జీవితాలు ఒక్కటై అంకురిస్తున్న శుభతరుణం. మరోవైపు ఎనభై ఏళ్ళ క్రితం కళ్ళు తెరిచి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్న ఒక వ్యక్తి మరణం. విచికిత్స మానవ నైజం.

03/05/2017 - 01:03

నాలుగు వారాలుగా ఒక వ్యక్తి నన్ను సలపరానికి గురిచేస్తున్నాడు. అతని తెలియని అమాయకత్వం, దానిలోంచి రాసిన అతని కవిత్వం మహాద్భుతం కాదు. కాని- నన్ను, నా ఆలోచనల్ని ఆక్రమించాడు. ఏ పని చేసినా, ఏ కవిత చదివినా అతనే. పుస్తకానికి కవర్ పేజీ కోసం రమణ జీవీ వద్దకు వెళ్తే అక్కడ తారసపడ్డాడు. కవర్‌పేజీ వెనక అట్టమీద కవితని కంపోజ్ చేస్తున్నారు. అందులో ఒకటీ అరా పదాలపై చర్చ జరుగుతుంటే విన్నాను.

Pages