S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

02/20/2020 - 00:31

‘‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు’’అంటారు బామ్మలు శివుడున్నాడో, లేదో చెప్పడం కష్టం. కానీ ఓ ‘మనిషి చావు’ సంభవించడానికి మాత్రం అటువంటిది ఏదో వుండి తీరాలి. లేకపోతే, ఎప్పటి సంగతి? 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు? ఇన్నాళ్లకి, యిప్పుడు ఉరిశిక్ష అమలుచేయమని- తేదీ, సమయం కూడా నిర్ధారించింది న్యాయస్థానం.

02/13/2020 - 02:15

ఇది మరోసారి సామాన్యుడి విజయం! పద్మవ్యూహంలో నుంచి బయటపడ్డ కేజ్రీవాల్ ఘన విజయం అన్నారు కొందరు. ‘‘యిది షహీన్‌బాగ్ విజయం-’’ అంటున్నారు. ఏదిఏమైనా యిది డెమోక్రసీకి దక్కిన గెలుపు.

02/06/2020 - 01:29

ఎన్ని చట్టాలు చేసినా- ‘చట్రాలు’ యింకా గట్టిగా బిగించినా, రుూ ఆధునిక కాలంలో కూడా కిరాతక, భయానక సామూహిక మానభంగాలు- తదనంతరం హత్యలు- యివి ఎక్కువైపోతున్నాయే గానీ అదుపు సాధ్యం కావడం లేదు. తెల్లారేపాటికి పత్రికలు పూర్తిగా తెరచి చూడకుండానే ప్రత్యక్షమయే ఘోరవార్తలు ఇవే!

01/30/2020 - 02:03

‘‘అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో యిప్పుడు జరుగుతున్నదంతా జగన్ మోహన్‌రెడ్డి- చంద్రబాబు నాయుడుల మధ్య జరుగుతున్న పోరాటం. జగన్‌కి చంద్రబాబు మీద వున్న అక్కసు, ఆగ్రహం వెండెట్టా ‘‘తప్ప మరోటి కాదు,’’ అన్నాడు- ఆంధ్రా, గుంటూరు నుంచి వచ్చిన పెద్దమనిషి ఒకడు.

01/23/2020 - 04:58

జగత్ ప్రసాద్ నడ్డా.. సింపుల్‌గా ‘నడ్డా’ అంటున్నారు. ఆర్నెల్ల అనుభవం తర్వాత.. పూర్తి అధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ పగ్గాలు పట్టుకున్నాడు. అందరికన్నా ముందు షష్టిపూర్తి సంవత్సరంలో ప్రవేశించిన నూతన అధ్యక్షుణ్ణి నరేంద్ర దాస్ మోదీ గారు ఏ విధంగా అభినందించాడు అన్నది చూస్తే - జె.పి. నడ్డాకి రాబోయే అయిదేళ్లు ఎట్లా గడుస్తాయి? అన్నది అర్థం అవుతుంది.

01/09/2020 - 02:01

జీవితం ఎందుకు? జిందగీ కిస్‌కేలియే? అంటే.. ‘ఖానే కేలియే’ అన్నాడు కవి. తిండి తినడం కోసం కాకపోయినా బతకడం కోసం తినాలి. మహానగరాలలో ‘ఎంత చెట్టుకు అంతగాలి’ అన్నట్లు రుూ తిండి- ‘‘అవుట్ సైడ్ ది హవుస్’’ అనగా ఇంటి బయట కూడా దొరుకుతుంది. వంటింటి ఖానా కన్నా బయట హోటల్ ఫుడ్‌లో దాని రుచి దానికే వుంటుంది.

12/26/2019 - 04:33

అందరికన్నా ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ.. హేమంత్ సొరేన్‌కి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు పంపించింది. ‘జార్ఖండ్ ప్రజలు మహాసంఘటనకి తమ ఆశలను తీర్చే బాధ్యత అప్పగించారు. జార్ఖండ్ సోదర సోదరీమణులకి నా శుభాకాంక్షలు.. ఎన్నికలు అక్కడ సి.ఎ.ఏ., ఎన్.ఆర్.సి... వ్యతిరేక నిరసనల సమయంలో జరిగాయి. ఇది ప్రజల పక్షాన లభించిన తీర్పు..’ అంటూ ట్వీట్2చేసింది.

12/19/2019 - 00:12

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్‌గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి అమలు చెయ్యాలి అన్న నిబంధన ఏమీ లేదని- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారికంగానే భారీ ఎత్తున ఉద్యమం లేవదీసింది.

12/12/2019 - 04:29

తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను ఆనందోత్సాహాలకు గురిచేశాడు. ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు ఎస్‌టీఆర్ మొబైల్ షాపువారు. ఆశ్చర్యంగా ఉందా? ఇది వార్తే . ఉల్లిపాయల మీద జోకు కాదు. స్మార్ట్ఫును కొంటె హెడ్‌ఫోన్స్ ఉచితం... అంటారు లేదా ఒక మెమరీ కార్డు ఇస్తాము అంటారు. కాని గ్రేడ్ వన్ ఆనియన్స్ ఫ్రీ అని ప్రకటించాడా షాప్ యజమాని.

11/28/2019 - 01:52

‘ఇంతకన్నా నరకం బెటర్.. ఇదొక గ్యాస్ చాంబర్..’ అని మన దేశ రాజధాని ఢిల్లీ మహానగరం గురించి ఆవేదనతో వ్యాఖ్యానించింది మరెవ్వరో కాదు- సాక్షాత్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం.

Pages