S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

11/21/2019 - 01:26

ఆ ఘుమ ఘుమ - ఆ దివ్య పరిమళం - మరెక్కడా దొరకదు.. అందుకే ఒకప్పుడు వెంకన్న లడ్డూని - ‘మనోహరం’ అని ముద్దుగా పిలిచే వారట! అవును.. మనోహరమే.. దాని అలౌకిక పరిమళం -మరే ప్రసాదానికి ఉండదు. అందులో తాజా నెయ్యి వెయ్యడానికే -దేవస్థానం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది! తిరుపతికి పోతునప్పుడు -రైలయినా బస్సయినా -గొప్ప బరువుగా కదుల్తుంది... అవును... దాని నిండా -కొన్ని కోట్లు సంపాదించగల -తల నీలాలుంటాయి..

11/13/2019 - 22:59

పంచపాండవులలో- భీమార్జున నకులసహదేవుల లాగ -బుద్ధిగా అలా గా కూర్చుంటే -ధర్మరాజులాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరంజన్ గోగోయ్ వేయి పేజీలకు మించిన -తీర్పును -భారతీ యుల ఎద జల్లిన పన్నీరులాగా -చదివి పండిత పామర జనరంజనం చేశారు. ఏకగ్రీవం గా వెలువడిన సర్వజన మనోవికాసమయిన ఈ తీర్పు ముఖ్యాంశాలు వింటున్న ఆబాలగోపాలంమొహాల్లో ఒక వెలుగు, ఒక భరోసా ద్యోతకమయ్యాయి.

10/24/2019 - 01:35

ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న రెండో దేశం భారత్. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువే. వేరే చెప్పనక్కరలేదు- చైనా ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా అంతర్‌‘జాలంలో’ ఇరుక్కున్న దేశం అని. భారత్‌లో 63 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారట. మన దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో అంతే సంఖ్యలో ఇంటర్నెట్ ఊసు ఎత్తని వారు కూడా ఉన్నారు.

10/17/2019 - 00:08

తాను సారథ్యం వహిస్తున్న 50వ టెస్ట్‌మ్యాచ్‌లో ఏ క్యాప్టన్ యింతకన్నా గొప్ప విజయాన్ని, గొప్ప కితాబును కోరుకోడు. విరాట్ కోహ్లి కన్నా ఇండియాకి టెస్ట్‌మ్యాచ్‌లలో ఎక్కువసార్లు నాయకత్వం వహించినవాడు మహేంద్రసింగ్ ధోనియే. ధోని 60 టెస్ట్‌లకి నేతృత్వం వహించి 2014లో విరాట్‌కి పగ్గాలు అప్పగించాడు. మొన్నటి పూణె మ్యాచ్‌లో టీము ఇండియా జట్టు నిజంగా అరివీర భయంకరమైన జట్టు.

10/10/2019 - 02:02

గాడిద కన్నా గాడిదపాలు మిన్న- అన్నది నమ్మండి. ఇది ఆధునిక సత్యము. కొంతమంది గాడిద అనంగానే ఇలా మొహం పెడతారు. అది తప్పు. గాడిద పాలు గ్రేట్-అంతేనా? అది కుక్కలాగే ఆదికాలం నుంచి మనిషికి పర్సనల్ అసిస్టెంటు కూడా. పెట్టనికోట లాగ -కరగని అరగని చెరగని మంచు కప్పుకొని ఉన్న, హిమాలయసానువుల మీద -మనసరుకులు ఎవడు మోస్తాడు? అయితే గాడిద కేవలం సరుకులు- మురికి దుస్తులు మోయడం కన్నా చాలా గొప్పది.

10/03/2019 - 04:51

ఏనుగు తొండం ధారలు- కుండపోతగా వానలు- దారిగాసి వీరబాదుడు బాదిన వర్షం- లాంటి మాటలు మజాగానే వుంటాయి. కాని అనుభవంలో ఇవి ఎంతగా హింసిస్తున్నాయో అనే మాటలతో దసరా పం డుగ ముందుదాకా దేశవ్యాప్తంగా జనాలు దీనాతిదీనంగా బాధలు పడుతున్నారు. యూపీ, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు- ముఖ్యంగా హైదరాబాద్, లక్నో, కలకత్తా, పాట్నా లాంటి నగరాలు కడగండ్లపాలైనాయి. శరదృతువు వచ్చింది.. అమ్మవారి పండుగలు..

09/26/2019 - 02:21

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను ‘ భారత దేశపు సేవకుడి’గా అభివర్ణించుకోవడం ఆయన సౌజన్యానికి, దేశం పట్ల ఆయన వినమ్రతకు చిహ్నం. నరేంద్ర మోదీని ‘ భారతపిత- ఫాదర్ ఆఫ్ ఇండియా-!’ అని అభివర్ణించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్-కు నిదర్శనం. మోదీ వినమ్రత, డొనాల్డ్‌ట్రంప్ అనభిజ్ఞత సమాంతరంగా ప్రస్ఫుటించాయి.

09/19/2019 - 02:38

ఓసారి పూర్వరంగం చూద్దాం. 1950లో అనుకున్నారు రాజ్యాంగ నిర్ణేతలు- ‘దేవనాగరి లిపిలో రాసే హిందీ భాషను అధికార భాషగా వాడాలి’ అని. అయితే అది సాధ్యం కాదని తెలుసుకుని ఓ పదిహేనేళ్ల పాటు ఇంగ్లీషు భాష కూడా అధికార హోదా ‘ఎంజాయ్’ చేయాలన్నారు. కాని ఆ పప్పులు ఉడకలేదు. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ద్రవిడ భాషలవాళ్ల ‘ప్రొటెస్టు’ల వల్ల గవర్నమెంట్ 1963 అధికార భాషల చట్టం చేసింది.

09/12/2019 - 04:33

‘‘అబ్బో! ఇవాల్టిదా? నిన్నటిదా?? మనకి, చందమామకి అంటే- చంద్రగ్రహానికి ఉన్న అవినాభావ సంబంధం.. అసలు చంద్రుడు భూమికి సొంత బిడ్డ. మన భూమికి ఉపగ్రహం అయిన చందమామ ఆది కాలంలో గిర్రున తిరిగే భూమి గ్రహం నుంచి విడిపోయిన ఒక పెద్ద శకలం! అదే ఉపగ్రహం అయింది. అది మాతృగర్భాన్ని చీల్చుకుని బయటపడ్డ అఖాతమే. శాంత మహా సముద్రం అయింది. అబ్బో!

09/05/2019 - 02:09

ఎవర్నైనా అడగండి! మీరు రూపాయి కరెన్సీ నోటు చూశారా? అని.

Pages