S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

01/09/2017 - 00:42

ఆడేవాళ్లకే కాదు, ఆడించే క్యాప్టన్లకే కాదు- క్రి కెట్ ప్రియులందరికీ ‘స్వప్నసుందరుడే’- క్రికెట్ మహేంద్ర సింగ్‌గా సార్థక నామధేయుడయిన ధోనీ. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో ‘నేనాడతా’నంటూ ప్రకటించాడు. మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ఈ జార్ఖండ్ వీరుడికి అలవాటే. నాగపూర్‌లోని ఒక హోటల్ గదిలో కూర్చుని- బయట ఓ నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్‌ని కూడా నిలబెట్టాడు కాపలాగా.

01/02/2017 - 00:44

తమిళుల ఆరాధ్య దేవత ‘అమ్మ’ మరణానంతరం ‘చిన్నమ్మ’గా తెరపైకి వచ్చిన శశికళా నటరాజన్‌ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం 2,770 మంది అన్నా డిఎమ్‌కె సభ్యుల మండలి ఎదుట- ‘చిన్నమ్మలోనే మనం అమ్మను చూసుకోవాలి’ అంటూ పక్కనే వున్న- జయలలిత ఖాళీ కుర్చీని చూపించాడు. ‘పార్టీ పగ్గాలా? లేక ముఖ్యమంత్రి పదవా? లేక రెండూనా?

12/26/2016 - 02:43

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని 2016 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్‌గా నిర్ణయించిన ఐ.సి.సి. ‘సోబర్స్ అవార్డ్’ను ప్రకటించింది. ఐ.సి.సి. టెస్ట్‌టీమ్‌లో ఇండియా నుంచి అతనొక్కడికే చోటు దొరికింది. 2016లో మన క్రికెట్‌కి ఇది గొప్ప వజ్ర కిరీటం. కొహ్లీ సేన జేగీయమానంగా ఇంగ్లాండ్‌పై సిరీస్ గెల్చుకుంది. ‘‘ఓహో!’ అనిపించేలా వుంది మన టెస్ట్ క్రికెట్ టీమ్! ఇంతకన్నా ఏమీ అడగలేం.

12/19/2016 - 04:27

‘‘అసలు నల్లధనం అంటే ఏమిటి? అక్కా!’’ ఏడేళ్ల బాలుడు పనె్నండేళ్ల బాలికని అడిగాడు.

12/12/2016 - 00:03

నెల్లాళ్లు క్యాష్‌లెస్‌గా, రెస్ట్‌లెస్‌గా అదేదో మరో లోకంలో సాగుతున్నట్లు గడిచిపోయాయి. ‘నమో’నల్లధనం వేట- సామాన్య ‘జనం’ తెల్లధనంకోసం వెంపర్లాట బ్యాంకు నుంచి బ్యాంకుకి- ఏ.టి.ఎమ్.నుంచి ఏ.టి.ఎమ్.కీ వేట- ప్రతిపక్షాలకి కంఠశోష- పైగా ‘బ్లాక్‌డే’పాటించి గజగజ వణికించే చలిలో- తెల్లని పొగమంచు బురఖాలో ఐకమత్యంగా నిలబడి పాడిన నిరసన పాటల- యొక్క ఫలితం లేని ‘ఇరకాటం’గా గడిచిపోయింది.

12/04/2016 - 22:49

‘‘వాడిపోవురా పువ్వులు... కుళ్లిపోవురా కూరగాయలూ...’’ వాడుట, కుళ్లుట వాటికి సహజమురా!’’అంటూ పాడుకుంటూ వచ్చాడు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్.

11/28/2016 - 08:16

ఆర్‌జెడి పార్టీ అధినేత, బిహార్ మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ జైల్లో లేకపోయినా శ్రీకృష్ణుడంతటి వాడే! కాకపోతే ఇప్పుడు మురళి చేతిలో లేని కృష్ణుడిలా కనిపిస్తున్నాడు. జైలు నుంచి వచ్చినా- బెయిలు అతణ్ణి స్వేచ్ఛగా బతకనిస్తోందే గానీ.. అదేం స్వేచ్ఛ? కాళ్లూ చేతులూ కట్టేసి, మైదానంలో వదిలేసి ‘ఇదంతా నీదే.. ఆడుకో’మని అన్నట్లుగా వుంది.

11/20/2016 - 23:34

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అన్నట్లు- ‘‘దాన్నంతటినీ నల్లధనం అనకండి. లెక్కలోకి రాని కష్టార్జితమే అదంతా’’. దేశంలో యివాళ విచిత్రమైన పద్ధతి నెలకొని వుంది.

11/13/2016 - 21:50

‘‘దాచుకున్న డబ్బు తుదకు దొంగలకిత్తురో- దొరలకవునో’’ అన్నారు. బాగానే వుంది. ‘దోచు’కున్న డబ్బు తుదకు దొరల బొక్కసంలోకి పోయేటందుకు ఓ బ్రహ్మాండాస్త్రం అకస్మాత్తుగా, ఏ మాత్రం వార్నింగ్ లేకుండా సంధించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు. గానీ, గుఱ్ఱాన్నీ, గాడిదనీ ఒకే గాట కట్టినట్లు సామాన్యుడికి కళ్లు మూసి- సాచి లెంపకాయ కొట్టినట్లు దిమ్మతిరిగిపోయింది.

11/07/2016 - 00:50

బెంగళూరులో వారు దీపావళి పండుగను అం దరికంటే ముందుగానే చేసేసుకున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్ యడ్యూరప్పపై అవినీతి కేసులు కొట్టివేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా టపాసులు పేల్చి ‘్ధమ్ ధామ్’ నిర్వహించారు.

Pages