S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

07/11/2016 - 05:05

‘బోనాల్ పండగకొస్తానని రాకపోతివి
లబ్బర్ గాజులు తెస్తానంటివి......’
ఏడనుందో రాములమ్మ- బోనాల్ పండగలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చేశాయ్! దొడ్డదొర కె.సి.ఆర్.గారు శెలవులు మస్తుగా ప్రకటించేస్తాడు. రంజాన్‌కి అటు చేరి, యిటు చేరి నాలుగు రోజులు శలవులు దొరికేసరికి ‘పండగ జేసుకున్నారు భాగ్యనగర వాసులు!’

07/04/2016 - 04:35

‘‘ఏమండోయ్! దోమలమందయిపోయింది!’’ పసిపిల్లాడికి గ్రైప్ వాటర్ అయిపోతే కంగారుగా కేక వేసినట్లు- ‘‘మళ్లీ దుకాణం కట్టేస్తాడు సందుమొగ సేఠ్’’- అంటూ మొగుణ్ని కంగారు పెట్టేస్తుంది ఓ ఇల్లాలు.

06/27/2016 - 03:46

కోచ్‌కోసం వేట ముగిసింది. ‘ద్రోణాచార్యుడు’ దొరికాడు. కొండ తలక్రింద పెట్టుకుని రాయికోసం వెతుక్కున్నట్లు ఇండియన్ క్రికెట్ బోర్డు- పదిహేను మాసాలైంది పరదేశీ బాబుల వెంట పడి విసిగివేసారి అప్లికేషన్‌లు పిలిచింది..

06/20/2016 - 05:23

కూరలేని తిండి కుక్క తిండి
పప్పు లేని తిండి పాడుతిండి-
అన్నాడు మహాకవి వేమన్‌జీ- ఆయనగారి రోజుల్లో కూడా ఉల్లిపాయ, పొటేటో- అంటే బంగాళ దుంపకి టొమేటో తగిలించి ముద్దకూర చేస్తే పప్పు ధప్పళం ఊసెత్తేవారు కారేమో, గానీ యివాళ సదరు కందిప్పప్పు దప్పళం లేదా, మన బ్రదర్ అరవ్వాడి సాంబార్ కూడా కొండెక్కి కూర్చున్నాయ్!

06/13/2016 - 04:53

పోయినవారం బిహార్ అడవులలో ఓ రెండు వందలకు పైగా ‘నీల్‌గాయ్’ల్ని (వీటినే బ్లూబుల్ అంటారు)- తుపాకులతో వేటాడి చంపేశారు. అవి శాకాహారులే గానీ, మన పంట పొలాల మీద పడి క్రుమ్మేస్తున్నాయ్. ధ్వంసం చేస్తున్నాయ్. కనుక పర్యావరణ శాఖామాత్యుడు ప్రకాష్ జవదేకర్- ఆర్డర్లు వేశాడు. ఈ ఆర్డరు నవంబర్ దాకా అమలు చేస్తారు.

05/30/2016 - 05:13

అక్కడ ఢిల్లీలో మోదీగారు రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్టానికి రెండేళ్ల పాలన అందించిన కె.సి.ఆర్.గారున్నారు. ఇద్దరూ ‘‘మంచిరోజులు’’ తేవడానికే కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతానికి కె.సి.ఆర్.గారి- సంగతి నల్లేరు మీద బండీ లాగా వుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, కొత్త బాటలు- ఒక్క రాష్ట్రం దాకా పరిమితం.

05/23/2016 - 04:46

సంబరాలు సమసాయి. సంతాపాలు సద్దుమణిగా యి. మంత్రివర్గం ఏర్పాట్ల మల్లగుల్లాలు సాగుతున్నాయి. దేశం అంతటా నారీమణుల పరిపాలన పురివిప్పిన నెమలిగా భాసిస్తూ వున్నది. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా- రాజస్థాన్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, గుజరాత్‌ని కూడా కలుపుకుని- ఐదుగురు మహిళామణులు పరిపాలనా పగ్గాలు ధరించి ప్రజాస్వామ్య రథాలను తోలుతున్నారు.

05/16/2016 - 06:35

ఏమైతేనేల? ధర్మ సందేహాల పుట్ట దాని మీద కొట్టకుండా, పుట్ట చుట్టూ నాగస్వరం పెట్టిన సుప్రీంకోర్టు తన సర్వోన్నత ఆధిపత్యాన్ని నిరూపించుకొని- ఉత్తరాఖండ్‌లో యేర్పడిన సంక్షోభాన్ని గట్టెక్కించింది. అక్కడ ప్రజలు అమ్మయ్య ఓ గవర్నమెంటు ఏర్పడింది అనుకొనేలాగా చేసింది.

05/09/2016 - 07:27

మే16న తమిళనాడు కురుక్షేత్రం మొదలవుతోంది. కనులున్న ధృతరాష్ట్రుడు లాంటి వాడు నల్లకళ్లద్దాల డి.ఎమ్.కే. బాస్ కరుణానిధి కొంతా ఇంటర్‌నెట్ వరాలు వెదజల్లుతూ- ‘‘మొబైల్ ఫోన్‌లు ఉచితం’’ అన్నాడు. ఋణాలు మాఫీ చేస్తానన్నాడు. వ్యవసాయానికి వేరే బజట్ పెడతానన్నాడు.

05/02/2016 - 05:16

వచ్చే ఏడాది మొదట్లోనే అంటే 2017 యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పంజాబ్‌లో కూడా వోట్ల పండుగ- రెండూ కూడబలుక్కొని వచ్చేస్తున్నాయ్.

Pages