S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

05/30/2016 - 05:13

అక్కడ ఢిల్లీలో మోదీగారు రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్టానికి రెండేళ్ల పాలన అందించిన కె.సి.ఆర్.గారున్నారు. ఇద్దరూ ‘‘మంచిరోజులు’’ తేవడానికే కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతానికి కె.సి.ఆర్.గారి- సంగతి నల్లేరు మీద బండీ లాగా వుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, కొత్త బాటలు- ఒక్క రాష్ట్రం దాకా పరిమితం.

05/23/2016 - 04:46

సంబరాలు సమసాయి. సంతాపాలు సద్దుమణిగా యి. మంత్రివర్గం ఏర్పాట్ల మల్లగుల్లాలు సాగుతున్నాయి. దేశం అంతటా నారీమణుల పరిపాలన పురివిప్పిన నెమలిగా భాసిస్తూ వున్నది. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా- రాజస్థాన్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, గుజరాత్‌ని కూడా కలుపుకుని- ఐదుగురు మహిళామణులు పరిపాలనా పగ్గాలు ధరించి ప్రజాస్వామ్య రథాలను తోలుతున్నారు.

05/16/2016 - 06:35

ఏమైతేనేల? ధర్మ సందేహాల పుట్ట దాని మీద కొట్టకుండా, పుట్ట చుట్టూ నాగస్వరం పెట్టిన సుప్రీంకోర్టు తన సర్వోన్నత ఆధిపత్యాన్ని నిరూపించుకొని- ఉత్తరాఖండ్‌లో యేర్పడిన సంక్షోభాన్ని గట్టెక్కించింది. అక్కడ ప్రజలు అమ్మయ్య ఓ గవర్నమెంటు ఏర్పడింది అనుకొనేలాగా చేసింది.

05/09/2016 - 07:27

మే16న తమిళనాడు కురుక్షేత్రం మొదలవుతోంది. కనులున్న ధృతరాష్ట్రుడు లాంటి వాడు నల్లకళ్లద్దాల డి.ఎమ్.కే. బాస్ కరుణానిధి కొంతా ఇంటర్‌నెట్ వరాలు వెదజల్లుతూ- ‘‘మొబైల్ ఫోన్‌లు ఉచితం’’ అన్నాడు. ఋణాలు మాఫీ చేస్తానన్నాడు. వ్యవసాయానికి వేరే బజట్ పెడతానన్నాడు.

05/02/2016 - 05:16

వచ్చే ఏడాది మొదట్లోనే అంటే 2017 యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పంజాబ్‌లో కూడా వోట్ల పండుగ- రెండూ కూడబలుక్కొని వచ్చేస్తున్నాయ్.

04/25/2016 - 07:11

ముంబాయి బార్ డ్యాన్స్ క్లబ్‌లు, రెస్టారెంట్లు- అటు గవర్నమెంటుకీ - యిటు కోర్టులకీ మధ్యన/ పడి- అడకత్తెరలో వక్కలాగా నలిగిపోతున్నాయి. ఓ పదేళ్లయింది- మహారాష్ట్ర ప్రభుత్వానికీ, బార్ల వాళ్లకీ మధ్య సుప్రీంకోర్టు సహా కోర్టులు మధ్యవర్తులుగా- ఒక యుద్ధమే జరిగిపోతోంది. కోర్టులు, మధ్యవర్తులు అనుకోడమే కాదు 75వేల మంది సుందరాంగనలు రుూ బార్ డ్యాన్సులలో- ఐటమ్‌సాంగ్స్‌కి డ్యాన్సులు చేసి, పొట్ట పోషించుకుంటున్నారు.

04/18/2016 - 06:36

ఎండా నీడా రెండూ మండిపోతున్నాయ్. ఆంధ్రా లేదు తెలంగాణా లేదూ.. ఎడా పెడా సూర్యుడు మొత్తం తెలుగువాళ్లందరినీ కాల్చుకుతింటున్నాడు. అదిలాబాద్, అనకాపల్లి - రెండూ చర్మం వొల్చుకుని తిం టున్న మండుటెండలోనే వున్నాయి. గజ్జెలు కట్టుకుని కథాక్కళి నృత్యం చేస్తున్న సూర్యభగవానుడు భగభగ జనాన్ని కాల్చేస్తుంటే చాలా మంది ‘హరీ’మంటున్నారు.

04/11/2016 - 05:13

మొదట ఈ వార్త విందాం. మహారాష్ట్ర అంతటా సుమారు మూడొంతులు దాకా క్షామ పరిస్థితులు ఏర్పడిపోయాయి. జనాల గొంతులెండిపోతున్నా యి. నేల మీద ‘బొరియలు’ ఏర్పడిపోతున్నాయి. అట్టి తఱి అక్కడ ‘‘సమ్మర్ క్రికెట్ మేళా’’ షురూ అయింది. జనాలు నీళ్లు లేక దాహంతో అరవడానికి కూడా ఓపిక లేకుండా ‘‘్ఛస్తూ’’వుంటే నువ్వేమో ఐ.పి.ఎల్.

04/04/2016 - 06:30

అయ్యో! ఎంత మాట? ఇండో పాక్ రిలేషన్స్ వర్ధిల్లాలీ అనబోతుంటే ఇలా వచ్చేసింది. నోరు జారితే తీసుకోలేం అన్నారుగా, అందుచేత దాన్ని అలాగే ఒగ్గేసి- అటు ‘జిట్’ యిటు ‘ఎన్.ఐ.ఏ’ల రిలేషన్స్ బ్రహ్మాండంగా వున్నాయి’ అన్న సమాచారాన్ని చూద్దాం- ‘జిట్’ అని అనగా ఇండో పాక్ పఠాన్‌కోట్ సంఘటన మీద జాయింట్ ఇనె్వస్టిగేషన్ కమిటీ- మరి ఎన్.ఐ.ఏ.

03/21/2016 - 00:59

సంతోషానికి కొలతబద్దలు ఏమిటీ? అన్న ప్రశ్నకి జవాబు తరువాత చూద్దాము. 2016 సంవత్సరానికి గాను అత్యంత సంతోషంగా వున్న దేశాల మీద సర్వేచేసి 156 దేశాల లిస్టుచేసి సమితి సంతోషం ర్యాంకులు నిర్ణయిస్తూ ఆ రిపోర్టు రిలీజ్ చేసింది. అందులో మన ఇండియా దటీజ్ భారత్‌కు- 118వ ర్యాంకు మాత్రం దొరికింది! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం- ఓహో!...

Pages