S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

06/13/2019 - 01:28

మృగశిర కార్తెకు కూడా ‘ముష్టి’ వేసినట్టు మూడు వానచినుకులు రాలినై. దేశమంతా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రా ష్ట్రాలూ-నిలువునా మండిపోతున్నాయ్!

06/06/2019 - 01:40

అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్! అయినా ఓడిన పార్టీల నేతలు చాలా కాలం గాయాలు మానేదాకా- గోల్‌మాల్ జరిగిందీ అనీ, ప్రత్యర్థి పార్టీ వారు అన్యాయంగా గెలిచేశారనీ- ‘ ఫౌల్.. ఫౌల్’ అంటూ అరుస్తూనే వుంటారు. ‘ఏక్ దివసీయ’ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో- డి.ఆర్.ఎస్. సౌకర్యం వున్నట్లు- ఎన్నికల ఫలితాల విషయంలో- వెంటనే యిలా అరచెయ్యి ఎత్తి పెట్టి, రెండో చేత్తో పిడికిలి పెట్టి గుద్దితే, ఎలక్ట్రానిక్ రీప్లేలు వచ్చేయవుకదా!

05/23/2019 - 01:05

గుళ్లో రైల్లో బళ్ళో ఆఖరికి.. ఆడుకునే పసికూనల వొళ్ళో - ఇంట్లో.. హాల్లో .. కిచెన్లో .. బెడ్ రూంలో.. చివరికి వాష్‌రూంలో - ఇక్కడ.. అక్కడ.. ఎక్కడపడితే అక్కడ ఉండునది ఏది? మార్నింగ్ వాకిం గులో, ట్రైనింగు క్యాంపులో, కాలేజీ క్యాన్టీనులో -క్లాసురూములో ఇలా ‘‘నీ నీడను నేను... నిను వీడను నేను...’’ అంటూ నీ వెంట వచ్చే ఫ్రెండ్- ఫిలాసఫర్- గైడ్ అండ్ మాస్టర్ ఎంటర్‌టైనర్ ఎవరు..?

05/16/2019 - 02:04

హమ్మయ్య..! ఎట్టకేలకు చివరి విడత పోలింగ్‌కి వచ్చేశాం.. మరో రెండు రోజుల తర్వాత ఆదివారం నాడు- ఈనెల 19వ తేదీన ఏ డవ- (ఆఖరి) విడత పోలింగ్ పూర్తయిపోతుంది. ఇక ‘శబ్దకాలుష్యం’ తగ్గుతుందని అనుకుంటూ సామాన్య జనం పోలింగ్ చరమాంకం కోసం ఎదురుచూస్తున్నారు.

05/09/2019 - 01:28

పేట్రేగిపోతున్నాడు చండ ప్రచండంగా... అక్కడా దంచుతున్నాడు, ఇక్కడా వాయిస్తున్నాడు... ఎవరు..? కేసీఆర్, చంద్రబాబు అను కున్నారా?.. కాదు.. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు ముఖ్య మంత్రులున్నారు. ఉండుగాక- కానీ, సూర్యభగవానుడొక్కడే. ఎటువంటి పక్షపాతం లేకుండా- ఎండలు మెండుగా హైదరాబాద్‌లోను, అమరా వతిలోను ఒకే లెవెల్లో నిప్పులతో చెరిగి - జనాల వొంట్లో తడిని పీల్చేస్తున్నాడు .

05/02/2019 - 01:55

పోలింగ్ ‘బూతులా’? కావు.. ఎన్నికల్లో వేరే ‘బూతులు’ కూడా కలవు. దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్‌కి మనం అందుకున్నాము. ఇంకా మూడు దశలున్నాయి. పోలింగ్ ముగిసిన రాష్ట్రాల ప్రజలకి, ఇంకా పోలింగ్ జరగని ప్రాంతాల ప్రజలకు తలవాచి పోతోంది. వొళ్లు పులిసిపోతోంది. కొందరికేమో కాలక్షేపం, కొంతమందికి పార్టీల మీద వెర్రి అభిమానంతో చెలరేగిపోతున్న ఇంచుమించు ఉన్మాద దశ.

04/25/2019 - 01:37

సరిగ్గా గత ఏడాది మే నెలలోలాగే- రుూసారి కొంచెం ముందుగానే జంట నగరాలపై పిడుగులు-వడగండ్లు కురిపించేస్తూ అకాల వర్షం యమయాతన పెట్టేసింది. పగలంతా ఎండ మండుతూ కాస్తుంది. సాయంకాలం అసలు ఒక వార్నింగూ, ముందస్తు సందడీ సవ్వడీ లేకుండా- మొన్న సోమవారం అకాల వర్షం జనాల్ని పిడుగుల పిడి గుద్దులు గుద్దేసింది.

04/18/2019 - 03:40

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ థావన్, కె.ఎల్.

04/11/2019 - 01:29

‘‘అవిగో అవిగో బారులు.. వోటర్ల బారులు.. మండుటెండలో కుత కుత ఉడుకుతున్న పార్టీల జాతకాలు’’- అని పాడాల్సిందే. మన ప్రాంతం అనగా తెలుగు ఏరియాలో ఇవాళ్టితో పోలింగ్ పర్వం పరిసమాప్తం. ఇక రోజులు లెక్కపెట్టుకుంటూ- ఎదురుచూపులూ, అడ్డమైన సర్వేలు, అంచనాలు, ఊకదంపుడు చర్చలు-ఎండలను ఎగదోస్తూ ‘సాగుడు’ మొదలు. అందుచేత.. అనగా దట్స్‌వై- మనం యిక్కడి ఎన్నికల రాశిఫలాల్ని యిక చెప్పుకోము. స్వస్తి..!

04/04/2019 - 04:33

అయ్యా..! చివరి గందరగోళ ఘట్టంలో పడ్డాం. 2019 ఎన్నికల పర్వం కబుర్లకి స్వస్తి చెప్పే ఘట్టం యిది. 2014కీ, యిప్పటికీ తేడా ఏమిటీ అంటే- ‘సోషల్ మీడియా’ అంటారే- అది చెలరేగిపోతున్నది. ఏది సత్యం? ఏదసత్యం? అన్న మీమాంసకి ఛాన్సు యివ్వకుండా- తటస్థుల్ని చాలా మందిని- వినోదం, విస్మయం యిచ్చి చకితుల్ని చేస్తుంది. అసలు ‘బాకా’ అంతా యూ-ట్యూబ్ ద్వారా అందుకుంటోంది.

Pages