S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

01/04/2016 - 05:05

సొంత కార్లున్న వాళ్లకి పార్కింగ్ సమస్య. సొంత కుక్కలున్న వాళ్లకి వాటి బార్కింగ్ సమస్య. మామూలు నగరాలకే రుూ సమస్య వుంటే- ఘనత వహించిన మన మహారాజధాని ఢిల్లీకి యిది సమస్య కాదా? అంటే మోటారు శకటాల రాపిడికి సంబంధించి- యిది యింకా చిక్కు సమస్య.

12/28/2015 - 00:41

‘‘హీరోస్’-2015 అంటూ మోదీజీ పేరు నుంచి భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాకా ఎన్నో పేర్లు వినబడుతూ వున్నా అకస్మాత్తుగా రంగం మీదికి క్రికెటర్ ఎం.పీ. కీర్తి ఆజాద్, అతి సంపన్న అరివీర భయంకర కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీల పేర్లు లైమ్‌లైట్ ఎత్తుకుపోతూన్నట్లుగా వుంది.

12/21/2015 - 04:52

‘‘చదువురాని మొద్దూ... కదలలేని ఎద్దు’’- మళ్లీ మరోసారి అదే పాట- ‘‘చదువురాని మొద్దూ’’- కుర్రవాడు తన్మయంగా సూక్తులు వల్లెవేసేస్తున్నాడు బాలుడు. వాళ్లయ్యకి మండిపోయింది.
‘‘పెద్దోళ్లని తిట్టిపించడానికట్రా? రుూ సతుకులు... మీయమ్మని పిలూ’’- అంటూ అరిచాడు రైతుకూలీ రాజయ్య. కుర్రాడు పుస్తకంలోంచి తలెత్తలేదు. ‘‘విద్యలేనివాడు వింత పశువు’’- అంటూ అందుకున్నాడు మళ్లీ.

12/14/2015 - 05:46

ఆంధ్రపత్రిక ఉగాది సంచికకి వోసారి అప్పటి మన ఆస్థాన కవి- చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీగారిని వో వ్యాసం రాయమని శ్రీ శంభుప్రసాద్‌గారు అడిగారు.- ఆయన జవాబు యిస్తూ కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారి అల్లుడయిన శంభుప్రసాద్‌గారడిగారు కనుక ప్రయత్నం చేస్తాను గానీ రుూమధ్య తెలుగులో రాయడం లేదన్నాడుట. అంటే ఇంగ్లీష్‌లో రాశాడని కాదు అర్థం. గీర్వాణ భాషలోనే రాయడం అప్పటి ‘యిది.’

11/30/2015 - 06:18

కెసి.ఆర్. చెప్పింది వేదం. తాను పట్టింది బంగారం. కాదన్న వాళ్లది ఖేదం’’- అంటూ, టెన్త్‌క్లాస్ అమ్మాయి పొయిట్రీ చెప్పింది. చాలామంది ముక్కుకి సూటిగా మాట్లాడుతాం’ అంటారు గానీ శ్రీ చంద్రశేఖరరావుగారు అందరికన్నా ఎక్కువగా- ముక్కుకి సూటిగా, బియాండ్ అందరికన్నా ఎక్కువగా చూడగలడు. ఎందుకంటే అతని ముక్కు ఒన్ అండ్ ఓన్లీ నోస్ యిన్ ది వరల్డ్!

11/23/2015 - 04:55

ఒకప్పుడు యిది- అంటే మనిషిని- కుక్క కరిస్తే వార్త కాదు. ‘కుక్కని మనిషి కరిస్తే వార్త’- అని గొప్ప సూక్తి. కానీ, యిది యిప్పుడు ఒక జోకు- వూర కుక్కలు ఊరూరా- ఆసుపత్రులో, పురిటి కందుల్ని- వీధుల్లో స్కూలుకి పోయే పిల్లల్ని కరిచి ముక్కలెక్కలాగేస్తున్నాయ్. ఇదే వార్తలు జనాల్ని లెక్కపెడితే- అది జనాభా. కుక్కల్ని లెక్కబెడితే, అది ‘కుక్క్భా’!

Pages