S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

09/06/2018 - 00:12

అదేం దూకుడురా.. బాబూ..! విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని దిగితే ఓ రికార్డు బద్దలయిందే.. నాలుగు వేల పరుగులు అమిత వేగంగా అరవై అయిదు ఇన్నింగ్స్‌లో లాగించేసాడు. కానీ అంత గ్రేట్ హిట్టర్ , మొన్న లార్డ్స్‌లో ఇంగ్లాండ్ టీమ్ మీద నాలుగో టెస్టు ఆడుతూ ముక్కు బజ్జీ చేసుకున్నాడు. తన బ్యాట్ సాధించిన రికార్డుల సంబరం చేసుకోలేక పోయాడు . టీము చతికిలబడి పోయింది. అరవై పరుగుల తేడా?

08/30/2018 - 00:17

త్రిపుర ఎంత చిన్న రాష్టమ్రైతేనేమి? పెద్ద విజయం సాధించింది. పాతికేళ్ల వామపక్ష పరిపాలనకి చెల్లు చీటీ రాసేసింది. ఒక సునా మీలా కాంగ్రెస్ పార్టీని మింగేసి లోగడ ఢిల్లీలో గద్దెనెక్కినంత సంబర పడిపోయింది మోదీ గారి భాజపా ‘కమలం’లా వికసించింది. అతి పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత ఆర్భాటంగా త్రిపురలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కాషాయ సేన.

08/23/2018 - 00:12

స్నేహమేరా జీవితం.. పబ్లిసిటీయేరా పరమార్థం..’అని పాడు కుంటూ- కట్టుకతలు, పిట్టకతలు చెప్పుకుంటూ పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార సమరోహానికి తగుదునమ్మా అంటూ వెళ్లి వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిర్వాకం ఏమిటంటే- తనను పాక్ వెళ్లేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వాన్ని, తనకి మంత్రి పదవి ఇచ్చిన పంజాబ్ కాంగ్రెస్ పార్టీని కూడా- శుద్ధ ఈడియట్స్‌ని చేసి వదిలిపెట్టాడు.

08/16/2018 - 00:28

నా దేశం వేళ్ళానూ.. అయినా హృదయం మన దేనూ... అంటూ హాస్యనటుడు రేలంగి మీద చిత్రీకరించిన పాత సినిమా పాట ఒకటి ఉంది. కానీ, ‘ఇండియాలోనే ఉన్నానూ... అయినా వాడేవన్నీ చీనా వస్తువులేనూ...’ అని పాడుకుంటున్నాం నేడు మనం. అంతెందుకు..? మన దీపావళికి, దసరా పండుగలకి కూడా వాళ్ళ టపాసులదే సందడి.. మన దేవుళ్ల బొమ్మలు.. డాం డాం బాణసంచా పేలుళ్లు అన్నీ వాళ్లవే. అయ్యా! ఇట్లా అన్నీ చైనావేనూ.. అంతేనా?

08/02/2018 - 00:29

ఇప్పుడు సమస్య పాకిస్తాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, మాజీ క్రికెట్ కెప్టన్ ఇమ్రాన్‌ఖాన్‌జీ- మన ప్రధాని నరెంద్రమోదీజీని తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి- ఆ గలే లగ్ జా- అంటూ పిలిచి సన్మానిస్తాడా? లేదా? అన్నది కాదు. ఇమ్రాన్ ఈ నెల పదకొండవ తేదీన పాకిస్తాన్ పందొమ్మిదవ ప్రధానిగా గద్దె నెక్కినప్పుడు -ఒకవేళ -మన మోదీ అక్కడ ఉంటే ? ..ఏటవుద్ది?

07/26/2018 - 00:06

కళ్లల్లో కళ్లు పెట్టి చూడు అన్నాడు ‘రాగా’ (రాహుల్ గాంధీ). వెంటనే- మీరు చూడలేరు సారూ!.. అని కూడా అన్నాడు. ‘నమో’ (నరేంద్ర మోదీ) కితకితలెట్టినట్లు నవ్వాడు. ఈ ‘రాగా’ల, ‘నమో’ల సరాగాలే లేకుంటే- జనాలకి -ఒకరు యాభై నిమిషాలు - జవాబుగా మరొకరు తొంభై నిమిషాలు తాషా మర్ఫా వాయించి పారేస్తారు- బోరుకొట్టి చచ్చేవాళ్ళం.. అన్నాడో టీవీ ప్రేక్షకుడు ..

07/18/2018 - 22:38

దేవుడి గుడికి శుద్ధి ఉంటుంది. కాని ‘దేవుడికి శుద్ధి’ అనే మాటకి అర్థమేమిటి? దేవుడే నిజానికి శుద్ధి.. ఆయన ఎదో పాపం లేదా పుణ్యవశానో.. విగ్రహంలో ప్రవేశించాడు.. ఆ విగ్రహం ఏడు కొండలపై కొలువైంది.

07/05/2018 - 00:57

ఎందుకొచ్చిన ప్రగతి..? ఎందుకొచ్చిన అత్యంత సోకాల్డ్ ఆధునికత..? అరచేతిలోనే ప్రపంచం అంతా చూడొచ్చు. ఆగమేఘాల మీద ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు. కాని రోడ్లకి రక్తదాహమెక్కువ అయిపోయింది. తెల్లారేపాటికి ఇప్పటికీ- ఇంటర్నెట్ కాలంలో కూడా పేపరు కోసం ఎదురుచూడటం అలవాటైపోయింది. రివ్వున మూడో అంతస్తుకైనా- ఎగిరి వచ్చిపడే ‘పిట్ట’ (పేపర్ చుట్ట) అది. దాన్ని విప్పి చూడాలంటేనే భయం- ఆందోళన..

06/28/2018 - 00:23

ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఏకుమేకైపోయి చాలా కాలమైంది. ఆ మాటకొస్తే ‘సంఘ్ పరివార్’లో ఎవరు ఇప్పుడు ‘జో హుకుం సర్కార్! మోదీ సాబ్ జిందాబాద్!’ అంటూ చిడతలు పట్టుకొని తిరుగుతున్నారు? శివసేన పార్టీ ముందే భాజపాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఏదో సామెత చెబుతారే అలాగ - యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలనే రెండు సింహాలు పబ్లిగ్గా మోదీజీని, భాజపా సర్కార్‌ని కూడా నిందిస్తూ తిడుతూ ఎడాపెడా వాయించేస్తున్నారు.

06/20/2018 - 23:52

ఓ సంకటం తప్పింది!

Pages