S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2017 - 23:58

సనాతన సంప్రదాయాలకు నిలయమైన భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో లింగవివక్ష ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా, శాస్త్ర- సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా మహిళల పట్ల చిన్నచూపు పూర్తిగా తొలగిపోలేదు. ఆడపిల్ల పుట్టడమే కుటుంబానికి శాపంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు.

02/16/2017 - 01:31

నేను చదువుకునే రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు కలసి ఒకసారి టీచింగ్ నోట్స్ తయారు చేసుకుంటే చాలు అది అధ్యాపక వృత్తిలో ఉన్నన్నాళ్లూ ఎంతగానో ఉపయోగపడేది. కానీ, ఇప్పటి కాలంలో తయారు చేసుకున్న టీచింగ్ నోట్స్ రెండో ఘడియ వరకు కూడా ఉపయోగపడటం లేదు. జ్ఞానం అంత తొందరగా మారుతూ ఉన్నది. అదే మాదిరిగా విద్యార్థుల ఆలోచనా ధోరణి కూడా చాలా వేగంగా మారుతూ ఉన్నది.

02/15/2017 - 01:23

తెలుగుగడ్డపై పుట్టిన ప్రతిబిడ్డకీ తెలుగు నేర్చే హక్కుంది.. ఆ హక్కును కాలరాసి మన పాలకులే మమ్ము పరాయి భాషకు బానిసలు చేస్తున్నారు. మా హక్కును గుర్తించి అమలుపరచండి. నేను తెలుగుగడ్డన పుట్టిన తెలుగుబిడ్డను..

02/12/2017 - 00:24

‘గ్రీన్‌లాండ్’ ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపంగా, అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశంగా పేరుపొందింది. ఈ చిన్న దేశం మంచులా కరిగిపోతూ చివరికి మనుగడ కోల్పోయే ప్రమాదం దాపురించింది. ఆర్కిటిక్ సముద్రానికి, ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి మధ్య కెనడాకు ఈశాన్యంగా, ఐస్‌లాండ్‌కి వాయువ్యంగా ఉంది గ్రీన్‌లాండ్. 44,087 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగిన గ్రీన్‌లాండ్ చట్టూ నూరు చిన్న చిన్న ద్వీపాలుంటాయి.

02/08/2017 - 01:10

మన దేశంలో వాయు కాలుష్యం విషమించడంతో వ్యాధుల బారినపడి ఏటా పనె్నండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం విజృంభిస్తున్న తీరుపై ‘గ్రీన్‌పీస్ ఇండియా’ అనే సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో అనేక ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. వివిధ రాష్ట్రాల్లోని కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలను రాబట్టి ఈ నివేదికను ‘గ్రీన్‌పీస్ ఇండియా’ విడుదల చేసింది.

02/01/2017 - 00:32

‘పంట చేతికొచ్చే వరకూ దైవాధీనం... ఆ తరువాత దళారీ దయాచిత్తం’... ఇదీ మన దేశంలో దీనావస్థకు చేరిన వ్యవసాయం ముఖచిత్రం. అన్నదాతల ఆత్మహత్యలను మానవ హక్కుల సంక్షోభంగా భావిస్తూ, వాటిని అరికట్టే విధానమేమిటని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడగడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సరైన పని చేసింది. ఇలా నిలదీయడం ద్వారా సుప్రీం కోర్టు వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల చిన్నచూపుని ఎత్తి చూపింది.

01/26/2017 - 07:31

ఎగరాలి.. ఎగరాలి.. గణతంత్రపు జెండా!
ఉల్లాసంగా.. ఉత్తేజంగా.. ఆకాశం నిండా!
భారతమాత భౌతిక చిహ్నమా!
భారతీయుల ఆరాధ్య దైవమా!
సమత.. మమత.. మానవతల ప్రతిరూపమా!
శాంతి సౌహార్ర్ధాల సమాహారమా!
స్వాతంత్య్రవీరుల త్యాగఫలమా!

01/25/2017 - 01:52

నీటి వనరులను పెంచుకోవడం ఎంత ముఖ్యమో, వా టిని పొదుపుగా వాడుకోవడం అంతే ముఖ్యం. మనదేశంలో 60 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి వుంది. సాగునీటి కొరత వల్ల వ్యవసాయోత్పత్తులను ప్రజలకు అందించడం అసాధ్యం. కొన్ని ప్రాంతాల్లో నీరు తక్కువ స్థాయిలో వుంటుంది. ఉన్న నీటిని ఆదా చేస్తూ వీలైనంత ఎక్కువ భూమికి అందించాలి. తాగునీరు విషయంలోనూ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

01/18/2017 - 00:49

భారత రాజ్యాంగాన్ని లిఖించిన సమయంలో రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులందరూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో పుట్టి పెరిగిన మతాలన్నింటినీ హైందవ మతాలుగా రాజ్యాంగంలో ప్రస్ఫుటింపజేశారు. భారత్‌ను ‘మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం’ అన్నారు. అయితే, నేడు జరుగుతున్నదేమిటి?

01/06/2017 - 23:50

నేటి నవ నాగరిక యుగంలో ఆహారోత్పత్తులు, వైద్యసేవలు ఎంత పెరిగినా అంతే స్థాయిలో రోగాలు కూడా మానవాళిని చుట్టుముడుతున్నాయి. ఇపుడు విశ్వవ్యాప్తంగా ‘కొవ్వు’ కారణంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 76 శాతం మంది (5.5 బిలియన్ల మంది) కొవ్వు వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

Pages