S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/01/2019 - 03:41

వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నపిల్లల మొదలుకొని పండు ముదుసలి వరకు ఎంతో హుషారుగా, ఆనందంగా కాలం గడుపుతారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కులాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతంగా కార్యక్రమం ముగించడానికి పలు ప్రయత్నాలు చేస్తారనడంలో అనుమానం అక్కర్లేదు.

08/30/2019 - 21:30

ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ...! ఆ మాట తలస్తేనే భక్తకోటి పారవశ్యానికి అవధులుండవు. కృష్ణాతీరాన కొలువైన ఆ తల్లి దర్శనానికి, అనుగ్రహానికి అర్రులు చాస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే తీర్థస్థలి... ఇంద్రకీలాద్రి ఇటీవల తరచూ వివాదాలకు ఆలవాలవౌతోంది. వరుసబెట్టి కుంభకోణాలు, అక్రమాలు వెలుగుచూడటం, కార్యనిర్వహణాధికారులు (ఈవోలు) మారిపోతుండటం ఆ కనకదుర్గగుడి ప్రతిష్టను మసకబారుస్తోంది.

08/28/2019 - 01:58

అబూజ్‌మాడ్.. అంతు చిక్కని ఓ ప్రహేళిక.. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్టల్ల్రో విస్తరించింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ అరణ్య ప్రాంతం ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటికీ అక్కడ ‘సర్వే’ జరపలేదని అంటారు. దాంతో ఆ ప్రాంతంపై ఆదివాసీలకు తప్ప ఇతరులకు సంపూర్ణ అవగాహన లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

08/27/2019 - 01:44

చరిత్ర గర్భంలో మహనీయులకు, మహానుభావులకు కొదవ లేదు. అలాంటి మహనీయుల సరసన మహానుభావులు కానివారూ, ఎలాంటి త్యాగాల అర్హతలు లేనివారూ కూడా చారిత్రక పురుషులుగా చేరిపోయారు. ఏ మూలాధారాలు, చారిత్రక సాక్ష్యాలు లేకుండా ఉదరపోషణ కోసమో, కళాపోషకుల మెప్పు కోసమో అలనాడు కొందరు చరిత్రకారులు చేసిన తప్పిదాలను నేటి చరిత్రకారులూ చేయటం అదే ఉదరపోషణ, మెప్పులలో భాగమే అని చెప్పక తప్పదు.

08/21/2019 - 01:52

వయసు రీత్యా పెద్దవాళ్లు మహావృక్షాల్లాంటి వారు. ఆధునిక జీవన శైలితో నిత్యం అశాంతిగా బతికే నేటి యువతకు ఈ మహావృక్షాలు నీడనిచ్చి సేద తీరుస్తాయి. అందుకే వృద్ధులను అభిమానంతో ఆదరించాలి. వయోధికులను గౌరవించేందుకు ‘జాతీయ వృద్ధుల దినోత్సవా’న్ని ఏటా ఆగస్టు 21న జరుపుకుంటారు. ఏదో మొక్కుబడిగా ‘సీనియర్ సిటిజన్స్ డే’ పాటిస్తే చాలదు.. వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి.

08/16/2019 - 02:00

దేహం మనసూ హిందూ హిందూ
జీవితమంతా హిందూ హిందూ
కణం కణంలో హిందూ హిందూ
నా పరిచయమిది హిందూ హిందూ ॥ దేహం॥
(హిందూ తన్ మన్ హిందూ జీవన్
రగ్ రగ్ హిందూ మేరా పరిచయ్)
.. ‘నా పరిచయమిది..’ అంటూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చెప్పిన కవితలోని ఈ పరిచయం యథార్థం. ఆయన పదవ తరగతిలో వ్రాసిన కవిత ఇది. అప్పుడప్పుడే ‘స్వయం సేవక్’ అయిన తొలి దశ అది.

08/15/2019 - 05:54

కొన్ని తరాల త్యాగాన్ని
ఒక్క రోజు.. కాదు కాదు ఒక్క పూట
గాంధీ తాత బొమ్మ సాక్షిగా
కొద్ది గంటలు
అలా గడిచిపోతాయి

ముసలి ముతక లాంటి నిన్నటి తరం
వాళ్ళు మిఠాయిలు పంచుతూ
మైకులో పాతకాలపు
దేశభక్తి పాటలు
వినిపిస్తారు.
ఈ జనం అనుభవిస్తున్న
స్వేచ్ఛ వెనుక ఎన్ని కష్టాలున్నాయో
నెమరువేసుకుంటారు
అయినాకూడా ఎవరికీ పట్టదు

08/14/2019 - 05:10

ఆధునిక యుగంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటి వినియోగం పెరగడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. వీటి దుష్పరిణామాలు అందరికీ ఆందోళన కలిగించేవే. చాలావరకు ప్లాస్టిక్ వస్తువులు ఒక్కసారి మాత్రమే వినియోగించేలా తయారుచేస్తున్నారు. ఫలితంగా స ముద్ర తీరాలలోను, బహిరంగ ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి.

08/10/2019 - 22:52

నేటి నవ నాగరిక యుగంలో మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం నానాటికీ విస్తరిస్తూ ప్రజారోగ్యం పాలిట పెనుశాపంగా మారింది. కూలిపనులు చేసేవారి మొదలు, విద్యార్థులు, నడి వయస్కులు చాలామంది వీటికి బానిసలవుతున్నారు. యువతరంపై మాదకద్రవ్యాల ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లోని విద్యార్థుల వరకు మత్తు పదార్థాల వినియోగం విస్తృతం అవుతోంది.

08/10/2019 - 22:50

ఇప్పుడేమి ఒరిగిందని వేడుకలు?
ఏమి సాధించామని సంబురాలు?
వేయాల్సిన అడుగులు ఎన్నో...
వీడాల్సిన చిక్కుముడులు ఇంకెనె్నన్నో...

కల్లోల కుంపట్లు చల్లారనే లేదు
ఉగ్రకుట్రలు భగ్నమవనే లేదు
శత్రువు తోకముడవనే లేదు
ఆక్రమిత కాశ్మీరం దుష్ట ‘చెర’వీడనే లేదు

Pages