S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/02/2019 - 01:41

హైదరాబాద్‌లోని వౌలాలీ ప్రాంతంలో ఇటీవల ముగ్గురు యువతులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలలో వీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూష అనే ఈ యువతులు చిన్నప్పటి నుంచే మావోయిస్టు భావజాలంతో ప్రభావితమై పని చేస్తున్నారని వినికిడి. అనూష, అన్నపూర్ణలు గెరిల్లా దళ జీవితాన్ని సైతం గడిపారు.

12/30/2018 - 02:06

గత నాలుగు దశాబ్దాలలో చైనా నూతన ఎత్తులకు ఎదిగింది. 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. డెంగ్ జియావో పింగ్ దార్శనికత, సాహసోపేత నిర్ణయాల కారణంగా చైనా ఇపుడు ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ నలభై ఏళ్ళలో 74 కోట్లమంది ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడటం గొప్ప ముందడుగు.

12/28/2018 - 22:21

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకొంది. ఈ ఊపుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలు ఊహల్లో తేలియాడుతున్నారు.

12/26/2018 - 01:16

ఈమధ్యకాలంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు, యింకా 2019 ఎన్నికల దాకా రాహుల్‌గాంధీ, ఆయన అనుచరులు, ఆయనతో కొత్తగా కాంగ్రెస్ కండువా వేయించుకున్న చంద్రబాబునాయుడు- వీరందరినోట మోగుతున్నమాట ‘మోడీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించిందట.’ ప్రజాజీవితంలో దశాబ్దాలుగా చలామణీ అవుతున్న ఈ నాయకుల నోట యింతకన్నా పెద్ద అబద్ధం మరోటి వుండదు. ప్రజాస్వామ్య దేశంలో పార్టీలకు సిద్ధాంతాలుంటాయి.

12/22/2018 - 22:19

(నేడు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి 137వ జయంతి)

12/22/2018 - 22:17

(నేడు పీవీ వర్ధంతి)

12/21/2018 - 23:07

(నేడు గణిత దినోత్సవం)

12/19/2018 - 03:50

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ జన సమితి’ (తెజస)ని నిలబెట్టాలని ప్రొఫెసర్ కోదండరామ్ కలలుగన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. పోటీ చేసిన చోటల్లా డిపాజిట్లు గల్లంతయ్యాయి. తెజస పార్టీ బొక్క బోర్లాపడింది. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద పార్టీలతో సన్నిహిత సంబంధాలు కలిగి పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ ‘గ్రాఫ్’ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది.

12/16/2018 - 02:39

నిషేధిత మావోయిస్టు పార్టీ చేస్తున్న హింస, విధ్వంసకాండ కారణంగా ప్రాణభయంతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిమంది గుత్తికోయ గిరిజన కుటుంబాలు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలకు వలసవచ్చి దిక్కులేని పక్షుల్లా జీవిస్తున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

12/14/2018 - 22:44

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ తనకు నచ్చకపోతే- తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) మీటను నొక్కే అవకాశాన్ని ఓటరుకు ఎన్నికల సంఘం కల్పించింది. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు ఓటరుకు దక్కిన ‘నోటా’ అవకాశం ఇటీవలి కాలంలో విస్తృత ప్రచారమైంది. ‘నోటా’ ఓట్ల కారణంగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ఓటమి చెందుతున్న సందర్భాలున్నాయి.

Pages