S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/02/2020 - 21:48

‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న రీతిలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగటం ఎ.పి. ప్రజల దురదృష్టం. సి.యం.గా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఆయన ఒంటెద్దు పరిపాలనకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఏ కొత్త నిర్ణయంలోనూ, విధానంలోనూ ప్రజల్ని కానీ ప్రభుత్వ అధికారుల్ని కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ స్వపార్టీలోని ముఖ్యులను కానీ భాగస్వాముల్ని చేయకపోవటం బాధాకరం.

02/02/2020 - 21:43

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపితగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు, గౌరవం పొందారు. జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలను కేసీఆర్ విభేదించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించడం విచారకరం. ఆరు సంవత్సరాల క్రితం కేసీఆర్ మస్తిష్కంలోంచి వెలువడిన ప్రతి ఆలోచనా అద్భుతం. తిరుగులేనిది. అతని విరోధులను సైతం చకితుల్ని చేసింది. ఆ ప్రసంగాలు, భావాలు అగ్గి రాజేశాయి. ప్రపంచమే ఆయన వెంట నడిచింది.

01/29/2020 - 02:33

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. కరోనా వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అన్నిచోట్లకు పాకుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టింది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.

01/28/2020 - 01:39

మూడు దశాబ్దాల క్రితం... అందమైన కశ్మీర్ లోయ నుంచి లక్షల మంది హిందువులు (పండిట్లు) స్థానచలనం కావడం, ముస్లిం ఉగ్రవాదులు, అతివాదులు వారిని ఊచకోత కోయడం, విధ్వంసానికి పాల్పడటం, హిందూ స్ర్తిలపై అత్యాచారాలకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఆలయాలను నేలమట్టం చేయడం నేటికి చాలామంది కళ్ళముందు కదలాడుతోంది. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఇటీవల ఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది.

01/27/2020 - 06:55

ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోకి పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున ‘మిడతల దండు’ వచ్చి పంటలను సర్వనాశనం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌర పట్టికను వ్యతిరేకించేవారు అదే రీతిలో మిడతల దండులా దాడి చేస్తున్నారు. ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను కలుషితం చేస్తున్నారు. ఉత్పాదకతను దెబ్బతీస్తున్నారు. ఈ చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

01/26/2020 - 23:15

నేడు అంతర్జాతీయ కస్టమ్స్ డే..
*
‘ఇండియన్ కస్టమ్స్..’
భారతదేశ కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో పనిచేసే శాఖలలో కస్టమ్స్ (సీమా పన్ను), సెంట్రల్ ఎక్సైజ్ (దేశీయ ఉత్పాదనలపై పన్ను), జీయస్‌టీ(వస్తువులు, సేవలపై పన్ను) వ్యవహారాలు చూసే ఒక శాఖ ఉన్నది.

01/26/2020 - 23:09

భారత స్వాతంత్య్ర సమరయోధులు జాతీయ రాజకీయ ప్రముఖ నాయకులు 1930 జనవరి 26నే భారతదేశానికి స్వరాజ్య దినంగా పాటిస్తూ వచ్చారు. సంపూర్ణ స్వరాజ్యం అదే తేదీన ఇవ్వాలని బ్రిటీష్‌వారిని కోరినా కాదని వారు 1947 ఆగస్టు 15వ తేదీన ఇచ్చుట గమనార్హం. 1946 డిసెంబర్ 6న రాజ్యాంగం ఆవిర్భావం జరగటం.

01/26/2020 - 23:07

హిందూ ధర్మం నుండి అన్యమతాలలోకి మారిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం గురించి ‘ప్రబుద్ధ భారతి’ పత్రిక ప్రతినిధి 1899 ఏప్రిల్‌లో స్వామీ వివేకానందతో చేసిన సంభాషణ ఇలా ఉంది (ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, సంపుటి-5, పుటలు: 233- 234):

01/26/2020 - 02:40

ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యానికి దిక్సూచి ఓటు వినియోగించుకోవటం ప్రధాన కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన ఆయుధం. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఓటు విలువ గురించి, ప్రయోజనం గురించి ఓటర్లకు తెలియచేస్తూ అవగాహన కల్పిస్తారు. కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకునే వారికి అవకాశం కల్పిస్తారు.

01/26/2020 - 02:39

మరోసారి దేశవ్యాప్తంగా గణతంత్ర దినో త్సవం వేడుకల కొరకు కార్యక్రమాలు పూర్తిచేశారు. ప్రతి యేటా ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు (రిపబ్లిక్ డే) వేడుకలు జరుపుకోవడం ఏడు దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది.

Pages