S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/21/2018 - 05:13

ముంబయి: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 13తో ముగిసిన వారంలో 734.5 మిలియన్ డాలర్లు తగ్గి, 405.075 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గణాంకాలు ఈ విషయం వెల్లడించాయి. అంతకు ముందు వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 248.20 మిలియన్ డాలర్లు తగ్గి, 405.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

07/21/2018 - 00:10

ముంబయి, జూలై 20: ఐటీ, ఫార్మా షేర్లలో వచ్చిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 145 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికన్నా ఎగువన ముగిసింది. మదుపరులు..

07/21/2018 - 00:09

అమరావతి, జూలై 20: కామర్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నైపుణ్యతా శిక్షణ ఇచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసి), నేషనల్ స్టాక్ ఎక్సేంజి అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది.

07/21/2018 - 00:07

న్యూఢిల్లీ, జూలై 20: భారత్ అమెరికాకు చేస్తున్న ఉక్కు ఎగుమతులు చాలా తక్కువని, అందువల్ల అమెరికా ఉక్కు దిగుమతులపై పెంచిన సుంకాల వల్ల భారత పరిశ్రమకు ఇప్పటికిప్పుడే ఎలాంటి ముప్పు వాటిల్లబోదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది.

07/20/2018 - 12:07

ముంబయి: రూపాయి ఈరోజు మరింత పతనం చెందింది. జీవనకాల కనిష్టానికి చేరటం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.69.12కి చేరింది.

07/20/2018 - 01:24

ముంబయి: మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు గురువారం స్వల్పంగా పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సెషన్ ఆరంభంలో పొందిన లాభాలను కోల్పోయి, చివరకు 22 పాయింట్లు పడిపోయి 36,351.23 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 23.35 పాయింట్లు (0.21 శాతం) దిగజారి 10,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.

07/20/2018 - 00:23

తిరుపతి, జూలై 19: మేలైన కాటన్ వస్త్రాలకు రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ పెట్టింది పేరని ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడిందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు.

07/20/2018 - 00:22

అహ్మదాబాద్, జూలై 19: ప్రస్తుతం వ్యక్తులు, సంస్థల వద్ద ఉండే నగదు నిల్వలపై ఉన్న నిబంధనను సవరించాలని, 20లక్షలు ఉన్న దీనిని కోటి రూపాయలకు పెంచాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

07/20/2018 - 00:51

ముంబయి, జూలై 19: త్వరలో కొత్త వంద రూపాయల కరెన్సీ నోటును విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా కొత్త నోటును విడుదలచేస్తారు. కొత్త వంద నోటు లావెండర్ (ఊదా) రంగు కలిగి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన రాణి కీ వావ్ హెరిటేజ్ ప్రదేశాన్ని ఈ నోటుపై ముద్రిస్తారు. కొత్త నోటు సైజు 66ఎంఎం, 142 ఎంఎం.

07/20/2018 - 00:48

న్యూఢిల్లీ, జూలై 19: రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం (రెరా) అమలు కారణంగా గత సంవత్సరం దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు ఎనిమిది శాతం తగ్గాయి. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ ఇండియా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Pages