S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

03/26/2017 - 03:32

పెద్దన్నగా అహంకరించి
మేధోవలసల్ని ఆహ్వానించిన
అమెరికా ఆకశాన నిలిచి
ప్రపంచానికొక విడిదైంది!
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైన గద్ద
రెక్కలొచ్చి ఒక చూపు చూసింది
అంటే తెల్లధనం కరుడుగట్టింది
ఆ పార్థీడ్, స్టాచ్యూపై రెట్టవేసింది
బహుళతత్వాన్ని ఆదరించి
ఊర్థ్వముఖ ప్రగతిని పొంది
మతం పేరున నిషేధమంటూ
అది మధ్యయుగాల బాటను పట్టె

03/26/2017 - 03:27

పేజీలు: 36, వెల: రూ.10
ప్రతులకు: శ్రీమతి ఎం.గోదాదేవి
11-73/2, హన్మకొండ రోడ్,
హుస్నాబాద్,
జిల్లా సిద్ధిపేట-505467
సెల్.నం.9440155240
**

03/26/2017 - 03:19

కందాళై రాఘవాచార్య
ప్రముఖ కవి, రచయిత
నిజామాబాద్
సెల్.నం.9908612007
**

03/19/2017 - 09:18

ఆదివారం తీరుబడిగా.. పాత ఆల్బం ఏదో తిరగేస్తుంటే చిన్ననాటి ఫోటోలను చూసి ఆనాటి బాల్యపు స్మృతుల్లోకి మది ప్రయాణించింది. అవి ఎప్పటికి పాతబడని ఊహలు! మదిని రసాలూరించే ఆ పాత మధురాలు! నిజమే కదూ! ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏవైనా వాటి చుట్టూ మనం పోగు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. వాటితో అల్లుకున్న మన స్మృతుల పరిమళం గొప్పది.

03/12/2017 - 02:41

ఉదయం తొమ్మిదయింది..
సెల్ ఫోన్ మ్రోగింది..
రెస్పాండ్ కాకుండా మళ్లీ నిద్రలోకి జారుకున్నా..కాసేపటికి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఏంటీ పడుకోనీయకుండా ఏమిటీ ఈ గోల అని..నాలో నేనే గుణుగుతూ..నెంబర్ చూడకుండానే ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాను.
‘హలో డియర్’ అన్న ఆత్మీయ పలకరింపు..కమ్మని స్వరం..నన్ను ఏక బిగిన నిద్రమత్తు వదిలేలా చేసింది.

03/12/2017 - 02:29

నాలోని అనుభూతులు
నాలోని ఆలోచనలు
ప్రశాంతత కోరుకుంటున్నాయి
ప్రలోభాలకు లొంగకుండా
ప్రమోదాలతో పొంగిపోకుండా
విశ్వాసమనే శ్వాసతో
అనంతమైన ఆకాంక్షలతో
ప్రతీక్షణం తలపోస్తుంటున్నాయి
విశాల భావాలను విరబూయిస్తూ
అభ్యుదయపథాన పురోగమిస్తూ
ప్రతీ అడుగులోనూ జాగ్రత్తదపడుతూ
ప్రతీ ఆలోచనలోనూ
ప్రపూర్ణతని కోరుకుంటున్నది

03/12/2017 - 02:17

అనుభూతిని పంచేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి శ్రీ జి.వి.కృష్ణమూర్తి వృత్తిరీత్యా ఉద్యోగవిరమణ చేసిన ఉన్నత పాఠశాల ప్రధానచార్యులు. గణితశాస్త్ర బోధకులుగా అందరి మన్నన పొందిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. ఛందోబద్ధ పద్య రచన చేయడంలో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్‌కు చెందినవారు.

03/05/2017 - 07:49

ఏడు పదుల వయసుదాటిన కమలమ్మ వృద్ధాప్యంలో..తన సొంతింట్లో ఓ మారుమూల గ్రామంలో జీవనం గడుపుతోంది. ఆ గ్రామంలోని మనుషులందరూ ఆమెను ఆప్యాయంగా నానమ్మ, అమ్మమ్మ అని పిలుస్తుంటారు. బాగా చదువుకోక పోయినా రాయడం, చదవడం తెలుసు..దశాబ్దాలుగా ఆ ఊళ్లో ఉంటున్న ఆమెకు సొంత ఇల్లే లోకం.. తనకున్న నలుగురు కొడుకులు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త చనిపోయి..నలభై ఏళ్లు కావస్తోంది.

02/25/2017 - 23:21

అప్పటికే ఆలస్యమైందనుకుంటూ వడివడిగా నడుస్తూ సునీత బడిలోకి చేరింది. యుకేజీ చదువుతున్న దినేష్‌కు లంచ్ టైంలో అన్నం తినిపించడానికి ఇంకో నాలుగైదు నిమిషాల సమయమున్నట్లుంది. పిల్లలకు భోజనం పెట్టడానికి అన్నపూర్ణమ్మలు ఒక్కొక్కరు బడిలోకి చేరుతున్నారు. మూడు గంటల సేపు చదివి చదివి ఆకలితో అలమటిస్తున్నట్లుంది బడి.

02/25/2017 - 23:19

పేజీలు: 108, వెల : 50/-
ప్రతులకు: ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ హైస్కూల్
ముస్తాబాద్-505404
రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9440676048
**

Pages