S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

11/20/2016 - 06:38

‘సార్! మీకోసం ఎవరో వచ్చారండీ!’ చెప్పాడు అటెండర్. ‘సరే! లోపలికి రమ్మను’ అనుమతి ఇచ్చాడు ప్రభాకర్ రావు. ‘నమస్కారం సార్’ అంటూ వచ్చి నిలబడింది నడీవయసు స్ర్తి - ‘చెప్పండమ్మా! ఏం పని మీద వచ్చారు?’
ఈమధ్య కాలం చేసిన ‘సత్యం మాస్టారు భార్యనండి నా పేరు సీతమ్మ’ భర్త గూర్చి చెబుతుంటే ఆమె గొంతు పూడుకుపోయింది.

11/12/2016 - 23:45

మల్లెల మకరంద జంట మంజుల, ప్రవీణ్‌ది. కష్టపడి చదువుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. క్యాష్ కౌంటర్ తెరిచి బంగారు, వెండి నగలు తాకట్టు మీద రుణ సదుపాయం కల్పిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. క్యాష్ కౌంటర్ రోజు రోజుకు విస్తరించి ఒక విత్త సంస్థగా మారింది.

11/12/2016 - 23:41

వాగ్దేవి పిల్లలం
ఆదిలాబాదు వాసులం
అక్షర క్రమంలో వలె
ఆదిలాబాద్ జిల్లాను
తెలంగాణ రాష్ట్రంలో
ప్రథమంగా చేర్చుదాం
తెలంగాణ సాధనలో
అలుపెరుగక పోరాడిన
ఘనచరిత గల మనమంతా
ఏకమై మసితలోన వెలుగుదారి
కొమురం భీం ఆశయాలు
సాధించగ తరలు దారి
వరదన్నల సదాశివల
స్ఫూర్తితో ఎదుగుతూ
సాహిత్య సోయగాలు
దశ దిశలా చాటుతాం

11/12/2016 - 23:36

డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్
చిరునామా:
ఇం.నం.11-9-317
లక్ష్మీనగర్, రోడ్.నం.4
కొత్తపేట, పోస్టు: ఆర్‌కె.పురం,
హైదరాబాద్ - 500102
సెల్.నం.9441054637
**

11/06/2016 - 07:49

డిసెంబర్ నెల చలి కాస్త ఎక్కువగానే వుంది. మంచుదుప్పటి సూర్యుడు మెల్లగా బయటకు తొంగిస్తున్నాడు. ఊరపిచ్చుకల అరుపులు కిటికి పక్కనే ఉన్న జామచెట్టుపైన రివ్వున ఎగురుతూ ఆడుతున్న చప్పుడు వినబడుతోంది. అప్పుడే తలంటుపోసుకోవడంతో కురుల నుండి కారే నీటిబొట్లను తుడుచుకుంటూ గోడకు వేలాడుతున్న అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకున్నాను. చామనఛాయ రూపంలో ఉన్న తనలో ఎక్కడా ఏ చిన్నలోపం లేదు.

10/30/2016 - 00:31

అది గ్రామసభ. ఆ ఊరి ప్రజలందరూ చిన్నా, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా హాజరయ్యారు. నాయకులు, అధికారులు ఆ సభకు వచ్చి ప్రసంగించాల్సి ఉంది. గంటలు గడిచిన కొద్దీ సహనం నశిస్తోంది. ప్రజలందరూ లాభం లేదని లేచి వెళ్లిపోదామని అనుకుంటున్న తరుణంలో రయ్ రయ్‌మంటూ ఓ అరడజను కార్లు, ఓ డజను జీపులు వచ్చి ఆగాయి. అందులో నుండి అధికారులు, రాజకీయ నాయకులు చోటా, బడా లీడర్లు అందరూ దిగారు. సభలో కలకలం మొదలైంది.

10/30/2016 - 00:28

ప్రతులకు:
డాక్టర్ డి.పద్మావతి
ఫ్లాట్ నం.301
సప్తగిరి హైట్స్
సాయినగర్ కాలనీ
ఇసిఐల్ (పోస్టు)
కుషాయిగూడ
మేడ్చల్ జిల్లా
సెల్.నం.944128679
**

10/30/2016 - 00:24

కన్నతల్లి తన పాలామృతాన్ని
త్రాగించకుండా జోలపాటతోనే
ఏడ్పును మాన్పింపచూస్తే
నవ్వుతూ శిశువు నిద్రలోకి జారుతుందా?
ఆత్మహత్యల నివారణోపాయం చూపక
కవులు రైతులకై సానుభూతి కవిత్వం వ్రాస్తే
వారి కష్టం తీరుతుందా?
ఆత్మస్థైర్యం సిద్ధిస్తుందా
యువత తమ సంస్థకు బలమని
పొగడ్తలతో సరిపుచ్చితే
నవతరానికి బ్రతుకుపై ఆశ చిగురిస్తుందా?

10/30/2016 - 00:18

- ఎం. వి. నరసింహారెడ్డి
: చిరునామా :
ఎం. వి. నరసింహారెడ్డి
కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల
జగిత్యాల జిల్లా
సెల్.నం.9849110922
**

10/23/2016 - 04:08

‘చందూ.. చందూ.. అబ్బా ఎన్నిసార్లు పిలిచినా పలుకవేంటి.. కోపమొచ్చిందా..’
‘ఆ! రాదా మరి? ఎంత సేపటినుంచి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయవేంటి. నేనొచ్చి ఎంత సేపయింది. ఎక్కడికి వెళ్లావు సుధా’
‘అదే చెబుతున్నాను, మీకో మంచి శుభవార్త తీసుకొచ్చి వచ్చాను. మనకి బాగా ఆదాయం వచ్చే వార్త’.
‘ఏంటా వార్త..?

Pages