S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

07/10/2016 - 08:26

ప్రతులకు:
డాక్టర్ తిరునగరి శ్రీనివాస రావు
శ్రీ సాయివాసు ప్రథమ చికిత్సా కేంద్రం
ఇం.నం.6-36, పాండురంగాపురం గ్రామం
బల్లేపల్లి (పోస్టు), జిల్లా ఖమ్మం-507002
సెల్.నం.9394171299
పేజీలు : 126, వెల : 100/-
**

07/03/2016 - 05:18

కుమార్ అంటే సినిమా పిచ్చోడని ఆ వూళ్లో అందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి కుమార్‌కు సినిమాలంటే తగని పిచ్చి. ఊళ్లోకి పబ్లిసిటీ రిక్షా వచ్చిందంటే కుమార్ దాని వెంబడే వుండేవాడు. హీరోల ఫోటోలు చూస్తూ తన్ను తాను ఆ హీరోగా ఊహించుకునేవాడు. ఆ సినిమా పిచ్చి ఇంతింతై వటుడింతయై అన్నట్లు కుమార్‌తో పాటే పెరిగి పెద్దదైంది. సినిమాల్లో చేరాలన్న ఆలోచన అంతకంతకు ఎక్కువైంది.

,
06/27/2016 - 07:46

ఆమె దుఃఖం
పొద్దునే్న, ఆమె చీపురు పట్టుకొని
వాకిట్లో నాట్యమాడుతున్నది,
నెమలిలా..
నిన్నటి రాత్రి
మాటలు కలెబడ్డ దుర్ఘటన
నివ్వెరపోయి చూస్తున్న రెండు బాల పిచ్చుకలు
సింహం జూలు గుంజనట్టు
గుర్రుమన్న మగ అహంకారం
సన్నజాజి వొంటిపై విరుచుకుపడ్డ
నిప్పు కణికల ఆగ్రహం
పిట్టగూటిలో కన్నీటి జడివాన
ఇల్లంతా విరబూసిన వౌనం

06/27/2016 - 07:30

‘పాత ఇనుము, పాత పేపర్లు కొంటాం’ తోపుడు బండిని తోసుకొంటూ వెళ్తున్న లలిత గొంతు రోడ్డు మీద పరుగెడుతున్న వాహనాల శబ్దంతో పోటీపడుతోంది. అప్పటికే నాలుగు వీధుల్లో నాలుగు చక్రాల బండిని తోసుకెళ్తూ నాలుగైదు ఇళ్లల్లో పాత ఇనుము, పాత పేపర్లు కొనేసింది. బండి కింద నవారు మంచము లాగున్న దానిమీద సంవత్సరం కొడుకు హాయిగా నిద్రబోతున్నాడు. ముంగురులు సవరించుకొంది. అప్పటికే సూర్యుడు నడినెత్తిమీద కొచ్చిండు.

06/27/2016 - 07:49

పేజీలు: 80, వెల : 59/-
ప్రతులకు: ఎ.సుకన్య
శాస్ర్తీనగర్, నిర్మల్
ఆదిలాబాద్ జిల్లా - 504106
సెల్.నం.9849326801
**

06/19/2016 - 07:56

పార్కులో సిమెంటు బెంచిమీద కూర్చొని సేద తీరుతున్నాడు రంగారావు. అరుణిమ ఆకాశంలో బారులు తీరి గూళ్లకు వెళ్లిపోసాగాయి పక్షులు. అక్కడక్కడా ఆడుకుంటున్న పిల్లలు, కబుర్లు చెబుతూ నవ్వుకుంటున్న మధ్యవయస్క జంటలు. ఇంత మందిలో ఎక్కడైనా తనలాంటి వాళ్లు ఉన్నారేమోనని చుట్టూ పరికించాడు. నెరిసిన తలలతో, ముసిరిన ఆలోచనలతో, ముదిమి భారంతో, ఊతకర్ర సహాయంతో ఈవినింగ్ వాకింగ్ చేస్తూ కొందరు.

06/13/2016 - 07:30

రాత్రి పది గంటలు యశోదమ్మ ఒంట్లో కాస్తా నలతగా ఉండడం వల్ల త్వరగా భోజనం చేసి పక్కలోకి చేరింది. అలసిన దేహం నిద్రలోకి జారుకుంది.
‘అమ్మా! ఫోన్ నీకే’ చిన్న కూతురు నిద్ర లేపి సెల్‌ఫోన్ చేతికందించింది.
‘అమ్మా... భోజనం అయ్యిందా... పడుకున్నావా?’ ఫోన్ చేసింది పెద్ద కూతురు వందన.
‘కాస్త తలనొప్పిగా ఉంటేనూ, త్వరగా పడుకున్నాను’

06/05/2016 - 05:59

పెళ్లిచూపుల తతంగం ముగిసింది. చూడగానే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. తమ పెద్దవాళ్లు ‘ఓకే’ అనుకునే లోపల, వైశాలితో ఏకాంతంగా ఓ పది నిమిషాలు మాట్లాడాలని వరుణ్ అనగానే... ఇద్దర్నీ ఇంటి వెనక పెరట్లోకి పంపారు.
‘వైశాలిగారు! నాకు మీరు బాగా నచ్చారు. పెళ్లికి నాకైతే అభ్యంతరం లేదు. మీరు చెప్పండి... మీకు అంగీకారమేనా?’ వరుణ్ మాటలకు వైశాలి సంతోషంగా తల ఊపి తన సమ్మతాన్ని కూడా తెలియజేసింది.

05/29/2016 - 06:32

అతని పేరు పరాంకుశం. ‘అంకుశం’ అతని కలం పేరు ‘అవినీతి, అక్రమాలకు తన రచనలు ‘అంకుశం’ వంటివని అతనంటుంటాడు. వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డ అతని కథలు ‘అంకుశం కథలు’ అన్న పేరుతో ఈ మధ్యనే పుస్తకంగా అచ్చయ్యాయి.

05/22/2016 - 05:18

పెళ్లి మండపమంతా కోలాహలంగా ఉంది. పెద్దవారితో తాకించి మంగళధారణ కార్యక్రమం పూర్తి చేయడంతో మగవాళ్లు, ఆడవాళ్లు అంతా వరుసగా వేదికపైకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ వారి గుర్తుగా బహుమతులు ఇస్తున్నారు. వారి గుర్తుగా ఇస్తున్న జ్ఞాపికలను, డబ్బులు పెట్టి ఇస్తున్న కవర్లను పక్కనే కూర్చున్నా అమ్మమ్మ చేతికందిస్తుంది పెళ్లి కూతురు కళ్యాణి.

Pages