S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

01/22/2017 - 03:33

గోపాలానికి ఇద్దరు కుమారులు. వాళ్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. తను ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు.

01/22/2017 - 03:31

మోక్షం మోక్షం అంటారు
పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతారు
చుట్టూ ఆకలితో అలమటిస్తున్న
అన్నార్తులను మాత్రం ఆదుకోరు
స్వార్థం కోసం పేదవారి శ్రమను
పగలు రాత్రి దోపిడీ చేస్తారు
విరిసీ విరియని విరులను
బానిసలుగా చేస్తారు
బోలేడు సేవలు చేసుకుంటారు
భక్తి శివుని మీద పెట్టి
చిత్తం చెప్పుల మీద ఉంచుతారు
నోట్లో రామనామం జపిస్తారు

01/22/2017 - 03:25

కవిత్వంలో, రచనల్లో వాదాలు, ఇజాలు అవసరమేనని గట్టిగా విశ్వసించే ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు మెదక్ జిల్లా (ఇప్పటి సిద్ధిపేట జిల్లా) రావురూకుల గ్రామానికి చెందిన వారు..

01/08/2017 - 00:01

రాధ అమరనాథ్‌కు స్వయానా మేన కోడలు. తల్లి లేని పిల్ల, మూడు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమర్ అక్క మాధవి క్యాన్సర్ వ్యాధితో కనుమూస్తే తను భార్య అంజలితో కలిసి వెళ్లి తన ఇంటికి తెచ్చుకొని స్వంత కూతురులా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అత్తయ్య మామయ్యలు అప్పుడప్పుడే కళ్లు తెరిచిన ఆ పసిదానికి అమ్మా నాన్నలయ్యారు. బుద్ధిమంతురాలిగా పెరుగుతున్న రాధపై ఈగ కూడా వాలనివ్వరు ఆ ఆలుమొగలు.

01/07/2017 - 23:57

సీనియర్ రచయత శీలం జగతీధర్
**

01/07/2017 - 23:51

ఒకరోజు బ్రతికే గడ్డిపూవునడుగు
జీవితమంటే ఏమిటో చెబుతుంది!
ఎంత కాలం బ్రతికావని కాదు..
ఎంత ఆనందంగా గడిపామన్నది ముఖ్యం!
ఎంత కాంతిలో ఉన్నావని కాదు..
ఇతరులకు ఎంత వెలుగును పంచావో ముఖ్యం
ఒకసారి నిశీధి రాత్రిలో..
నిశ్శబ్దంగా రాలిపోలే నక్షత్రాలనడుగు..
ఎంత అడుగున ఉన్నామని కాదు..
సహనంతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని..
అగాధాల అంచున మెరిసే

12/31/2016 - 22:52

ఉద్యోగరీత్యా లక్ష్మికి ముప్పై కిలోమీటర్ల ప్రయాణం. దాదాపు ముప్పై మంది, అందరు కలిసి మినీ బస్సులాంటిది మాట్లాడుకున్నారు.

12/25/2016 - 07:11

సాయంత్రం ఐదయింది. రోజంతా స్కూల్‌లో పాఠాలు చెప్పి.. అలసిన వదనంతో అప్పుడే ఇంటికి చేరింది టీచర్ సుజాత. ఫ్రెష్ అయ్యి..కాఫీ సేవించి.. దినపత్రికలను తిరగేస్తోంది..ఇంతలో ఫోన్ మ్రోగింది. ‘హలో ఎవరండీ’ అంటూ పలకరించింది..
‘నమస్కారం..నేను మేడం మీ స్టూడెంట్ విజయను..మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీగా వున్నారా? అని అంది.

12/18/2016 - 22:32

ఫోను మ్రోగడంతో - ‘హలో అన్నాడు. 80 ఏండ్ల వయస్సులో వున్న లక్ష్మయ్య సారు వణుకుతున్న గొంతుతో..
‘కలెక్టరును మాట్లాడుతున్న’
‘కలెక్టర్‌గారా.. అయ్యా నమస్తే సార్’
‘మీకు రేపు ఉదయం పది గంటలకు మా ఇంట్లో సన్మానముంది. తప్పక రావాలి’
‘సన్మానమా..ఎందుకు సార్’
‘ఎందుకో మీరొచ్చాక తెలుస్తుంది’ అని ఫోను పెట్టేశారు కలెక్టర్ గారు.

12/18/2016 - 22:27

ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే
మనో గగనాన్ని పరికిస్తే
ఒక అద్భుత కాంతిపుంజం
ఆవిష్కృతమవుతుంది
అమృత శాంతికలశం
ప్రత్యమవుతుంది
ఆ దివ్య దీపమే ఉపాధ్యాయుడు
నిత్య చైతన్య స్వరమే ఉపాధ్యాయుడు
అనురాగరాగాల చల్లదనం పంచే అమ్మ
ఆత్మీయతా కాంతులు పంచే నాన్న
కరుణామృతాన్ని నిరంతరం పంచే దైవం
ఆ మూడు రూపాలకు ప్రతిరూపం అతడు!
అచేతనాన్ని కదిలించే

Pages