S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/10/2019 - 23:02

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.

03/05/2019 - 18:33

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడే సౌందర్య లేపనాలు, సంప్రదాయ పద్ధతులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవేనని చరిత్ర చెబుతోంది. ఈతరం వారు వాడుతున్న సౌందర్య లేపనాలు అంటే కాస్మొటిక్స్ మన పూర్వీకులు వాడినవే అని అందరికీ తెలియని విషయం. కానీ ఇప్పటికీ ఆ సౌందర్య చిట్కాలను నిపుణులు కొనసాగిస్తున్నారు. అవేంటో చూద్దామా..
సముద్రపు ఉప్పు

02/28/2019 - 20:00

ఎండలు ముదురుతున్నాయి. ఎండల నుంచి రక్షణ పొందాలంటే సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది రకరకాల సమస్యల నుంచి కాపాడుతుంది. ఎండలో ముఖ్యంగా యూవీ-ఎ, యూవీ-బి అనే కిరణాలు ఉంటాయి. యూవీ-ఎ కిరణాల వల్ల చర్మం కమిలిపోదు కానీ వలయాలు రావచ్చు. ఇవి క్యాన్సర్‌కీ కారణమవుతాయి. యూవీ-బి వల్ల చర్మం కందిపోయినట్టు అవుతుంది. అద్దాల నుంచి ఈ కిరణాలు లోపలికి ప్రసరిస్తాయి.

02/27/2019 - 18:50

మాఘమాసం వచ్చిందంటే చాలు.. మల్లెపూల ఘుమఘుమలు మొదలు.. మల్లెపూలు పరిమళానే్న కాదు, చర్మానికీ మేలుచేస్తాయి. వీటిల్లో సహజంగా ఉండే ఔషధ గుణాలే ఇందుకు కారణం. ఈ కాలంలో ఎక్కువగా దొరికే మల్లెపూలతో ఎలాంటి పూతలు వేసుకోవచ్చో చూద్దాం.

02/27/2019 - 18:46

సంగీతం అంటే ఇష్టం ఉండని వారెవరు? కానీ మనం వినే సంగీతం చాలామంది ఇబ్బందిగా మారచ్చు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే నాలుగు నిముషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో సంగీతం వినడం ప్రమాదకరమని మీకు తెలుసా? ఇదే కొనసాగితే వినికిడి సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

02/26/2019 - 19:23

చిన్నప్పటి నుంచి తల్లి ఆహారం బాగా నమలాలని, అలా చేస్తేనే జీర్ణం అవుతుందని చెబుతూనే ఉంటుంది. తరువాత పుస్తకాల్లో కూడా దీని గురించి చదువుకున్నాం. కానీ నేడు.. తినే సమయం లేదనో, హడావుడిగా పరిగెట్టాలనో గబాగబా తినేస్తుంటారు. ఇలా ఆహారాన్ని నమిలి తినకపోతే లావైపోతారు అని చెబుతున్నారు నిపుణులు. ఈ యాంత్రిక యుగంలో సెడంటరీ జీవన విధానం పెరిగిపోతుంది.

02/24/2019 - 19:31

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే తాపత్రయం తెలిసిందే.. కానీ ఈ తాపత్రయం, ఆత్రుత పిల్లల్లో ఉన్న సహజ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. పదో తరగతి విద్యార్థికి ‘ఎ’ గ్రేడ్, ఇంటర్ విద్యార్థికి 99 శాతం తప్పనిసరి అనే ఆంక్షలు వారిలో మానసిక భయాన్ని పెంచుతున్నాయి. అంచనాలు తప్పితే విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రులే ఎక్కువగా తల్లడిల్లిపోతున్నారు. పిల్లలను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు.

02/22/2019 - 20:12

నలభై సంవత్సరాలు దాటిన ప్రతి స్ర్తిలో మోకాళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. కారణం విటమిన్-డి లోపం.. మనం ఏ పనిచేసినా మోకాలిపై భారం పడుతుంటుంది. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తుల్లో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అయితే వయసును బట్టి మోకాలినొప్పి బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన వారిలో మోకాళ్లనొప్పులు రావడం సాధారణం.

02/21/2019 - 18:22

సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల, ఎండలో తిరగడం వల్ల, కాలుష్యం వల్ల కూడా సన్ టాన్ వస్తుంది.

02/20/2019 - 19:00

ఒత్తిడిని అదుపు చేసుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందులో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అందరికీ తెలిసినవే.. కానీ స్నానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుందని మీకు తెలుసా! స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మెదడుకూడా తేలికపడి హాయిగా అనిపిస్తుంది. అందుకే కాస్త చికాగ్గా అనిపించినా చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అలాంటి రకరకాల స్నానాల గురించి చూద్దాం..

Pages