S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

07/25/2018 - 19:49

కొందరిలో జుట్టు చిన్నప్పుడే తెల్లబడి పోతుంటుంది. ఇంకొందరి మరీ చిన్నపిల్లల్లో కూడా తెల్లబడి ఉంటుంది. ఇటువంటివాళ్లు ఉసరిపొడిని దానికి తగ్గ నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టించి తరువాత తలకు పోసుకొంటే ఈ తెల్లబడే తత్వం నుంచి బయటపడవచ్చు. ఉసిరి రసాన్ని అంతే మోతాదులో కొబ్బరి నూనెను కలిపి బాగా మరగ కాచి ప్రతిరోజు ఆ నూనెను జుట్టుకు రాయడంవల్ల కూడా త్వరగా తెల్లబడదు. పైగా జుట్టు వత్తుగా పెరుగుతుంది.

07/25/2018 - 19:45

బీట్‌రూట్ గడ్డను ఉడికించి గుజ్జు చేయండి. ఆ గుజ్జును ముఖంపైన, మెడ భాగంలోను అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడగండి. ముఖంలో మెరుపులు ఖాయం. ఓట్‌మీల్ 2 స్పూన్స్ తీసుకోండి. అందులో రెండు చుక్కలు బీట్ రూట్ రసం కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగి కడిగేయండి. అలసట మాయం అయ్యి మంచి ఫ్రెష్‌నెస్ వస్తుంది.

07/20/2018 - 18:58

వర్షాలు పడుతున్నపుడు ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల తినే పదార్థాలల్లోకి చెడిపోవచ్చు. అనేక వ్యాధులు రావడానికి ఈ పురుగులు కారకాలు అవుతాయ. అందుకే వీటిని దూరం చేసుకోవడానికి శుభ్రతను పాటించాలి.

07/18/2018 - 19:44

కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచేవేరు. కరివేపాకును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మంచి వాసన మంచి రుచిని ఇచ్చే కరివేపాకు కేవలం అవేకాక మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వైద్యంలోను కరివేపాకు పాత్ర అమోఘం అంటారు ఆయుర్వేద నిపుణులు. అందుకే కరివేపాకు గురించి కాస్త తెలుసుకుందాం.

07/17/2018 - 19:15

చాలామంది పిల్లలు ఆకలి లేదు అని చెబుతుంటారు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఏ చిప్స్ లాంటివైతే తింటారు కాని అన్నం కాని, మరేదైనా చిరుతిండి ని కూడా ఇష్టపడకుండా ఆకలి లేదు అనేస్తుంటారు. ఇలా వీరిని వదిలేయడం వల్ల వారి కడుపులో నులిపురుగులు చేరడం, లేదా జీర్ణశక్తి దెబ్బతినడం లాంటివి జరుగుతుంటాయి.

07/15/2018 - 22:40

నేరేడు పండు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. చర్మ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనమిస్తుంది. నేరేడు గింజలను పొడి చేసి పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఎముకలను బలంగా ఉంచడంలో ఉపకరిస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులను నయం చేయడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నేరేడు చెట్టులో పనికిరానిదంటూ ఏదీ లేదు. వీటి ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.

07/10/2018 - 20:49

* గజ్జి, తామర వంటి సమస్యకు ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకు మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.
* వారానికి ఒకసారైనా పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రాకుండా అరికడుతుంది.
* రక్తహీనత సమస్య ఉన్నవారు ఆహారంలో వీలైనంతవరకు ఎక్కువగా మెంతికూర తీసుకోవాలి.

07/09/2018 - 22:26

వాతావరణం మారుతోంది. క్రమంగా మండే ఎండలు పోయి చల్లబడుతోంది. మేఘావృతమై చల్లని గాలులు, అడపా దడపా వర్షాలు పలుకరిస్తున్నాయి. నిన్నటి దాకా వేసవి సెలవుల్లో గడిపిన విద్యార్థులు మెల్లగా స్కూలు మెట్లు ఎక్కుతున్నారు. వారి చదువుల బాట పట్టడం ఇటు వర్షాకాలం ఆరంభమవడం మొదలై పోయింది.

07/06/2018 - 21:07

అల్లం: అల్లం చిన్న పిల్లలు, పెద్దవారిలో కాని పైత్యం లాంటి వాటికి విరుగుడుగా పనిచేస్తుంది. అల్లాన్ని టీలోకానీ, లేదా అల్లం రసంగాని తీసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో ఏర్పడే నులిపురుగులను దూరం చేయవచ్చు. అల్లం రసాన్ని జలుబు చేసినపుడు తగు మోతాదులో తీసుకుంటే జలుబు మటుమాయం అవుతుంది. చిన్న కణుపు వున్న అల్లం ముక్కను మట్టిలో పాతితే ఒక వారంరోజుల్లోనే మళ్లీ అది పిలకవేస్తుంది.

07/02/2018 - 21:56

వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. అలాకాకుండా ముఖం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఈ వానాకాలంలో పెసరపిండి వాడాలి. పెసరపిండి వాడటం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో అందంగా ఉంటుంది.

Pages