S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

06/29/2016 - 23:02

మునగ ఆకుల్లో వున్న విటమిన్ ఎ క్యారట్‌లో వున్న విటమిన్ ఎ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ అనీ, కమలా పండ్లలో వుండే విటమిన్ సి కన్నా ఏడు రెట్లు ఎక్కువ అనీ, పెరుగులో వుండే మాంసకృతుల్లో కన్నా రెట్టింపు అనీ, పాలలోకన్నా కాల్షియం నాలుగు రెట్లు ఎక్కువ అనీ, అరటిపళ్లలో వుండే పొటాషియం కన్నా మూడు రెట్లు ఎక్కువ అని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, మునగ ఆకుల్లో యశదం (జింక్), మాగ్నీషియం, ఇనుము కూడా వున్నాయి.

06/28/2016 - 20:57

అరటీ స్పూన్ పసుపు, తాజా కొబ్బరు తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
అరికాళ్ళు మృదువుగా వుండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

06/24/2016 - 21:51

మోచేతులు నల్లగా, గరుకగా ఉంటే అసహ్యంగా ఉంటాయి. అలా ఉన్నవారు నిమ్మచెక్కను తరుచుగా మోచేతుల వద్ద రుద్దుకుంటుంటే నలుపుదనం, గరుకుదనం తగ్గి, నునుపుగా కాంతివంతంగా వుంటుంది.
కోల్డ్‌క్రీముగాని, మీగడగాని రాసి మసాజ్ చేస్తూ వుంటే మెత్తబడి అందంగా వుంటుంది. మోచేతులు ఎక్కువగా బల్లమీద ఆనించి కూర్చోవడం, గోడల మీద ఆనించి వంగోవడం చెయ్యకూడదు. దీనివల్ల మోచేతి ప్రదేశం నల్లగా అవుతుంది.

06/23/2016 - 03:21

భారతీయ వంటకాలలో నువ్వుల వాడకం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందింది. అందుకే నువ్వుల నూనె వాడకం పట్ల మహిళలు ఆసక్తి చూపిస్తారు. నువ్వులలో అనేక పోషకాలున్నాయ.

06/11/2016 - 22:33

అమ్మతనం అనేది ఆడవారికి దేవుడిచ్చిన వరంగానే చెప్పాలి. అమ్మనవ్వాలని ప్రతి స్ర్తి తహతహలాడుతోంది. గర్భవతి అయినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ప్రయత్నించినపుడే కాలచక్ర భ్రమణం సజావుగా సాగుతోంది.

06/10/2016 - 21:03

స్ర్తిలలో భక్త్భివం వలన మానసికంగా వారికి మనోధైర్యం లభిస్తుంది. ఉదయానే్న గృహిణి లేచి స్నానం చేసి పూజ గదిలో కాసేపు ధ్యానం చేసి తమ దైనందిన కార్యక్రమాలలోనికి అడుగుపెడితే.. ఎంతో బాగుంటుంది.

06/09/2016 - 22:07

*ముదిరిపోయిన ఆనపగింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి, దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
*బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోసెలు గట్టిగా ఉంటాయి.
*మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగానో, చిప్స్‌గానో పెట్టుకొని ఎండాక వేయించుకుని తింటే రుచిగా ఉంటాయి.

06/09/2016 - 00:49

మనకు లభించే పండ్లు చాలామటుకు తినటానికి రుచికరంగా వుంటాయి. అలాగే ఆరోగ్యానికి మంచి ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటిలో పనస కూడా ఒకటి. జుట్టు రాలిపోవడం, తల దురద వంటి వాటి నివారణకు పనస గింజలు చక్కగా పనిచేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని, ఆ తరువాత ఒకటిన్నర చెంచా పనస గింజల పొడి, ఒక చెంచా పెసరపొడి, నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుని పది నిముషాల తరువాత శీకాయతోగానీ, షాంపూతోగాని కడుక్కోవాలి.

06/05/2016 - 05:14

నిమ్మరసంలో కొంచెం ఆవనూనె, కొంచెం కర్పూరం కలిపి ఒంటికి రాసుకుని, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరఛాయ పెరుగుతుంది.
-అజీర్తితో బాధపడుతుంటే రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.
లెమన్‌గ్రాస్‌కు బదులుగా లెమన్ జెస్ట్ (నిమ్మ చెక్కను పొట్టుగా తురిమితే వస్తుంది)ను వాడుకోవచ్చు.
బొట్టు బిళ్ళలు వాడటం వల్ల ముఖంపై మచ్చపడితే తులసి రసం రాయండి.

06/01/2016 - 22:14

మనం అరుదుగా ధరించే బట్టలు పెట్టెల్లో పెట్టి ఉంచుతాం. పెట్టెలలో చాలా రోజులు వుంచడంవల్ల కొన్ని రకాలైన చీడపురుగులు, క్రిమి కీటకాలు చేరి బట్టలను కొరికి పాడు చేస్తూంటాయి. వీటి బారిన పడకుండా బట్టలు సురక్షితంగా వుంచాలంటే కొద్దిగా కర్పూరం, లవంగాల పొడి మిశ్రమాన్ని పెట్టె మూలల్లో వేసి వుంచినట్లయితే ఎలాంటి పురుగులైనా సరే నాశనమవుతాయి. బట్టలు సురక్షితంగా ఎంతకాలమైనా వుంటాయి.

Pages