S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

10/04/2017 - 19:32

పసిబిడ్డలకు స్నానం చేయంచటం అంటే అంత తేలికైనా పని కాదు. స్నానం చేయంచేటపుడు నీళ్లు మింగేస్తుంటారు. గజ్జి, తామరలాంటివి శరీరంపై కనిపిస్తే ఆ ప్రాంతంలో శుభ్రం చేయటానికి తల్లులు భయపడతారు. ఇలాంటి చర్మవ్యాధులు ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేయించమని అంటున్నారు. ఇలా రోజూ స్నానం చేయించటం వల్లనే వారికి ఆ వ్యాధులు త్వరగా మానిపోతాయని చెబుతున్నారు.

10/04/2017 - 19:29

రుచితోపాటు, అంతకుమించి విలువైన పోషకాలువుండే వేరుశెనగ కాయలతో గుండె జబ్బులు దూరమవుతాయి. అందుకే వేరుశెనగని పేదోడి జీడిపప్పుగా వర్ణిస్తారు. వేరుశెనగ కాయలనుంచి లభించే నూనె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. రోజుకు గుప్పెడు వేరుశెనగలు తింటే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. 25 గ్రాముల గింజల్లో 8 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి.

10/03/2017 - 20:05

సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడినుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి.

పెరుగు: చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రు తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

09/23/2017 - 19:11

బంగాళాదుంపలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. తొక్కే కదా అని తీసిపారేయకండి. దానితో విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. బంగాళాదుంప తింటే బరువు పెరుగుతారనుకుంటారు. కాని ఈ దుంప చెక్కులో మేలుచేసే కొవ్వు, సోడియం లభిస్తాయి. ఇవి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. అలాగే దుంపలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిపై పోరాడతాయి. పీచు సమృద్ధిగా లభిస్తుంది.

09/21/2017 - 17:21

*ప్లాస్టిక్ డబ్బాలలో ఏ పదార్థం నిల్వచేసినా వాసన పట్టేసి ఒక పట్టాన వదలదు. డబ్బాలను వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో నానబెట్టి కడిగితే వాసనపోయి క్లీన్‌గా ఉంటాయి.
* వెండి గినె్నలు, పళ్లాలు మకిలిగా ఉంటే విభూతి పొడితో తోమితే తెల్లగా, కాంతివంతంగా ఉంటాయి.
* చెక్కర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట వుంచి ఆపైన సబ్బునీటితో కడిగి తెల్లటి మెత్తని గుడ్డతో తుడిస్తే కొత్తవాటి వలే ఉంటాయి.

09/16/2017 - 19:25

వండడానికి ముందు గింజధాన్యాలను ఎక్కువ సేపు కడిగితే విటమిన్లు పోతాయి.
ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి.
మొలకెత్తిన లేదా పులియబెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పప్పులు, కూరగాయలు వండటానికి వంటసోడాను వాడకండి.
ఆహారం వండుతున్నపుడు గినె్నపై మూత ఉంచండి.

09/15/2017 - 20:48

వాతావరణం చల్లగా ఉంటే పెదాలు పగులుతుంటాయి. కాబట్టి పెదాలు తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ మనం తాగే గ్రీన్ టీ బ్యాగ్‌ను పారేయకుండా దానిని పెదాలపై అదిమిపెట్టి ఉంచాలి. ఇలా నాలుగు నిమిషాలు పాటు చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే పెదాలు తేమగా ఉంటాయి.

09/14/2017 - 21:18

వర్షాకాలంలో నోటికి కారం కారంగా ఉండే పచ్చళ్లును ఎక్కువగా తింటాం. జాడీల్లో నిల్వచేసుకున్న పచ్చళ్లకు కాస్తంత తేమ తగిలితే చాలు బూజు పడుతుంది. కాబట్టి ఈ కాలంలో పచ్చళ్లను జాగ్రత్త చేసుకోవాలంటే ముందుగా చిన్న ఇంగువ ముక్కను కాల్చి కాసేపు జాడీలో ఉంచాలి తరువాత ఇంగువ ముక్కను తీసివేసి జాడీని శుభ్రంగా తుడిచి పచ్చడి పెట్టుకుంటే బూజుపట్టకుండా ఉంటుంది.

09/13/2017 - 23:24

వైద్యపరంగా దాల్చిన చెక్క గొప్ప ఔషధం. ఈ మసాలా దినుసును పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. దాల్చిన చెక్కలో సిన్నమాల్దిహైడ్ అనే ఆహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్నిరకాల క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. కండరాలలో వాపును తగ్గించే గుణం కూడా ఉంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దీన్ని వాడితే మంచి గుణం కనిపిస్తుంది.

09/12/2017 - 23:07

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వర్షాకాలంలో జుట్టు పాడవకుండా ఉండాలంటే.. తల మాడు చల్లగా, దురదగా ఉంటే వేప నూనె రాసుకోవాలి. నూనెలో నిమ్మకాయ లేదా కరివేపాకులు కలిపి రాసుకుంటే కురులు బాగా పెరుగుతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఇక చుండ్రు అధికంగా ఉంటే తలకు పెరుగు లేదా రిఫైన్డ్ ఆయిల్‌గానీ రాసుకుని తల స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Pages