S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

07/13/2017 - 23:56

హైదరాబాద్‌కు చెందిన సిమితాపాండ్య అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్‌రైటింగ్ అనలిస్ట్ సభ్యత్వం సంపాదించిన తొలి భారతీయురాలు. గ్రాఫాలిస్ట్, సైకాలిజిస్ట్‌గా ఆమె ఎంతోమందిని కుంగుబాటు నుంచి బయటకుతెచ్చి కొత్త జీవితాలను ప్రసాదిస్తుంది. గత దశాబ్దకాలంగా ఆమె బాధితులు చేతిరాతిను చూసి వారి జీవితంలో తలెత్తే చీకటి వెలుగులను అంచనావేయగల దిట్ట.

07/06/2017 - 22:40

మనిషి ప్రవర్తనకు, మాటలకు, ఆలోచనలకు ప్రధానమైంది మనసు. మనస్సును ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ.. మంచి పాజిటివ్ భావాలతో మనస్సును నింపేస్తే చాలు ఇక ఆ రోజంతా హుషారుగా ఉండే అవకాశాలు ఎక్కువ. సంతోషం సగం బలం అంటారు. మనసు సంతోషంగా ఉంటే ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపైన కూడా పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం గనుక వీటన్నిటికీ మూలస్థానమైన మనస్సును అన్నివేళలా గుర్తుంచుకోవాలి.

07/05/2017 - 22:10

పంటి నొప్పితో బాధపడేవారు గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణు లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు మానుకోలేరు. పంచదార కలిపిన టీ తాగ టం వల్ల పంటి నొప్పితో బాధపడేవారికి మరింత నొప్పి కలుగుతుంది. కాబట్టి ఇటువంటివారు ఉదయమే గ్రీన్ టీ తాగితే మంచిదని అంటున్నారు. రోజుకు రెండు మూడుసార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

06/30/2017 - 21:07

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు పాటించే ఆహార ప్రణాళికలతోపాటూ కొన్నిరకాల పండ్లు తింటే రక్తంలోని చక్కెరస్థాయిలు తగ్గటమే కాకుండా, కొవ్వు కరగటం, ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అన్ని రకాల పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. కానీ, తినే పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మేరలో ఉందో చూసుకోవాలి.
ఆరెంజ్

06/27/2017 - 21:44

వేసవి కాలం వెళ్లిపోయింది. చినుకులు పడుతూ వాతావరణం సందడి చేస్తుంది. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటే ఎంతో ప్రయాస. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే హాయిగా చింతలన్నీ దూరమవుతాయి.
లైట్ ఫ్యాబ్రిక్ దుస్తులను మాత్రమే ధరించండి. పసుపు, ఆరెంజ్, ఎరుపు, పింక్,బ్లూ మిక్స్ చేసిన రంగుల దుస్తులను ఎంపికచేసుకోండి.
చిఫాన్, సిల్క్, ఫ్యాబ్రిక్ కాటన్ దుస్తులు తడిచినా వెంటనే ఆరిపోతాయి.

06/24/2017 - 20:44

చినుకుపడే వేళ వాతావరణం చల్లగా.. ఆహ్లాదంగా ఉన్నా ఆడవాళ్లకు ఇబ్బంది పెట్టే సమస్య బట్టలు ఆరకపోవటం. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు వారానికి ఒక్కసారి బట్టలు ఉతుక్కుంటారు. ఇంటిల్లిపాది దుస్తులు ఆరాలంటే ఆ ఇంటి ఇల్లాలికి తలకు మించిన సమస్యగా మారుతుంది. బట్టలు సరిగా ఆరక తేమగా ఉండి వాసన రావటంతో పాటు ఫంగస్ వ్యాపించి కొన్ని రకాల జబ్బులకు దారితీస్తుంది.

06/23/2017 - 21:45

ఎర్రని పెదాలను ఎంతోమంది కవులు వర్ణించారు. అధరాల అందాలు.. అందించే మధువులని పొగడటం ఎప్పట్నుంచో ఉంది. అందుకే ట్రెండీ టీ షర్ట్స్ కానివ్వండీ, దుప్పట్లు కానివ్వండి.. ఇలా ఏ తరహాబట్టలపైన అయినా లిప్స్ ప్రింట్ అయితే అది అద్భుతమే అవుతుంది.

06/07/2017 - 21:04

చివరికి లోపలి లాగులు లాంటి లోదుస్తులు కూడా- ఆడపిల్లల నగా నట్రా సహా నిలువుదోపిడీ చేసేసి పరీక్ష హాలులోకి పంపించినా కాపీలు కొట్టడాన్ని అరికట్టలేకపోతున్నారు మన వాళ్ళు. కానీ ఇతియోపియా అంటే ఆఫ్రికాలో వుంది. ఇదివరకు దీనే్న అబిస్సినియా అనేవాళ్ళు. అక్కడ వాళ్ళు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాపీరాయుళ్ళ ఆటలు కట్టించారు.

06/06/2017 - 23:08

పండ్లను వాడినంతగా పండ్ల చెక్కులను వాడము. చెత్త డబ్బాల్లో వేసేస్తుంటాము. అయితే అన్ని రకాల పండ్ల చెక్కులు కాదు గానీ కొన్నిరకాల చెక్కులు మాత్రం పనికివస్తాయి.
ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా మేలు చేసే ఆహార పదార్థాలే. అలాంటి కొన్ని ఆహార పదార్థాల్లో మనకు తెలియని ఉపయోగం ఉంటుంది. కొన్ని మనం అనుకున్నంత చెడ్డవీ కాకపోవచ్చు. అటువంటివాటిపైన కొంతైనా అవగాహన ఉండాలి.

06/01/2017 - 21:11

ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకుంటారే తప్ప చాలామంది మహిళలు ఉపయోగించే ప్రయత్నం చెయ్యరు. వాస్తవానికి ఆయిల్ మాయిశ్చరైజర్‌కు చాలా ఉపకారి. స్నానానికి ముందు చర్మానికి అప్లయ్ చేయడంవల్ల చర్మం మృదువుగా, సహజంగా మెరిసిపోతుంది. సున్నితమైన చర్మం కలవారికి తిరుగులేని విధంగా ఉపయోగపడేది ఆలివ్ ఆయిలేనంటే అతిశయోక్తి కాదు. మేకప్ తొలగించుకోడానికి కూడా చక్కగా పనికొస్తుంది.

Pages