S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

10/20/2017 - 18:06

కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకున్నట్లే. రోజూ ఓ క్యారెట్ చొప్పున తింటే శరీర ఛాయ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో తేమశాతం పెరుగుతోంది. అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలు రెండు నెలల్లోనే అదుపులోకి వస్తాయి. ఇందులో లభించే బీటాకెరోటిన్ అనే పదార్థం విటమిన్ ఎఏ2గా మారుతోంది. 1ఎ1 విటమిన్ కంటికి ఎంతోఅవసరం. కంటి సమస్యలు దరిచేరవు.

10/17/2017 - 19:40

అలెర్జీ సమస్యలు కనిపిస్తే ఇమ్యునాలిజస్టు లేదా ఎండీని సంప్రదించాలి. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక పరిశీలన, చర్మ పరీక్ష, రక్తపరీక్షల ద్వారా వైద్యులు అలెర్జీ కారకాలను గుర్తిస్తారు. తర్వాత దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రీట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తారు. ఇంజెక్షన్లు, టాబ్‌లెట్లు సూచించవచ్చు.

10/06/2017 - 23:30

ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు యుక్తవయసు రాకుండానే పెళ్లి చేసేసి అత్తారింటికి పంపాలని తల్లిదండ్రులు అనుకోవటంలేదు. వారిని ఓ స్థాయికి తీసుకువచ్చి సమాజంలో గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. కాలేజీలకు వెళ్లిన యువతులు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దశలో ఉండేవారు. ఈ వయసులో రక్తహీనతతో బాధపడుతుంటారు. పది 10మంది యువతులలో ముగ్గురు ఈ రక్తహీనతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ.

10/06/2017 - 23:30

కలబంద (అలోవెర) రసం ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. గ్రీన్ టీలో కలుపుకొని కూడా దీనిని తీసుకోవచ్చు. సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలతో పాటూ కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించడంలో ఇది గొప్పగా పనిచేస్తుంది.
కొవ్వును కరిగించడంలో..

10/05/2017 - 19:35

చౌకగా లభించే ఆకుకూరల్లోని పోకాలను పదిలం చేసుకుంటేనే ప్రయోజనం. మనం తీసుకునే ఆహారంలో పచ్చటి ఆకుకూర తప్పని సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. వాటిని వండుకునేటపడు, నిల్వచేసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోషకాలు పోకుండా తినవచ్చు. ఆకుకూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి. వండటానికి ముందు శుభ్రంగా కడగాలి.

10/04/2017 - 19:32

పసిబిడ్డలకు స్నానం చేయంచటం అంటే అంత తేలికైనా పని కాదు. స్నానం చేయంచేటపుడు నీళ్లు మింగేస్తుంటారు. గజ్జి, తామరలాంటివి శరీరంపై కనిపిస్తే ఆ ప్రాంతంలో శుభ్రం చేయటానికి తల్లులు భయపడతారు. ఇలాంటి చర్మవ్యాధులు ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేయించమని అంటున్నారు. ఇలా రోజూ స్నానం చేయించటం వల్లనే వారికి ఆ వ్యాధులు త్వరగా మానిపోతాయని చెబుతున్నారు.

10/04/2017 - 19:29

రుచితోపాటు, అంతకుమించి విలువైన పోషకాలువుండే వేరుశెనగ కాయలతో గుండె జబ్బులు దూరమవుతాయి. అందుకే వేరుశెనగని పేదోడి జీడిపప్పుగా వర్ణిస్తారు. వేరుశెనగ కాయలనుంచి లభించే నూనె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. రోజుకు గుప్పెడు వేరుశెనగలు తింటే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. 25 గ్రాముల గింజల్లో 8 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి.

10/03/2017 - 20:05

సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడినుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి.

పెరుగు: చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రు తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

09/23/2017 - 19:11

బంగాళాదుంపలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. తొక్కే కదా అని తీసిపారేయకండి. దానితో విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. బంగాళాదుంప తింటే బరువు పెరుగుతారనుకుంటారు. కాని ఈ దుంప చెక్కులో మేలుచేసే కొవ్వు, సోడియం లభిస్తాయి. ఇవి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. అలాగే దుంపలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిపై పోరాడతాయి. పీచు సమృద్ధిగా లభిస్తుంది.

09/21/2017 - 17:21

*ప్లాస్టిక్ డబ్బాలలో ఏ పదార్థం నిల్వచేసినా వాసన పట్టేసి ఒక పట్టాన వదలదు. డబ్బాలను వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో నానబెట్టి కడిగితే వాసనపోయి క్లీన్‌గా ఉంటాయి.
* వెండి గినె్నలు, పళ్లాలు మకిలిగా ఉంటే విభూతి పొడితో తోమితే తెల్లగా, కాంతివంతంగా ఉంటాయి.
* చెక్కర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట వుంచి ఆపైన సబ్బునీటితో కడిగి తెల్లటి మెత్తని గుడ్డతో తుడిస్తే కొత్తవాటి వలే ఉంటాయి.

Pages