S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

09/06/2016 - 21:17

జలుబైనా.. జాండీస్ అయినా... కడుపునొప్పి నుంచి కాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులకు విటమిన్ సి దివ్యౌషధం. శరీరాన్ని రోగకారక క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ దరిచేరకుండా విటమిన్ సి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

08/31/2016 - 21:23

మనిషి విజయం సాధించాలంటే శక్తి, సంకల్పం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి మొదలైన ఎన్నో సుగుణాలు వుండాలి. నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలిగి వుండాలి. మన వర్తమాన నడవడికలో అభివృద్ధి, భవిష్యత్తులో మనం సాధించబోయే విజయాలు మన ఆలోచనలమీదే ఆధారపడి వుంటాయి. మనం ఏమి సాధిస్తున్నాం అన్నదానికన్నా ఎలా తయారవుతున్నాం అన్నది ముఖ్యం. చాలామంది పనిని ప్రారంభించే ముందు పరాజయం పొందుతామేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.

08/30/2016 - 19:33

* మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి. రక్తనాళాల్లో
సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.

08/27/2016 - 22:08

* చుండ్రు నివారణకు తరచూ షాంపుతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలేవరకూ మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది.
* కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కాసిన్ని నీళ్లుపోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, కాసేపయ్యాక మంచినీళ్లతో స్నానం చేయాలి.

08/26/2016 - 21:05

*లెమన్‌డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారం రోజుల పాటు లెమన్‌డైట్ చేయటం వల్ల మీరు ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు.
* నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది.

08/25/2016 - 21:50

* మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.
* ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు.
* కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు శుభ్రపడటమే కాకుండా ఏది తిన్నా నోటికి రుచిగా అనిపిస్తోంది.

08/23/2016 - 21:11

ఫంక్షన్ల్‌కు వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయ తారకంగా వుంటుంది.

08/11/2016 - 04:39

పసుపు మానవుడు ఉపయోగించిన అతి పురాతన ఔషధం. క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల కిందటే, ఆధర్వణ వేదకాలంలోనే పసుపును పరమ పవిత్రంగా పరిగణించేవారు. ఐదువేల ఏళ్ళ చరిత్రగల అధ్వరణ వేదం పసుపు వైద్య గుణాలను గురించి విపులంగా వివరిస్తోంది.

08/09/2016 - 21:09

చర్మం సహజంగా కాంతివంతంగా మెరవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అలాంటి మెరుపు మీ సొంతం అవుతుంది. అవేమిటో చూద్దాం.
రెండు చెంచాల పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూతతో చర్మం శుభ్రపడుతోంది. అందంగానూ మారుతుంది.

08/05/2016 - 21:37

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.

Pages