S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/25/2016 - 21:50

* మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.
* ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు.
* కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు శుభ్రపడటమే కాకుండా ఏది తిన్నా నోటికి రుచిగా అనిపిస్తోంది.

08/23/2016 - 21:11

ఫంక్షన్ల్‌కు వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయ తారకంగా వుంటుంది.

08/11/2016 - 04:39

పసుపు మానవుడు ఉపయోగించిన అతి పురాతన ఔషధం. క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల కిందటే, ఆధర్వణ వేదకాలంలోనే పసుపును పరమ పవిత్రంగా పరిగణించేవారు. ఐదువేల ఏళ్ళ చరిత్రగల అధ్వరణ వేదం పసుపు వైద్య గుణాలను గురించి విపులంగా వివరిస్తోంది.

08/09/2016 - 21:09

చర్మం సహజంగా కాంతివంతంగా మెరవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అలాంటి మెరుపు మీ సొంతం అవుతుంది. అవేమిటో చూద్దాం.
రెండు చెంచాల పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూతతో చర్మం శుభ్రపడుతోంది. అందంగానూ మారుతుంది.

08/05/2016 - 21:37

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.

08/03/2016 - 23:11

మొటిమలతో ఇబ్బందిపడేవారు వేప, పుదీనా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే చాలు మొటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది.
-జిడ్డు చర్మం వారు ముఖానికి క్రీములు ఎక్కువగా వాడకూడదు.
-పుల్లటి పెరుగులో కొంచెం పసుపు, చెంచా కొబ్బరినూనె కలిపి ముఖానికి రాసుకుని మసాజ్ చేసి కాసేపయ్యాక కడగాలి. తరుచూ ఇలాచేస్తే మొటిమలు పోతాయి.

08/02/2016 - 20:43

కూరల్లో, తినుబండారాలన్నింటిలో ఉప్పు వేయక తప్పదు. కారణం రుచి వుండదు. పప్పులో ఉప్పు లేకపోతే నోట్లో పెట్టుకోలేం అనడం సహజం. ఎక్కువ వేసుకుంటే బి.పి తప్పదు. ప్రత్యేకించి అధిక రక్తపోటు, హృద్రోగాలు, కాళ్ళవాపు, మూత్రపిండాల వ్యాధుల వారుతీసుకుంటే ముప్పే.
ఉపయోగాల గురించి ఆలోచిద్దాం

07/27/2016 - 21:34

అదో చిత్రమయిన ఆకాశ హోటలు. స్విట్జర్లాండులో ఆల్ఫ్స్ పర్వత శ్రేణి మధ్యనున్న గ్రావుబుండేన్ (దీనికి రకరకాల ఉచ్ఛారణలున్నాయి, ఆ దేశాల్ని బట్టి) కొండ ఎత్తు 6463 అడుగులు (ఎంత నిఖారుగా కొలిచారో!). దానిమీద నెల్‌స్టర్న్ హోటలు గ్రూపువారు ‘జీరో స్టార్ హోటల్’ పేరిట ఒక ఆరుబయటి హోటల్ని నిర్మించారు.

07/26/2016 - 21:27

దోమల నివారణ ప్రపంచవ్యాప్త సవాలు. దోమలవల్ల మలేరియా, చికన్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పెద్ద కంపెనీలు తయారుచేస్తున్న కాయిల్స్, ఇతర పరికరాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. పెప్పర్‌మింట్ ఆయిల్ ద్వారా దోమలను సమూలంగా నిర్మూలించవచ్చని ఢిల్లీకి చెందిన శాస్తవ్రేత్త పద్మావాసుదేవన్ కనుగొన్నారు.

07/21/2016 - 23:35

తలారా స్నానం చేసిన తర్వాత తలను తడిగా ఉంచుకోవద్దు. దీనివల్ల చుండ్రు ఏర్పడుతోంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్‌తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి.
- తలకు రోజూ నూనె రాసుకోవటం (వారానికి రెండుసార్లయినా) అన్నది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది. జుట్టు జిడ్డుగా ఉన్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.

Pages