S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/25/2016 - 21:55

బార్లీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలు తగ్గించడం ద్వారా డయాబెటిస్ రిస్కు లేకుండా చేస్తుందిట. ది లండ్ యూనివర్సిటీవారు ఈ అధ్యయనాన్ని చేశారు.

02/25/2016 - 03:36

భలే ఆలూ..పోషకాలు మేలు..!

02/24/2016 - 08:11

మరుగుతున్న నీటిలో టీపొడి, పంచదారతో పాటు అల్లం ముద్ద , నాలుగైదు తులసి ఆకులు కలిపి తాగితే గొంతులో గర గర తగ్గుతుంది.
* గ్లాసుడు నీటిలో కాస్త యాలకుల పొడి కలిపి తాగితే మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
* మిరియాలను, మిర్చిని ఆహారంలో తగు మోతాదులో వాడితే శరీర అధిక బరువును తగ్గించుకోవచ్చు.

02/20/2016 - 22:13

కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకున్నట్లే. రోజూ ఓ క్యారెట్ చొప్పున తింటే శరీర ఛాయ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో తేమశాతం పెరుగుతోంది. అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలు రెండు నెలల్లోనే అదుపులోకి వస్తాయి. ఇందులో లభించే బీటాకెరోటిన్ అనే పదార్థం విటమిన్ ‘ఏ’గా మారుతోంది. ’ఎ’ విటమిన్ కంటికి ఎంతోఅవసరం. కంటి సమస్యలు దరిచేరవు.

02/18/2016 - 21:30

మానవ శరీరానికి జింక్ ఎంతో అవసరం. పుట్టే బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచే గర్భిణీ తగు మోతాదులో జింక్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ప్రతివారికీ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ కావలసి ఉంటుంది. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల ద్వారా లభించే జింక్ శరీరానికి సరిపోతుంది.

02/17/2016 - 21:02

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలి. పోషకాల్లో ఇవి ఎక్కువగా ఉండేలా తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి. విటమిన్ మాత్రలను వేసుకోవడానికి అలవాటు పడడం కన్నా, అవి పుష్కలంగా లభించే ఆహారాన్ని విధిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావాలి. ఇందుకు విటమిన్లతో కూడిన సమతుల ఆహారం అనునిత్యం తీసుకోవాలి.

02/17/2016 - 05:37

‘చీరకట్టులో నేను నా అసలు వయసుకన్నా పెద్దదానిలా కన్పిస్తానంటారు చాలామంది. కానీ నాకు చీరలంటే చాలా ఇష్టం. మన సంప్రదాయే అని కాదుగానీ...అవి కట్టుకోవడం నాకు సరదా’ అంటోంది జాతీయనటి అవార్డు గ్రహీత విద్యాబాలన్. చీరకట్టుకోవడం మాననే మానని తెగేసి చెబుతోంది. ‘మనం ఏం కట్టుకున్నామో, ఏం కట్టుకోవాలో ఎవరో చెప్పడం, మన వేషభాషలపై వేరెవరో వ్యాఖ్యానాలు చేయడం మన సమాజంలో లోపం.

02/13/2016 - 21:20

ఘాట్‌రోడ్డుపై ప్రయాణించడం ఎంత కష్టమో, గాట్లున్న మొహాన్ని చూడటం కూడా అంతే కష్టం. ఆ గాట్లున్న మొహం మనదైతే అది- భరించడం మహా కష్టం..
అది ప్రత్యక్ష నరకం. ఇరవై ఏళ్ళ తరువాత కలుసుకున్న
ఓ స్నేహితుడు తన మిత్రుడి మొహం చూడగానే-

02/11/2016 - 22:22

శాకాహారం తీసుకునేవారు ఆకుకూరలు, కూరగాయలపైనే పూర్తిగా ఆధార పడకుండా శరీరానికి పోషకాలు అందించే గింజలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లను విరివిగా వాడుతుండాలి. బాదం, వేరుశనగ, బటానీలు వంటివి తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అందుతాయి. గుడ్లు, పాల ఉత్పత్తులను తరచూ తీసుకుంటే కాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా శరీరానికి లభిస్తాయి.

02/11/2016 - 07:31

దగ్గు, ఇన్‌ఫెక్షన్ల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకే కాదు.. శరీరంలో అదనపు బరువును తగ్గించుకునేందుకు తేనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. తేనెలో తీపిదనం (సుగర్) ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల్లో దాన్ని వినియోగించుకుంటే బరువు సమస్యను అధిగమించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. కాచి చల్లార్చిన నీటిలో లేదా నిమ్మరసంలో తేనె వేసుకుని తాగితే సుగర్ ప్రభావం ఉండదు.

Pages