S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

04/27/2016 - 23:53

‘‘కోపం ఎల్లప్పుడూ క్షేమం కాదు’’ అన్నది విజ్ఞుల బోధ. ‘‘కోపమే శత్రువు, శాంతమే రక్ష’’ అన్నది శతకకారుల మాట. అయితే క్షమాగుణం కూడా ఎల్లప్పుడూ మంచిది కాదు. ఒక్కో సందర్భంలో దారి తప్పిన మనిషిని సద్వర్తనున్ని చేయడానికి అనునయ వాక్యాలు ఉపయోగపడతాయి. ఒక్కొక్కప్పుడు దండనం కూడా ఫలితాలనిస్తుంది. ‘‘దండనం దశగుణం భవే’’ కదా!

04/26/2016 - 21:50

గృహ సంబంధ చిట్కాలకు వెనిగర్‌ని వాడతారు. దీనిని వంటల్లో వాడడంతో ఆయా ఆహార పదార్థాలకు చక్కని రుచి, సువాసనలు చేకూరుతాయి. వెనిగర్‌లో పలు రోగ నిరోధక, నిర్మూలన శక్తులున్నాయి.
-స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలిపితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మం మెరుపులీనడమే కాక చెమట దుర్వాసనను దరిచేరనివ్వదు.

04/22/2016 - 22:17

పాలు తాగడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడరు. అలాంటివారికి పాలలో కొద్దిగా జామ్ కలిపి మిక్సీలో వేసి ఇస్తే పండ్లతో తయారుచేసిన మిల్క్ షేక్‌లాగా వుండి తాగటానికి ఇష్టపడతారు.

నల్లబట్టలు సబ్బుతో కాకుండా సీకాయ పొడితో వుతికితే రంగు తగ్గిపోకుండా వుంటాయి.

04/20/2016 - 22:37

లవంగం రుచికి కారంగానూ, ఘాటుగాను ఉంటుంది. లవంగ నూనెను సబ్బులు, టూత్‌పేస్టులు, పరిమళ ద్రవ్య తయారీలో వాడుతున్నారు. కొన్ని పరిశ్రమలలోనూ ఇవి ఉపయోగపడుతున్నాయి. లవంగాలలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. కనుక ఇది అనారోగ్యాల నివారణకు, నిరోధానికి, ఉపశమనానికీ ఎంతగానో ఉపయోగిస్తాయి. కొన్ని మందుల తయారీలో కూడా లవంగాలు వాడుతున్నారు.
- శరీరం మీద లేపనంలా రాస్తే క్రిములను నాశనం చేస్తుంది.

04/19/2016 - 22:16

మన రోజువారీ ఆహారంలో కొలెస్ట్రాల్ వినియోగం ఎటువంటి పరిస్థితులలోను 300 మిల్లీ గ్రాములకు మించకూడదు. మాంసాహారం,డైరీ ఉత్పత్తులలో ఘనీకృత కొవ్వు పదార్థాలు ఎక్కువగా వుండటంవల్ల అవి మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. వరి, గోధుమ మొదలైన వాటిల్లోని అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెంది హాని కలిగిస్తాయి.

04/13/2016 - 22:08

శాకాహారంలో ప్రొటీన్స్‌ను సమృద్ధిగా అతిచౌకగా మనకు అందించే ప్రకృతి వరప్రసాదం, ఆరోగ్యప్రదాయిని సోయాబీన్. అతి తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగివున్న సోయాబీన్ మానవాళికి నిజంగా ఒక వరం. ఉల్లాసంగా సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్థిల్లేందుకు ఉపకరించే ‘శాకాహారరాజం’ సోయాబీన్ అనడంలో అతిశయోక్తి లేదు. మరే ఇతర ఫలజాతుల్లోగానీ, మాంసాహారంలో కానీ లేని విధంగా సోయాబీన్‌లో నలభై శాతం ప్రొటీన్స్ వున్నాయి.

04/13/2016 - 04:58

ప్రేమించిన వ్యక్తిని చూసి భయపడితే ఇక జీవితానికి రక్షణలేనట్లే అని గ్రహించాలి.
ఎవ్వరితో మాట్లాడినా.. ఏ పనిచేసినా, బెదిరింపులకు పాల్పడినా జీవితానికి రక్షణలేనట్లుగానే భావించాలి.
ప్రశాంతంగా బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితులు ఉత్పన్నమైనపుడు, సహజంగా, సాఫీగా అనుబంధాలు సాగనపుడు ఆ బంధాలను వదులుకోవటమే శ్రయస్కరం.

04/07/2016 - 07:07

ఎన్నికలు వచ్చాయంటే విభిన్న రకాల నినాదాలు, డిమాండ్లు పార్టీల ముందుకు వస్తుంటాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో వైద్య నిపుణులు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు కారణమవుతున్న పొగాకు ఉత్పత్తులపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో చేర్చాల్సిందిగా వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

04/05/2016 - 22:08

మిజోరాంలో షాల్స్, స్వెట్టర్లు అంటే లాల్‌ఫకౌజాలీ పేరునే అందరూ చెప్పుకునే స్థాయికి ఆమె చేరుకుంది. ఒకప్పుడు భర్త నిరాదరణకు గురై బతుకు చాలించాలని అనుకున్న లాల్‌ఫకౌజాలీ నేడు తాను, తన కుటుంబం బతుకుతూ మరికొందరికి బతుకునిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

04/02/2016 - 00:06

భారతీయ సాంప్రదాయం, సంస్కృతిలో తమలపాకులకు ఎంతో విలువ, విశిష్ట స్థానం ఉన్నాయి. ప్రతి శుభకార్యానికి తమలపాకులు ఉండవలసిందే. ఆయుర్వేద వైద్యంలో కూడా తమలపాకులు వాడతారు. వీటిలో విటమిన్ ఎ, బి కాల్షియం, కెరోటిన్, ఆరోమాటిక్ తైలాలు ఉంటాయి.
* బ్రాంకైటిస్, ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధులకు నివారణ కలిగిస్తుంది. రక్తవృద్ధిని కలిగిస్తాయి.

Pages