S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/30/2016 - 23:20

పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

03/29/2016 - 21:30

మానవ జీవితంలో టీ తాగటం ఓ అంతర్భాగమైపోయింది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగటానికి ఉత్సాహం చూపిస్తాం. కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వటానికో టీ తాగడం మామూలే. చాలామంది రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు టీ తాగకపోయినా రోజుకు రెండు మూడుసార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదనే వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

03/27/2016 - 07:50

మానసిక కుంగుబాటు వల్ల జీవితం నరకప్రాయం అవుతుందని, తగిన అవగాహన కలిగిస్తే ఈ సమస్యను అధిగమించడం అసాధ్యమేమీ కాదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అంటోంది. కుంగుబాటు సమస్యపై దేశవ్యాప్తంగా చైతన్యం కలిగించేందుకు ఆమె తాజాగా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ‘మీరు ఒంటరివాళ్లు కాదు’.. అనే నినాదంతో తాను చేపట్టిన ప్రచారోద్యమం మంచి ఫలితాలను ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది.

03/24/2016 - 22:20

ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి చెందడంతో ‘బుల్లితెర’ పలు మార్పులను చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు సిఆర్‌టి సాంకేతికతతో పనిచేసిన టెలివిజన్ ఇప్పుడు ఎల్‌సిడి, ఎల్‌ఇడి, ప్లాస్మా ఇలా కొంగ్రొత్త అవతారాలెత్తింది. వీటి శుభ్రతలో తగిన శ్రద్ధ, సరైన మెలకువలు అవసరం.

03/23/2016 - 23:24

* వంట పాత్రలు చక్కగా ఉండాలంటే సగానికి తరిగిన నిమ్మకాయ ముక్కని సాధారణ ఉప్పులో ముంచి బాగా రుద్దాలి. ఆ తరువాత ఒక పొడి గుడ్డతో గినె్నలో తడి లేకుండా తుడుచుకోవాలి.

03/19/2016 - 21:50

మన ఆహ్లాదం, ఆరోగ్యం వంటింటి శుభ్రతతోనే సాధ్యం. ఇంట్లో వస్తువులు వివిధ రకాల పాత్రలు ఎప్పటికప్పుడు కడిగి మురికి చేరకుండా తళతళలాడేలా ఉంచుకోవాలి. దీనికి మార్కెట్లో లభ్యమయ్యే సబ్బులు, పౌడర్లతోపాటు కొన్ని చిట్కాలు కూడా అవసరం.
* టీకప్పులు, చిన్న జాడీలు, సున్నితమైన గాజు, పింగాణీ వస్తువులను శుభ్రపరిచేప్పుడు సింకు అడుగున ఒక పాత బట్టని అమర్చుకోవడం మరవద్దు.

03/18/2016 - 01:14

కెరోటిన్ శరీరారోగ్యానికి కావలసిన పదార్థాల్లో ఒకటి. కెరోటినాయిడ్స్ చాలా రకాలైన కూరగాయల్లోనూ, పండ్లలోనూ, ఆకుకూరల్లోనూ లభిస్తాయి. పసుపు, ఎరుపు, నారింజ, ముదురు ఆకు పచ్చగా ఉండే కూరగాయల్లోనూ, పళ్ళలోనూ ఇవి ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు లాంటి ఆకుకూరల్లో కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది.

03/15/2016 - 22:15

అందానికి, ఆరోగ్యానికి అలోవెరా (కలబంద) ఫలితం గణనీయం. అలోవెరాకున్న ప్రాధాన్యతననుసరించే నేడు మార్కెట్‌లో సబ్బులు, జెల్, లోషన్స్.. ఎన్నో రూపాల్లో అలోవెరా ఉత్పత్తులు లభిస్తున్నాయి. శరీరాన్ని ఉత్తేజపరిచి చక్కటి అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే బయోలాజికల్ ఏజెంట్స్ దీనిలో పుష్కలంగా వున్నాయి. చర్మంలో తేమ నిలిచి వుండేలా చేయటంలో అవోలెరా సమర్థవంతంగా పనిచేస్తుంది.

03/13/2016 - 03:25

ఆడవాళ్ల చేతివేళ్లు ఏకంగా ఓ కూరగాయ పేరుకే సొంతమైంది. పొడవైన గోళ్లను పెంచటం కూడా ఓ కళే. ఆరోగ్యవంతమైన, పొడవైన గోళ్లను పెంచుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. అందవిహీనంగా గోళ్లు కనబడుతున్నాయని బాధపడుకుండా కొన్ని పద్ధతులు పాటిస్తే అందమైన, పొడవైన గోళ్లు మీ సొంతమవుతాయి.

03/11/2016 - 00:50

వేసవి ఎండలు అప్పుడే చురుక్కుమనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మున్ముందు భాను డు మరింత ప్రతాపం చూపించబోతున్నాడు. వేస వి తాపం నుంచి ఉపశమనం పొందడానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు ఉపకరిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరిబోండాలలోని నీళ్లలో ఉండే ఖనిజ లవణాలు అప్పటికప్పుడు శక్తిని అందజేస్తాయి.

Pages