S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/26/2015 - 21:44

‘బ్రెడ్’ను కేవలం అల్పాహారంగా తినడానికే కాదు, వంటింటి చిట్కాలకు కూడా వాడవచ్చు. మిక్సీ లేదా గ్రైండర్‌లో మసాలా వాసన పోవాలంటే కాసిన్ని బ్రెడ్ ముక్కలు వేసి కొద్దిసేపు తిప్పాలి. ఆ తర్వాత నీటితో శుభ్రపరిస్తే మిక్సీలు, గ్రైండర్లలో ఎలాంటి వాసనా ఉండదు. గోడలకు తగిలించిన పెయింట్లు, వాల్ పేపర్లపై దుమ్ము,్ధళి పేరుకుపోయినా, నీరు లేదా నూనె పడినా బ్రెడ్ ముక్కలతో తుడిస్తే మరకలు అదృశ్యమవుతాయి.

12/25/2015 - 23:12

చలికాలంలో చల్లటిగాలులే కా దు, తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల తాకిడితో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల బారిన పడకతప్పదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లే కాదు, కొన్ని ఆరోగ్య పద్ధతులను పాటిస్తే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద ఖర్చేమీ లేకుండా ఇంట్లోనే కొన్ని సహజ పద్ధతులను మనం సులభంగా పాటించవచ్చు.

12/22/2015 - 22:48

శీతాకాలంలో వాతావరణ ప్రభావం చర్మంపై ఎంతోకొంత ఉంటుంది. చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దురదలు, పగుళ్లు, ఇతర చర్మసంబంధ సమస్యలు అనివార్యమవుతాయి. గోకడం వల్ల చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడుతాయి. చలికాలంలో కొన్ని పద్ధతులను పాటిస్తే చర్మ సంరక్షణ సాధ్యపడుతుంది. చలిగాలుల బారి నుంచి కాపాడుకోవాలంటే చర్మానికి మసాజ్ అవసరం. చలి ప్రభావం చర్మంపైనే కాదు, ఎముకలు, కండరాల మీద కూడా ఉంటుంది.

12/22/2015 - 05:06

చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో పెరుగు ఎంతగానో ఉపకరిస్తుంది. ఎండవేడి కారణంగా వాడిపోయిన చర్మానికి సహజకాంతిని ఇది కలిగిస్తుంది. కొన్ని ఇళ్లలో ఇప్పటికీ పిల్లలకి వొంటినిండా పెరుగు రాసి మర్దనా చేసి స్నానం చేయిస్తారు. చిక్కటి పెరుగులో కాస్త ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. పెరుగులో శెనగపిండి, నిమ్మరసం కలిపి రాసుకున్నా ముఖచర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

12/19/2015 - 23:17

రాత్రి వేళ అప్పుడే పితికిన చల్లటి ఆవుపాలను తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. వేళకు తగినంతగా నిద్ర పోవాలంటే ఎలాంటి మాత్రలు వేసుకోకుండా ఆవుపాలను తాగితే మంచి ఫలితం కనిపిస్తుందని దక్షిణ కొరియాలోని యుమింగ్ న్యూరోసైన్స్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు భరోసా ఇస్తున్నారు.

12/18/2015 - 22:34

దంత సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే నోటి నుంచి వెలువడే దుర్వాసన మనకే కాదు, ఇతరులకు సైతం ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని పద్ధతులను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో విధిగా దంతధావనం చేయాలి. ఇలా చేస్తే పళ్లమధ్య ఇరుక్కున్న పాచి పదార్థాలు బయటకు పోతాయి. రాత్రి సమయంలో నిద్రపోవడానికి ముందు ‘బ్రష్’ చేయడం అన్ని విధాలా మంచిది.

12/17/2015 - 02:29

నిత్యం మేకప్ వేసుకుంటూ అందాలొలికే మహిళల్లో ఆత్మవిశ్వాసం, శృంగార భావనలు ఎక్కువగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సౌందర్య పోషణకు ఆసక్తి చూపే మగువలు తరచూ అద్దం ముందు కాలక్షేపం చేస్తూ మేకప్ పట్ల దృష్టిసారిస్తుంటారు. వీరు ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా ఎపుడూ చిరునవ్వు చిందిస్తుంటారని న్యూ యార్క్‌లోని ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో విశే్లషించారు.

12/15/2015 - 22:40

రక్తంలో కొవ్వు శాతం తగ్గించుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని, ఇందుకు ఆహార పద్ధతుల్లో మార్పులు అనివార్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టగలిగితే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని వారు భరోసా ఇస్తున్నారు. రక్తంలో కొవ్వు తగ్గేందుకు కొన్ని పద్ధతులు ఆచరిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆలివ్ నూనెను వంటల్లో వాడడం ఉత్తమం.

12/15/2015 - 01:44

విలువైన పోషకాలున్న బాదం, జీడిపప్పు, వేరుశెనగ, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజలను తరచూ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లకు లోనుకాకుండా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించాలంటే గింజలను విరివిగా తీసుకోవాలి. ఉదయం పూట అల్పాహారంగా మొలకెత్తిన పెసలు, బఠానీలు, వేరుశెనగ వంటివి తినాలి.

12/11/2015 - 22:11

మన ఆరోగ్య పరిరక్షణలో తేనె ఎంతగానో మేలు చేస్తుంది. సహజసిద్ధంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించి, జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. పంచామృతాల్లో తేనె ఒకటి. తేనెటీగలు సేకరించే పూలలోని మకరందాన్ని బట్టి ఇది వివిధ రకాలుగా వుంటుంది. తేనెలో పిండి పదార్థాలు, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి-1, 2, సి వంటి పోషక విలువలు ఉంటాయి.

Pages