S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/20/2018 - 01:00

మాస్కో, మార్చి 19: రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన మరో ఆరేళ్లపాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పటివరకు రెండు దశాబ్దాలకుపైగా రష్యాను పాలించిన పుతిన్‌కు ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా ఓట్లు లభించినట్లు ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. అధ్యక్షపదవికి పుతిన్‌తో మొత్తం ఏడుగురు పోటీపడ్డారు.

03/18/2018 - 03:20

కౌలాలంపూర్, మార్చి 17: అతడో సెలబ్రిటీ. ఎలాంటి విషసర్పాన్నయినా అవలీలగా పట్టుకుంటాడు. పాము పడగమీద ముద్దాడుతూ, దాని తనలను నోట్లో పెట్టుకుని ఆడించడం అలవాటు. ఎక్కడ విష సర్పం కనిపించినా క్షణాల్లో అక్కడకు వెళ్లి పట్టుకుని మరీ పాముకోరలు తీసేసేవాడు. అలాంటి వ్యక్తి ఆ పాముకాటుకే బలైపోయిన విషాదం ఘటన మలేసియాలో చోటుచేసుకుంది. అబు జరీన్ హుసీన్ (33) విషసర్పాలతో చేసిన విన్యాసాలు టీవీల్లో, య్యూటూబ్‌ల్లో అనేకం.

03/18/2018 - 02:56

ఏథెన్స్, మార్చి 17: గ్రీక్ ఐలాండ్‌లోని ఈస్ట్రన్ ఎయిజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. వలసవాదులను అక్రమంగా తీసుకెళ్తున్న బోట్ ప్రమాదానికి గురైనట్టు గ్రీస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించి 14 మృతదేహాలను వెలికితీసినట్టు వారు తెలిపారు. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

03/18/2018 - 04:22

ఐక్యరాజ్య సమితి: భారత్‌కు ఆయుధాలు అమ్ముతున్న దేశాల జాబితాలో అమెరికా ద్వితీయ స్థానానికి చేరుకుంది. భారత్ తన రక్షణావసరాల కోసం అనేక దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నా, గత ఐదేళ్లలో అమెరికా నుంచి భారత్‌కు సరఫరా అయిన ఆయుధాలు పరిమితి 15శాతానికి చేరుకుందని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి అధ్యయన కేంద్రం (సిప్రి) అధికారిక నివేదిక వెల్లడించింది.

03/17/2018 - 02:10

వాషింగ్టన్: హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని పరిమితి వీసా విధానాన్ని రద్దు చేయవద్దని సిలికాన్ వ్యాలీలోని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఆరుగురు శాసనకర్తలు ట్రంప్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రూపొందించిన ఈ నిబంధనను కొనసాగించాలని కోరినట్టు సిలికాన్ వ్యాలీ నుంచి వెలువడుతున్న మెర్క్యురీ న్యూస్ పేర్కోంది.

03/16/2018 - 02:59

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసగృహం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించారు. వీరిలో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. షరీఫ్ కుటుంబం నివాసముంటున్న ఇంటికి కొద్ది కిలోమీటర్ల దూరంలో తబ్లీఘీ జమాత్ సెంటర్ సమీపంలో ఉన్న ఒక పోలీస్ చెక్‌పోస్ట్‌పై అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్‌కు చెందిన ఒక టీనేజర్ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసుల తెలిపారు.

03/15/2018 - 02:16

బీజింగ్, మార్చి 14: చైనాలో జరుపుతున్న తవ్వకాల్లో 8వేల ఏళ్లనాటి కొత్త రాతి యుగానికి చెందిన గ్రామం బయటపడింది. ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావెన్స్‌కు చెందిన ఫక్సిన్ నగరంలో ఈ గ్రామం వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపి 2500 పురాతన వస్తువులను వెలికి తీశారు. బయటపడిన 12 ఇళ్లు పాక్షిక భూగృహాల మాదిరిగా ఉన్నాయి. ప్రతిదాంట్లో వంటకు ప్రత్యేక సదుపాయాలుండటం విశేషం.

03/15/2018 - 02:13

కాలిఫోర్నియా, మార్చి 14: ఒక ఉపాధ్యాయుడి చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్టు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. సీసైడ్ హైస్కూల్‌లో మంగళవారం, డెన్నిస్ అలగ్జాండర్ అనే ఉపాధ్యాయుడు, పిల్లలకు తుపాకీ భద్రతపై పాఠాన్ని బోధిస్తున్న సమయంలో, ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉపాధ్యాయుడు, రిజర్వ్ పోలీసు అధికారిగా కూడా పనిచేస్తున్నారు.

03/15/2018 - 02:09

లాగోస్, మార్చి 14: నైజీరియాలో భూమి, నీరు, పశువుల మేతకోసం సాగుతున్న ఘర్షణలు తాజాగా 25 మందిని బలితీసుకున్నాయి. ప్లేటు స్టేట్‌కు చెందిన బస్సా ప్రాంతంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సరిగ్గా ఐదురోజులకు ముందు జరిగిన హింసలో ఐదుగురు మరణించారు. ఫులాని తెగకు చెందిన పశువుల కాపర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అనేక ఇళ్లను కూడా తగులబెట్టారు.

03/15/2018 - 01:43

నేపాల్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన బింధ్యా భండారి చేత బుధవారం ప్రమాణ స్వీకారం చేయస్తున్న సుప్రీం కోర్టు జడ్జి గోపాల్ పరాజిలి. చిత్రంలో ఉపాధ్యక్షుడు నందకిశోర్ పున్ ప్రధాన మంత్రి కేపీ ఓలీ, పార్లమెంట్ స్పీకర్ క్రిష్ణ బహదూర్ మహారా.

Pages