S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/02/2018 - 01:28

హూస్టన్, డిసెంబర్ 1: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ శుక్రవారం ఇక్కడ మృతి చెందారు. నాటకీయ పరిణామాల మధ్య సోవియట్ యూనియన్ విచ్ఛినమయిన సమయంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ కొనసాగారు. ఇరాక్ కువైట్‌పై దురాక్రమణకు పాల్పడిన సమయంలోనూ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నేతృత్వంలోనే అమెరికా ఇరాక్‌ను మట్టి కరిపించి, కువైట్‌కు విముక్తి కల్పించింది.

12/02/2018 - 00:01

* చైనా, రష్యా అధినేతలతో ప్రధాని మోదీ మంతనాలు
* అన్ని రంగాలపై సహకరించుకోవాలని మూడు దేశాల తీర్మానం
* చర్చలు ఫలప్రదమైనట్లు ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం

12/02/2018 - 02:17

బ్యూనస్ ఎయిర్స్, డిసెంబర్ 1: వూహాన్ శిఖరాగ్ర సమావేశం తరువాత భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలలో సుస్పష్టమయిన మెరుగుదల ఉందనే ఏకాభిప్రాయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వ్యక్తం చేశారు. భారత్-చైనా సంబంధాలు 2019వ సంవత్సరంలో మరింత మెరుగుపడతాయనే ఆశాభావాన్ని కూడా ఈ ఇద్దరు నేతలు వ్యక్తం చేశారు.

12/01/2018 - 02:43

బ్యూనస్ ఎయిర్స్, నవంబర్ 30: మంచి ఆరోగ్యం, ప్రశాంతత కోసం ప్రపంచానికి భారత్ ఇచ్చిన కానుక యోగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండటానికి అనాదిగా భారత్‌లో ఆచరిస్తున్న యోగతో ఒనగూరే ప్రయోజనాలను ఆయన వివరించారు.

11/29/2018 - 23:42

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 29: ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య శాంతి సామరస్యం వెల్లివిరిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని, త్వరలోనే ఈ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. గురువారం ఇక్కడ అంతర్జాతీయ పాలస్తీనా సంఘీభావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పై సందేశం పంపారు.

11/27/2018 - 23:46

వాషింగ్టన్, నవంబర్ 27: ఉగ్రవాదులపై ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాటం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పిలుపునిచ్చారు. 2008లో ముంబయిలోని హోటల్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటానన్నారు. ఈ పోరాటంలో ఉగ్రవాదులు గెలవరాదన్నారు. ఈ ఘటనలో 166 మంది మరణించిన విషయం విదితమే.

11/27/2018 - 04:05

లాహోర్: బొంబాయి ఉగ్రదాడి జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్నా, దాడికి ప్రదాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కర్ -ఇ తోయిబా కమాండర్ జాకి-ఉర్ రెహమాన్ లఖ్వీ, ఆరుగురు సహచరులు నిర్దోషులుగా కేసు నుంచి ఏ క్షణంలోనైనా బయటపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఉగ్రదాడికి కుట్రపన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై 2009 నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.

11/27/2018 - 04:04

వాషింగ్టన్, నవంబర్ 26: ముంబయి దాడికి కారకులైన వ్యక్తులకు సంబంధించి గాని, దేశంకు సంబంధించి గాని వివరాలను తెలియజేసిన వారికి అమెరికా గొప్ప బహుమతిని తాజాగా ప్రకటించింది. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన నిందితుల సమాచారాన్ని అందజేసిన వారికి ఐదు మిలియన్ల యూఎస్ డాలర్లు (35 కోట్ల రూపాయలు) బహుమతిగా అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార యంత్రాంగం పేర్కొంది.

11/26/2018 - 02:05

వాషింగ్టన్: పాకిస్తాన్ ప్రోత్సాహంతో ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రదాడి తరహాలో మరోసారి కనుక భారత్‌పై పాకిస్తాన్ కనుక జరిపితే ఈసారి ఆ దేశంతో భారత్ కచ్చితంగా యుద్ధానికి దారితీస్తుందని పలువురు మాజీ దౌత్యవేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముంబయిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి జరిపి సోమవారంతో పదో సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ దారుణ సంఘటనలో అమెరికన్లు, పదిదేశాల పౌరులు సహా 166 మంది అసువులు బాసారు.

11/26/2018 - 02:03

బ్రసెల్స్, నవంబర్ 25: చరిత్రాత్మక బ్రెగ్జిట్ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ నాయకులు ఆదివారం ఆమోదించారు. నాలుగు దశాబ్దాల తరువాత యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఒక నాయకుడు ‘విషాదం’గా అభివర్ణించారు. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే లేకుండానే యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 మంది నాయకులు ఆదివారం సమావేశమయి, బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించారు.

Pages