S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/22/2019 - 02:07

పెషావర్ : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయి తుపాకులతో కాల్పులు జరపడం, ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు. ఈ ఘాతుకానికి తామే పాల్పడ్డామని తెహరిక్-ఏ-తాలిబన్ (టీటీపీ) ప్రకటించింది. ఎక్కువ మంది ప్రాణాలు బలిగొని శాంతి-్భద్రతలకు విఘాతం కల్పించాలన్నది టీటీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

07/20/2019 - 23:37

వాషింగ్టన్, జూలై 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే వారం భేటీ అయినప్పుడు ఉగ్రవాద సమస్యే ప్రధాన అజెండా కానుంది. అంతేగాక, తాలిబన్ అంశం కూడా చర్చకు వస్తుందని వాషింగ్టన్ వర్గాలు అంటున్నాయి. తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థలను ఉక్కుపాదంతో అణచివేయాలని, తిరుగులేని కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసే అవకాశం ఉంది.

07/20/2019 - 23:35

వాషింగ్టన్, జూలై 20: రష్యాతో గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోవడం అమెరికాకు ఇబ్బందికరమైన అంశమేనని ఇండో-పసిఫిక్ కమాండర్ ఫిలిప్ డేవిడ్‌సన్ స్పష్టం చేశారు. ఎస్-400 రక్షణ వ్యవస్థను కొనేందుకు రష్యాతో భారత్ సుమారు 40,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

07/19/2019 - 23:07

కాట్మండు, జూలై 19: ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి ఉన్న భారత్ నుంచి అధిక శాతం లబ్ధి నేపాల్ కూడా పొందుతోందని అక్కడి భారత రాయబారి మంజీవ్ సింగ్ పూరి స్పష్టం చేశారు. భారత్-నేపాల్ సంబంధాలు.. అభివృద్ధి తదితర అంశాలపై శుక్రవారం జరిగిన సెమినార్‌లో పూరి మాట్లాడారు. భారత్ నుంచి పర్యాటకులు, విదేశీ పెట్టుబడులే ప్రధాన వనరుగా నేపాల్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

07/19/2019 - 04:10

టోక్యో, జూలై 18: హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరిగే జపాన్‌లో ఒక దహనకాండ 33 మందిని బలిగొంది. క్యోటో నగరంలో గల ఒక యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో ఎగిసిన మంటలు డజన్ల కొద్ది మందిని క్షతగాత్రులను చేశాయి. ఒక వ్యక్తి మూడంతస్తులు గల ఈ భవనంపై మండే స్వభావం గల ద్రవపదార్థాన్ని పోసి, నిప్పంటించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి ఈ దహనకాండకు ఎందుకు పాల్పడ్డాడనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు.

07/18/2019 - 23:45

కాట్మండు, జూలై 18: బౌద్ధుల పుణ్యభూమిగా భావించే నేపాల్ దేశంలో జరగకూడని విధ్వంసమే జరిగింది. బౌద్ధులు ఆరాధ్యదైవంగా భావించే బుద్ధుడికే కొంతమంది అపచారం తలపెట్టారు.

07/18/2019 - 23:05

ప్యారిస్‌లోని చాంటిలీలో గల తమ కార్యాలయం వద్ద అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ (కుడి)కు స్వాగతం పలుకుతున్న ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి బ్రూనోలే మైర్, బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ గవర్నర్ ఫ్రాంకోస్ విలెరాయ్ డి గల్ హువా. దేశంలో వివిధ అభివృద్ధి పనులకు ఐఎంఎఫ్ సాయాన్ని ఫ్రాన్స్ కోరుతోంది.

07/17/2019 - 04:18

ఐక్యరాజ్యసమితి, జూలై 16: భారత్‌లో తినడానికి తగినంత తిండిలేని వారి సంఖ్య తగ్గగా, ఊబకాయుల సంఖ్య పెరిగింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది.

07/16/2019 - 23:34

లండన్, జూలై 16: భారత్‌లోని మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు మారే పరిస్థితి లేదని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ విధానాన్ని రూపొందించడం జరిగిందని భారత్ వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పియూష్ గోయల్ మంగళవారం నాడిక్కడ వెల్లడించారు.

07/16/2019 - 23:22

ది హాగ్, జూలై 16: పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విధించిన భారత నేవీ రిటైర్డ్ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) బుధవారంనాడు తీర్పును వెలువరించనుంది. కుల్‌భూషణ్ జాదవ్ విడుదల కోసం భారత్ సమర్పించిన సమగ్ర సమాచారం ఆధారంగా ఐసీజే తన తీర్పును ప్రకటించనుంది. 49 ఏళ్ల జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రాంతంలో 2016 మార్చి 3న పాక్ సైన్యం పట్టుకుంది.

Pages