S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/20/2018 - 02:03

అబుదాబి, నవంబర్ 19: యూఏఈలో అతిపెద్దదైన షేక్‌జయేద్ గ్రాండ్ మసీదును ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ సందర్శించారు.

11/17/2018 - 22:43

వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికాలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేసే ఉద్యోగుల జీవిత భాగస్వాములు పనిచేసేందుకు వీలు కల్పించే హెచ్-4 వీసాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ఇద్దరు సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా మంది విదేశీ ఉద్యోగుల జీవితభాగస్వాముల ఏవలను వినియోగించుకోలేకపోతామని వాలు చెప్పారు. హెచ్-1 బీ వీసా విదేశీ ఉద్యోగులకు ఇస్తారు.

11/18/2018 - 04:57

మాలే, నవంబర్ 17:మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మొహమెద్ పదవీ స్వీకార ప్రమాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ ప్రముఖులతో మోదీ మాట్లాడారు. భారత్ నుంచి వచ్చిన మోదీకి ఇంతకు ముందు పార్లమెంట్ స్పీకర్ అబ్దుల్లా మసీ ఘన స్వాగతం పలికారు. 2011లో మన్మోహన్ పర్యాటన తర్వాత ఓ భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి.

11/17/2018 - 22:35

వాషింగ్టన్, నవంబర్ 17: జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య వెనక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ తేల్చింది. కాగా సౌదీ అరేబియా మాత్రం తమ యువరాజు పాత్ర లేదని పేర్కొంది. సౌదీరాజు సల్మాన్ ఖషోగ్గిపై అసలు అవగాహన లేదని, ఎవరో తెలియదని పేర్కొన్న విషయం విదితమే. ఈ వివరాలను మీడియా వర్గాలు వెల్లడించాయి.

11/17/2018 - 22:34

దుబాయి, నవంబర్ 17: భారత ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ వత్తిళ్లు లేకుండా జీవించడం ఎలా అన్న అంశంపై ఇక్కడి వలస కార్మికులకు పాఠాలు బోధించారు. 20 దేశాలకు చెందిన సుమారు 5000 మంది కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాకిస్తాన్ వలస కార్మికులూ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వచ్చారు.

11/17/2018 - 05:28

ఫ్యూజైర సిటీ (యూఏఈ): ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ మొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసిన సామూహిక ధ్యాన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రపంచశాంతి ప్రచారంలో భాగంగా ఇక్కడి ఫుట్‌బాల్ స్టేడియంలో మహిళలు, పిల్లలు సహా అన్ని వర్గాల వారు పెద్దయెత్తున పాల్గొన్నారు. 10,645 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం గురువారం సాయంత్రం ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన వారితో నిండిపోయింది.

11/16/2018 - 02:41

సింగపూర్, నవంబర్ 15: శాంతి, సౌభాగ్యాలతో కూడిన ఇండోపసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి భారత్ కట్టుబడి ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.

11/15/2018 - 02:00

సింగపూర్, నవంబర్ 14: మైన్మార్ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకీ దేశంలో రోహింగ్యా ముస్లింలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె శ్రద్ధ వహించి మానవ హక్కులను కాపాడాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కోరారు. సింగపూర్‌లో ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆగ్నేయాసియా దేశాల అధినేతలు, అమెరికా ఉపాధ్యక్షుడు హాజరయ్యారు.

11/15/2018 - 02:01

సింగపూర్, నవంబర్ 14: ఇళ్లల్లో పనులు చేసే రోబోలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే, ఇప్పుడు ‘రోబో పోలీస్’ కూడా వచ్చేశాడు. భద్రతా విధులను నిర్వర్తిస్తున్న ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ‘రోబోకాప్’ అందరినీ ఆకట్టుకుంటున్నది.

11/13/2018 - 01:50

కొలంబో, నవంబర్ 12: శ్రీలంక అధ్యక్షుడు మణిపాల సిరిసేనకు ప్రధాన రాజకీయ పార్టీలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 20నెలల గడువుకు ముందే పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశాయి.

Pages