S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/04/2016 - 01:12

న్యూయార్క్, సెప్టెంబర్ 3: రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు తీవ్రతను ఐక్యరాజ్య సమితి సభ్యులు గుర్తించాలని, అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఉగ్రవాద సమస్యపై పోరాడేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేయాలని ప్రపంచ దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది.

09/03/2016 - 11:43

వియత్నాం: భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆ దేశ ప్రధానితో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని, ఒప్పందాల వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు.

09/03/2016 - 07:30

హనోయ్, సెప్టెంబర్ 2:దాదాపు పదిహేనేళ్ల తర్వాత వియత్నాంలో పర్యటించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని నగరమైన హనోయ్‌లోకి అడుగు పెట్టారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక చర్యలపై వియత్నాం అగ్ర నాయకత్వంతో విస్తృత చర్చలు జరుపుతారు.

09/03/2016 - 07:25

వాషింగ్టన్, సెప్టెంబర్ 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయానికి ముందు 1990 దశకంలో తాను వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నట్లుగా ఆరోపిస్తూ తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించినందుకు బ్రిటీష్ దినపత్రిక ‘ది డైలీ మెయిల్’, అమెరికాకు చెందిన ఒక బ్లాగ్‌పై ట్రంప్ భార్య, గతంలో మోడల్‌గా పని చేసిన మెలానియా ట్రంప్ 15 కోట్ల డాలర్లకు పరువు నష్టం

09/03/2016 - 06:48

లాహోర్, సెప్టెంబర్ 2: ‘పాకిస్తాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుంద’ని భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీ సభ్యులు ఖండించారు. పారికర్ వ్యాఖ్యలపై భారత రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

09/03/2016 - 05:05

లాస్ ఏంజిలిస్, సెప్టెంబర్ 2: ప్రసిద్ధ అంతర్జాతీయ నటుడు జాకీచాన్‌కు సమున్నత ఆస్కారం పురస్కారం లభించింది. సినిమా రంగానికి భిన్న కోణాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా జాకీచాన్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించాలని ఆస్కార్ అకాడమీ సంకల్పించింది. నవంబర్ 12న ఈ గౌరవ పురస్కారాన్ని జాకీచాన్‌కు ప్రదానం చేస్తారు.

09/02/2016 - 17:43

చెన్నై: చెన్నైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తమిళనాడు గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తో ప్రమాణం చేయించారు. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో విద్యాసాగర్‌రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.

09/02/2016 - 17:26

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని మర్దాన్ జిల్లా కోర్టులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరగడంతో 12 మంది చనిపోయారు. 50 మంది గాయపడ్డారు. దాడి తమ పనే అని జమాత్ ఉర్ అహ్రార్ ప్రకటించుకుంది. మరోవైపు పెషావర్ సిటీలో శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు కలకలం సృష్టించడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

09/02/2016 - 16:55

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం వియత్నాం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. నాలుగో తేదీన చైనాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఐదో తేదీన లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు.

09/02/2016 - 12:35

పాకిస్థాన్ : కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ నోరు మెదపలేదు.

Pages