S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/04/2018 - 23:31

హరారే, నవంబర్ 4: భారతదేశం సంస్కృతి, ప్రాచీన నాగరికతలో యోగా భాగమని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ ఇండియన్ ఎంబసీ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో యోగా సెంటర్‌ను నిర్మిస్తారు. ఆఫ్రికాఖండంలో మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు శుక్రవారం చేరుకున్నారు.

11/04/2018 - 23:21

లీమాఖోంగ్ (మణిపూర్) నవంబర్ 4: వేర్పాటు సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వారి డిమాండ్లు విభిన్నమైనవి కావడం వల్ల మణిపూర్ రాష్ట్రంలో ఈ సమస్యను త్వరగా పరిష్కరించడం అంత సులభం కాదని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.

11/03/2018 - 23:23

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 3: మానవ హక్కుల అంశాలు రాజకీయంగా మారాయని, ఇది మంచి పరిణామం కాదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల మండలి పనితీరు సంక్లిష్టంగా మారిందని భారత్ పేర్కొంది. విదేశాంగ విధానంలో మానవ హక్కులను రాజకీయ కోణంగా చూడడం సరికాదని భారత్ ఉప శాశ్వత ప్రతినిధి తన్మయ లాల్ అన్నారు. మానవ హక్కుల మండలి ఎన్నో తీర్మానాలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.

11/04/2018 - 05:05

వాషింగ్టన్, నవంబర్ 3: అమెరికా విధించిన ఆంక్షలు నవంబర్ 5వ తేదీ నుంచి ఇరాన్‌ను భారీగా దెబ్బతీస్తాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లోని ‘దుష్ట ప్రభుత్వాని’కి వ్యతిరేకంగా ఇంత కఠినమయిన ఆంక్షలు ఇదివరకెప్పుడూ విధించలేదని ఆయన పేర్కొన్నారు.

11/03/2018 - 23:16

వాషింగ్టన్, నవంబర్ 3: తనపై జరిగిన లైంగిక దాడిపై మాజీ సంపాదకుడు ఎంజే అక్బర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నార నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్) ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఎంజే అక్బర్ వల్ల తనకు జరిగిన అన్యాయంపై వాషింగ్టన్ పోస్టులో చెప్పినవన్నీ వాస్తవాలేనని, వాటికి తాను కట్టుబడి ఉన్నానని శనివారం ఆమె స్పష్టం చేశారు.

11/03/2018 - 01:11

కొలంబో, నవంబర్ 2: శ్రీలంక సైనిక ప్రధానాధికారి అడ్మిరల్ రవి విజేగుణరత్నేకు న్యాయస్థానం గట్టిషాక్ ఇచ్చింది. ఎల్‌టీటీఈపై సైనిక చర్య సందర్భంగా 11 మంది యువకులు అచూకీ తెలియకుండా పోయింది. అడ్రస్ తెలియకుండాపోయిన వారిలో మైనారిటీ తమిళలున్నారు. 2008-2009 మధ్య కాలంలో ఇది చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ప్రధాని నిందితుణ్ని ఆర్మీ చీఫ్ విజేగుణరత్నే కాపాడుతున్నారని అభియోగం.

11/03/2018 - 01:08

కొలంబో, నవంబర్ 2: శ్రీలంకలో విక్రమసింఘేను ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పించి మహిందా రాజపక్సను నియమించడంతో తలెత్తిన సంక్షోభం శుక్రవారం కొత్త మలుపుతిరిగింది. పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు గురువారం నాడొక అధికార ప్రకటనలో వెల్లడించారు. పార్లమెంట్ 5న సమావేశమవుతుందని రాజపక్స కార్యాలయం తెలిపింది.

11/03/2018 - 01:07

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం హెచ్-18 దరఖాస్తు ప్రక్రియను సంక్లిష్టం చేస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న కంపెనీలు తమకు కావాల్సిన నిపుణులను హెచ్-18 వీసా కింద విదేశాల నుంచి రప్పించుకునేవి. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు అంత సులభం కాదు. దీనికి ఆయా కంపెనీలు అమెరికా ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంది.

11/03/2018 - 01:05

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికాలో పుడితే చాలు ఇక్కడ పౌరసత్వం వస్తున్న మాట ఏమో కాని దీనివల్ల దేశంలో మాత్రం ‘బర్త్ టూరిజం’ మాత్రం పెరుగుతోందని, చైనీయులు దీనివల్ల పెద్దయెత్తున లాభపడుతున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ‘అక్రమ వలసదారులైనా, ఇక్కడ పౌరసత్వం లేనివారైనా ఫర్వాలేదు..

11/01/2018 - 22:32

వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికాలో మీడియా తప్పుడు వార్తలను ప్రజలు అందిస్తోందని, నిరాధారమైన సమాచారం ఇస్తూ మీడియా ప్రజలకు శత్రువుగా మారిందని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. అమెరికా ప్రముఖ మీడియా సంస్థలు సీఎన్‌ఎన్, ఎబీసీన్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు తదితర మీడియా సంస్థలపై ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిప్పులు గక్కుతున్న విషయం విదితమే.

Pages