S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/29/2018 - 03:33

వాషింగ్టన్, అక్టోబర్ 28: ఒక శే్వతజాతీయుడు జరిపిన కాల్పుల్లో 11 మంది భక్తులు మృతి చెందిన సంఘటన అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శనివారం చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో యూదులపై జరిగిన దాడిలో అతి విషాదకరమైనదిగా దీనిని భావిస్తున్నారు.

10/29/2018 - 03:28

కొలంబో, అక్టోబర్ 28: శ్రీలంక రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రధాని పదవి నుంచి విక్రమ్‌సింఘేను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న దేశ అధ్యక్షుడు సిరిసేన నిర్ణయానికి విరుద్ధంగా పార్లమెంట్ స్పీకర్ విక్రమ్‌సింఘేనే ప్రధానిమంత్రిగా ప్రకటించడం సర్వత్రా అక్కడి పరిణామాల పట్ల ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంతకూ విక్రమ్‌సింఘే పదవిలో ఉన్నాడా, లేడా అన్నది సందిగ్ధంగానే కన్పిస్తోంది.

10/28/2018 - 05:08

కొలంబో:శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘేను తొలగించిన దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం నవంబర్ 16వరకూ పార్లమెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

10/28/2018 - 04:03

వాషింగ్టన్, అక్టోబర్ 27: న్యాయ చట్టబద్ధంగా ఇమ్మిగ్రేషన్ కోసం వేచి చూస్తున్న వారికి తప్పనిసరిగా అనుమతులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నరు. లక్షలాది మంది ప్రజలు అమెరికా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. శనివారం ఇకడ ఉత్తర కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అమెరికా సరిహద్దులు బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

10/26/2018 - 04:11

మాస్కో, అక్టోబర్ 25: రష్యన్ మిలిటరీ అవసరాల నిమిత్తం రష్యా గురువారం సోయజ్ అనే రోదసీ నౌకను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ తరహా రోదసీ నౌకను ఈ నెల 11వ తేదీన ప్రయోగించగా, సాంకేతిక కారణాల వల్ల విఫలమైంది. భారత కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు రోదసీ నౌక ప్రయోగం విజయవంతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశించిన కాలపరిమితిలో కక్షలోకి రోదసీ నౌక చేరింది.

10/26/2018 - 04:09

వాషింగ్టన్, అక్టోబర్ 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెల్‌ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందా? ఆయన చేసే సంభాషణలు ఇతరులు ఎవరైనా వింటున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ట్రంప్ తన ఐ పోన్ ద్వారా జరిపే సంభాషణలు చైనా, రష్యా దేశాలు దొంగచాటుగా వింటున్నాయని న్యూయార్కు టైమ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది.

10/25/2018 - 01:16

టోక్యో, అక్టోబర్ 24: ఇక్కడి మెడికల్ కళాశాల అడ్మిషన్లలో మహిళల ప్రాధాన్యతను తగ్గించేందుకు కావాలని మార్కుల జాబితాల్లో మార్పులు చేశారని దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో తమకు జరిగిన అన్యాయానికి సీట్లు కోల్పోయిన మహిళా అభ్యర్థులు నష్టపరిహారాన్ని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు.

10/25/2018 - 01:08

కొలంబో, అక్టోబర్ 24: నేను నిర్దోష్టిని, నాకు ఏమీ తెలియదు. నన్ను ఈ కేసు నుంచి విముక్తి చేయండి అంటూ మార్సెలీ థామస్ అనే భారతీయుడు శ్రీలంక కోర్టుకు విన్నవించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసేన హత్యకు కుట్రపన్నారనే అభియోగంపై థామస్‌ను కొలంబో పోలీసులు అరెస్టు చేసి ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

10/25/2018 - 01:08

టోక్యో, అక్టోబర్ 24: సిరియాలో మూడేళ్లక్రితం కిడ్నాప్‌కు గురైన ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్టు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించినట్లు జపాన్ పేర్కొంది. ఈ జర్నలిస్టు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి పేరు జంపమాయ్ యసుదా అని విదేశాంగ శాఖ మంత్రి టారో కొనో చెప్పారు.

10/25/2018 - 00:55

టొరొంటో, అక్టోబర్ 24: కెనడాకు చెందిన రాపర్ జాన్ జేమ్స్ మెక్‌ముర్రే ఒక విమానంపై స్టంట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. 34 ఏళ్ల జాన్ జేమ్స్ రాప్ మ్యూజిక్ చేస్తూ విమానం రెక్కపై నడుస్తూ స్టంట్ చేయాల్సి ఉంది. ఈ స్టంట్ కోసం ఆయన తీవ్రస్థాయిలో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే, శనివారం ఈ దృశ్యం చిత్రీకరణ సందర్భంగా విమాన గమనంలో తీవ్రమయిన తప్పిదం జరిగింది. పైలట్ దానిని నియంత్రించలేకపోయారు.

Pages