S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/24/2018 - 01:48

ఐక్యరాజ్యసమితి, అక్టోబర్ 23: మనసుదోచే సరోద్ మాస్ట్రో అంజాద్ అలీఖాన్ సంగీత ఝరి ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రతిధ్వనించనుంది. మహాత్మాగాంధీకి నివాళిగా బుధవారం నాడాయన ఐరాస వార్షిక సదస్సులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ‘అహింసా సిద్ధాంతానికి ఆలంబనగా సాగనున్న ఈ కార్యక్రమం చరిత్రను మారుస్తుంద’ని ఐరాస చీఫ్ ఆంటోనియో గట్టర్స్ పేర్కొన్నారు.

10/23/2018 - 02:03

ఇస్లామాబాద్, అక్టోబర్ 22: చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందుని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. చర్చలకు భారత్ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలో ఆదివారం నాడు పేలుళ్లలో ఆరుగురు పౌరులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ ఘటనా స్థలంలో ఇది చోటుచేసుకుంది.

10/22/2018 - 01:30

వాషింగ్టన్, అక్టోబర్ 21: ‘అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాన్ని వారు ఉల్లంఘిస్తూ ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు, దీనిపై అభ్యంతరాలు చెబుతున్నా లక్ష్యపెట్టడం లేదు, ఇక మేమెందుకు ఇంకా దీనికి కట్టుబడి ఉండాలి? అందుకే మేము కూడా దీని నుంచి బయటకు వస్తున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

10/20/2018 - 06:13

బ్రస్సెల్, అక్టోబర్ 19: గీస్, పోర్చుగల్ ప్రధాన మంత్రులతో భారత ఉప రాష్టప్రతి ఎం.వెంక య్య నాయుడు గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. పరస్పర ఆర్థిక, ప్రజా సహకారాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు.

10/20/2018 - 06:29

వాషింగ్టన్: గత యేడాది యాభై వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. అంతకు క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే 2017లో నాలుగువేల మందికి అధికంగా ఈ హక్కు లభించిందని ఆ దేశంలోని హోంలాండ్ సెక్యూరిటీ శాఖ తాజాగా వెల్లడించిన ఇమ్మిగ్రేషన్ నివేదిక వెల్లడించింది. 2017లో మొత్తం 50,802 మంది భారతీయులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పౌరసత్వం తీసుకున్నారు.

10/18/2018 - 05:28

* బుధవారం రాత్రితో ముగియనున్న ప్రచారం

10/18/2018 - 05:24

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు 2018లో తమ రాజకీయాలను ప్రచారం చేసుకోవడానికి భారీగా 4.5 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా. అయితే, ఇప్పటికే మొదలయిన ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో కొంత మంది తక్కువ వ్యయంతో ఎనలేని ప్రాచుర్యాన్ని, ఫలితాన్ని పొందిన సంఘటనలూ ఉన్నాయి.

10/17/2018 - 01:47

లండన్, అక్టోబర్ 16: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్‌లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఐఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) ఆధిక్యాన్ని కనబరిచాయి. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూఎస్ క్వాక్వెరెల్లీ సైమండ్స్ అనే సంస్థ రూపొందించిన ‘క్యూఎస్ ఇండియా యూనివర్సిటి ర్యాంకింగ్స్’లో ఐఐటీ బాంబే అగ్ర స్థానాన్ని ఆక్రమించింది.

10/15/2018 - 22:56

వాషింగ్టన్, అక్టోబర్ 15: వాతావరణ మార్పుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలిక్కరుచుకున్నారు. మొదట ఈ మార్పులు అభూత కల్పన అని పేర్కొన్న ఆయన ప్యారిస్ పర్యావరణ ఒప్పందంపైనా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ పర్యావరణ మార్పులు వాస్తవమేనని, ఇవి కల్పన కాదంటూ వాస్తవ పరిస్థితుల్ని అంగీకరించారు.

10/15/2018 - 06:43

వాషింగ్టన్, అక్టోబర్ 14: అమెరికా ప్రతిభావంతులకే పట్టం కడుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం తమ దేశానికి వచ్చేవారు వృత్తిలో ప్రతిభావంతులై ఉండాలని, అలాంటి వారికి తాము అభ్యంతరం చెప్పబోమని ఆయన వెల్లడించారు. భారత్ సహా విదేశాల నుంచి వృతి నిపుణులు ప్రతిభావంతులై ఉండాలని ఆయన చెప్పారు.‘అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి నేను పదేపదే చెబుతున్నది ఒకటే.

Pages